Praveen Kumar VadlaPraveen Kumar Vadla
|
news18-telugu
Updated: December 24, 2019, 8:21 PM IST
నిహారిక, నాగబాబు
పదేళ్ల వయసొచ్చాక పిల్లల ముందు ఏదైనా బూతులు మాట్లాడటానికే అమ్మో అనుకుంటాం.. ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తుంటాం. అలాంటిది వయసొచ్చిన పిల్లల ముందు తండ్రే కాస్త తప్పుగా ప్రవర్తిస్తుంటే ఇంకేమైనా ఉందా..? అసలు ఆ తండ్రికి తెలివుందా అంటూ అక్షింతలు పడతాయి. నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా ఇప్పుడు మెగా బ్రదర్ నాగబాబు విషయంలో కూడా ఇదే జరుగుతుంది. ఈయనేం తప్పు చేసాడబ్బా అనుకోవచ్చు కానీ తెలియకుండానే ఇప్పుడు ఈయన నెటిజన్స్తో తిట్లు తింటున్నాడు. దానికి కారణం అదిరింది షో. జీ తెలుగులో ఈ మధ్యే మొదలైన ఈ షోకు మంచి రెస్పాన్స్ వస్తుంది.

నాగబాబు నిహారిక ఫైల్ ఫోటోస్
జబర్దస్త్ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈయన చేస్తున్న కార్యక్రమం కావడంతో ఆసక్తి కూడా బాగానే ఉంది అందరిలో. తొలి ఎపిసోడ్ కూడా బాగానే ప్లే అయింది. పాత జబర్దస్త్ టీం లీడర్స్ అంతా కలిసి ఇక్కడ కనిపించారు. ఇదిలా ఉంటే ఈ ఎపిసోడ్కు నాగబాబుతో కలిసి నిహారిక కూడా వచ్చింది. ఆమె కూడా జడ్జిగా వచ్చింది. అయితే అంతా బాగానే ఉంది కానీ అక్కడ వచ్చిన కొన్ని స్కిట్స్లో డబుల్ మీనింగ్ డైలాగులు బాగానే వచ్చాయి. ధన్రాజ్, చంద్ర స్కిట్స్లో కాస్త హద్దు మీరిన డైలాగులు వచ్చాయి. వాటికి నాగబాబు ఫుల్లుగా నవ్వేసాడు. నిహారిక కూడా బాగానే ఎంజాయ్ చేసింది. అయితే చంద్ర మాత్రం నా పెళ్లాం బాగోలేదా అంటూ లైన్ రాసుకుని స్కిట్ చేసాడు.

నాగబాబు నిహారిక ఫైల్ ఫోటోస్
అందులో నాగబాబును కూడా అడుగుతారు. బాబుగారూ నా పెళ్లాం ఎలా ఉంది అంటే.. వెంటనే దానికేంట్రా కత్తిలా ఉంది అంటాడు నాగబాబు. పక్కనే కూతుర్ని పెట్టుకుని ఇలా అనడమేంటి.. దాంతోపాటు మరిన్ని బూతు జోకులకు కూడా నాగబాబు పడి పడి నవ్వడం నెటిజన్లకు కోపం తెప్పిస్తుంది. మీ లాంటి వాళ్లు కూడా ఇలా చేస్తే ఎలా సర్.. పక్కనే కూతుర్ని పెట్టుకుని ఇలా డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడితే ఎలా అండీ అంటూ కొందరు మర్యాదగా విమర్శలు చేస్తుంటే.. కొందరు మాత్రం కాస్త నాటుగానే రిప్లై ఇస్తున్నారు. మొత్తానికి నిహారిక పక్కనుండగానే నాగబాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోతున్నాయి.
Published by:
Praveen Kumar Vadla
First published:
December 24, 2019, 8:21 PM IST