సిగ్గు లేదురా.. ఆ జబర్దస్త్ కమెడియన్‌పై నెటిజన్లు ఆగ్రహం..

Jabardasth Comedy Show: జబర్దస్త్‌లో మూడేళ్లకు పైగా 300 స్కిట్స్ చేసిన ఓ కమెడియన్ అదే షోపై ఈ మధ్య నీచమైన వ్యాఖ్యలు చేసాడు. జబర్దస్త్ ఎవడికి లైఫ్ ఇవ్వలేదని కామెంట్ చేసాడు.

Praveen Kumar Vadla | news18-telugu
Updated: March 25, 2020, 5:22 PM IST
సిగ్గు లేదురా.. ఆ జబర్దస్త్ కమెడియన్‌పై నెటిజన్లు ఆగ్రహం..
ఎక్స్‌ట్రా జబర్దస్త్ కామెడీ షో (extra jabardasth)
  • Share this:
అమ్మో.. ఇంత ఘాటుగా ఎవరు ఎవర్ని తిడుతున్నారు అనుకుంటున్నారా..? అసలు ఇంతగా తిట్టాల్సి వచ్చిదంటే.. అవతల ఆ కమెడియన్ ఇంకెంత తప్పు చేసాడో అని ఆలోచిస్తున్నారా..? ఇక్కడ కమెడియన్ ఎవరు.. నెటిజన్స్ ఎందుకు తిడుతున్నారు తెలియాలంటే ఈ స్టోరీ మీకు తెలియాల్సిందే. జబర్దస్త్‌లో మూడేళ్లకు పైగా 300 స్కిట్స్ చేసిన ఓ కమెడియన్ అదే షోపై ఈ మధ్య నీచమైన వ్యాఖ్యలు చేసాడు. జబర్దస్త్ ఎవడికి లైఫ్ ఇవ్వలేదని కామెంట్ చేసాడు. ఎన్నో కోట్ల మందిని నవ్విస్తున్న షోపై ఇలాంటి కామెంట్స్ చేసింది ఎవరో కాదు.. ఆ షో నుంచి బయటికి వచ్చిన కిరాక్ ఆర్పీ. అసలు జబర్దస్త్ కామెడీ షో ఎవడికి లైఫ్ ఇవ్వలేదని ఈయన కామెంట్ చేసాడు.

జబర్దస్త్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కిరాక్ ఆర్పీ (Kiraak RP)
జబర్దస్త్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కిరాక్ ఆర్పీ (Kiraak RP)


ఈయన వ్యాఖ్యలు కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. కొన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షోలోనే నటించిన ఈయన ఇప్పుడు అక్కడ మానేసి అదిరిందిలో చేస్తున్నాడు. నాగబాబుతో పాటే జబర్దస్త్ మానేసి అక్కడికి వెళ్లాడు ఆర్పీ. చమ్మక్ చంద్ర కూడా ఇప్పుడు అక్కడే ఉన్నాడు. అయితే ఆయన మాత్రం తనకు జబర్దస్త్ ఎప్పుడూ లైఫ్ ఇచ్చిన షో.. దానికి జీవితాంతం రుణపడి ఉంటానని చెప్పాడు. కానీ కిరాక్ ఆర్పీ మాత్రం సంచలన వ్యాఖ్యలు చేసాడు. లైఫ్ ఇవ్వడం అనేది చాలా పెద్ద పదమని.. దాన్ని ఎక్కడ బడితే అక్కడ వాడకూడదని చెప్పాడు. లైఫ్ ఇవ్వడం అంటే నువ్వు చేయలేవు అనుకున్న వాన్ని కూడా తీసుకొచ్చి.. చేయగలవని ప్రోత్సహించడం అని జబర్దస్త్‌లో అలా ఎవరూ చేయలేదని చెప్పాడు ఆర్పీ.

జబర్దస్త్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కిరాక్ ఆర్పీ (Kiraak RP)
జబర్దస్త్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన కిరాక్ ఆర్పీ (Kiraak RP)
వాళ్లకు మేం అవసరం.. అది మాకు ఓ అవకాశం అంతేకానీ లైఫ్ ఇచ్చేంత సినిమా ఎవరికి లేదని కామెంట్ చేసాడు ఆర్పీ. అక్కడ అందర్నీ వాడుకున్నారని చెప్పాడు ఆర్పీ. చస్తే ఇక తాను ఈటీవీ జోలికి కానీ.. జబర్దస్త్ వైపు కానీ వెళ్లనని సంచలన కామెంట్స్ చేసాడు ఈయన. తన టాలెంట్‌తోనే పైకి వచ్చానని.. వాళ్లు ఇచ్చిన అవకాశాన్ని యూజ్ చేసుకున్నానని.. అంతేకానీ ఎవడో పైకి తీసుకొస్తే రాలేదని చెప్పాడు ఈయన. ఆర్పీ మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఎంత కాదనుకున్నా కూడా రోడ్డు మీద ఉన్న నిన్ను తీసుకొచ్చి లైఫ్ ఇచ్చిన షో గురించి ఇప్పుడు అలా మాట్లాడటానికి సిగ్గు లేదా నీకు అంటూ నెటిజన్లు ఆర్పీపై మండి పడుతున్నారు.

అదిరింది కామెడీ షో... (adirindi Nagababu)
అదిరింది కామెడీ షో... (adirindi Nagababu)


జబర్దస్త్ కామెడీ షో నుంచి బయటికి వచ్చేటప్పుడు కిరాక్ ఆర్పీతో వాళ్లకు గొడవ అయిందనే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఈయన మాటలు విన్న తర్వాత కన్ఫర్మేషన్ వచ్చింది. ఏదేమైనా కూడా లైఫ్ ఇచ్చిన షో గురించి ఇలా మాట్లాడటం మాత్రం నిజంగానే తప్పు అంటున్నారు విశ్లేషకులు. ఇదే షో నుంచి బయటికి వచ్చిన చమ్మక్ చంద్ర ఇప్పటికీ తనకు జబర్దస్త్ అంటే అమ్మలాంటిదే అంటున్నాడు. ఆయన్ని చూసి బుద్ది తెచ్చుకో.. అన్నం పెట్టిన షో గురించి అలా మాట్లాడటానికి నోరెలా వచ్చింది అంటూ నెటిజన్లు మండి పడుతున్నారు. మరోవైపు ఆర్పీ మాత్రం తన టార్గెట్ కామెడీ కాదు.. దర్శకత్వం అంటున్నాడు.
First published: March 25, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు