Home /News /movies /

NETIZENS GIVES STRONG WARNING TO JABARDASTH HYPER AADI ON CONTROVERSIAL SKIT BS

చెప్పు తెగుద్ది అంటూ హైపర్ ఆదికి స్ట్రాంగ్ వార్నింగ్..

హైపర్ ఆది ఫైల్ ఫోటో

హైపర్ ఆది ఫైల్ ఫోటో

Jabardasth Comedy: హైపర్ ఆది స్కిట్‌లు నవ్వులు పంచే కంటే కూడా ఎక్కువ వార్తల్లో నిలుస్తాయి. మెగా అభిమాని అయిన హైపర్ ఆది.. తన స్కిట్‌లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలకు గురవుతాడు. అప్పట్లో ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ తన స్కిట్‌లో వ్యాఖ్యలు చేసి, ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యాడు.

ఇంకా చదవండి ...
    జబర్దస్త్ షోలో హైపర్ ఆది కామెడీకి చాలా మంది అభిమానులు ఉన్నారు. అతడు వేసే పంచ్‌లకు, ప్రాసలకు నవ్వు ఆపుకోలేరు. తన మీద తాను కూడా పంచ్‌లు వేసుకొని నవ్వులను పంచుతాడు. అతడు స్కిట్ చేస్తున్నంత సేపు టీవీ చూసే ప్రేక్షకులు, జడ్జిలుగా వ్యవహరించే నాగబాబు, రోజా నవ్వుతూనే ఉంటారు. అయితే.. అతడి స్కిట్‌లు నవ్వులు పంచే కంటే కూడా ఎక్కువ వార్తల్లో నిలుస్తాయి. మెగా అభిమాని అయిన హైపర్ ఆది.. తన స్కిట్‌లలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ విమర్శలకు గురవుతాడు. అప్పట్లో ఓ వర్గాన్ని టార్గెట్ చేస్తూ తన స్కిట్‌లో వ్యాఖ్యలు చేసి, ప్రేక్షకుల ఆగ్రహానికి గురయ్యాడు. ముఖ్యంగా భార్యలను, మహిళలను టార్గెట్ చేసుకొని వేసే పంచ్‌లను పలు మహిళా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. అయినా సరే.. తన పద్ధతి మార్చుకోలేదు. రీసెంట్‌గా వైసీపీ ఎమ్మెల్యే, జబర్దస్త్ జడ్జి రోజాపైనా ఓ వివాదాస్పద వ్యాఖ్య చేశాడు. ‘పళ్లతో, పావురాలతో కొట్టడానికి నువ్వేమన్నా రోజా గారివా’ అంటూ చేసిన వ్యాఖ్య ఆగ్రహాన్ని తెప్పించింది. ఆ సమయంలో రోజా కూడా షాక్ అయ్యింది.

    అయితే, గత వారం ప్రసారమైన స్కిట్‌లోనూ హైపర్ ఆది వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. స్కిట్‌లో భాగంగా.. సుడిగాలి సుధీర్, హైపర్ ఆది వాదించుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో సుధీర్.. ‘నా గురించి నీకు సరిగా తెలీదు’ అంటాడు. దాంతో ఆది.. ‘హే.. నీ గురించి నాకు తెలియకపోవడం ఏంటి?.. నీ ఫోన్‌లో మొత్తం ఫోన్ నంబర్లు 63,73,99,000 అని అంటాడు. దానికి ‘అంత కరెక్ట్‌గా ఎలా చెప్పావు?’ అని అడుగుతాడు సుధీర్. ‘మన దేశంలో మొత్తం ఆడాళ్ల సంఖ్య అదే’ అంటూ పంచ్ వేస్తాడు ఆది. ఆ వ్యాఖ్యలకు అక్కడే ఉన్న యాంకర్ అనసూయ నాలుక కరుచుకోగా, రోజా చేత్తో నోరు కట్టేసుకుంది.

    అయితే, ఆ వ్యాఖ్యలు నెటిజన్లలో ఆగ్రహాన్ని తెప్పించాయి. మన దేశంలో మొత్తం ఆడాళ్ల సంఖ్య అంటే.. అందులో నీ చెల్లి, తల్లి కూడా ఉంటుంది కదరా.. అంటూ తమ ప్రతాపాన్ని చూపించారు. ఫేస్‌బుక్‌లో అయితే ఏకంగా బూతులతో ఆదిని తిట్టిపోశారు. ఓ నెటిజన్ అయితే.. ‘ఒరేయ్... మీ అమ్మ, చెల్లి అందరూనా? కంట్రోల్ చేస్కో. లేదంటే.. చెప్పు తెగుద్ది’ అంటూ తీవ్ర పదజాలంతో దూషించాడు. అతనొక్కడే కాదు.. చాలా మంది నెటిజన్లు హైపర్ ఆదిపై తీవ్ర ఆగ్రహాన్ని వెలిబుచ్చారు.
    First published:

    Tags: Hyper Aadi, Jabardasth comedy show, Telugu Cinema, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు