మీటూ వివాదంలో మణిరత్నం... ప్రశ్నిస్తున్న నెటిజెన్స్

#MeeToo : మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా  సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

news18-telugu
Updated: September 10, 2019, 11:10 AM IST
మీటూ వివాదంలో మణిరత్నం... ప్రశ్నిస్తున్న నెటిజెన్స్
Instagram
  • Share this:
మీటూ ఉద్యమం దేశ వ్యాప్తంగా  సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో భాగంగా ఎంతో మంది హీరోయిన్స్, వీరితో పాటు వివిధ రంగాల్లో పనిచేస్తోన్న మహిళలు తమకు తమ జీవితంలో, వ‌ృత్తి పరంగా ఎదురైన చేదు అనుభవాలను సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. హీందిలో నటి తనుశ్రీ దత్తా మీటూ ఉద్యమానికి ఊపిరిపోయగా... తెలుగులో శ్రీరెడ్డి ఆ ఉద్యమాన్ని అందుకోగా.. తమిళంలో ఎక్కువగా వినపడ్డ పేరు సింగర్ చిన్మయి. తమిళ కవి వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని సింగర్ చిన్మయి సోషల్ మీడియా వేదికగా చాలా సార్లు వెల్లడించింది.  దీంతో చిన్మయి చాలా అవకాశాలను కూడా కొల్పోయినట్లు పేర్కోంది.  కాస్తా సల్లబడ్డ మీటూ ఉద్యమం మరోసారి తెరపైకి వచ్చింది.

వివరాల్లోకి వెళితే.. తమిళ దర్శకుడు మణిరత్నం.. తన కొత్త సినిమా విషయంలో తీసుకున్న ఓ నిర్ణయంతో మీటూ ఉద్యమకారులు, నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా మణిరత్నంపై విరుచుకుపడుతున్నారు.

తమిళ రచయిత వైరముత్తు, సింగర్ చిన్మయి Photo : Instagram
తమిళ రచయిత వైరముత్తు, సింగర్ చిన్మయి Photo : Instagram


మణిరత్నం తన కొత్త సినిమా 'పొన్నియన్ సెల్వన్'‌కు తమిళ రచయిత వైరముత్తును ఎంచుకున్నాడట. అంతేకాదు ఆ సినిమాలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా  12 పాటలు రాయించాడట. దీంతో మీటూ ఉద్యమకారులు, నెటిజెన్స్ మణిరత్నాన్ని విమర్శిస్తున్నారు. తెలిసి తెలిసి ఎలా లైగింక వేధింపుల ఆరోపణలు ఎదుర్కోంటున్న రచయితకు అవకాశం ఇస్తారంటూ.. మండిపడుతున్నారు. అంతేకాదు వెంటనే వైరముత్తును సినిమా నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. మణిరత్నంతో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్‌ను కూడా విమర్శిస్తున్నారు నెటిజెన్స్.
First published: September 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>