Karthika Deepam: స్టార్ మాలో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ కోసం సామాన్యులే కాకుండా సెలబ్రిటీలు కూడా అలవాటు పడిపోయారు. అన్ని సీరియల్స్ కంటే ఈ సీరియల్ రేటింగ్ విషయంలో అత్యధిక స్థాయిలో ఉంది. ఇక ఈ మధ్య ఈ సీరియల్ కథ కాస్త ఆసక్తిగా మారటంతో ప్రతి ఒక్కరు సీరియల్ సమయాని కంటే ముందే హాట్ స్టార్ లో చూసేస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎన్నో రోజుల నుండి కార్తీక్, దీప ల కలయిక కోసం ఎదురు చూస్తున్న ప్రేక్షకులు ఇంకెప్పుడు కలుస్తారా అని ప్రతిరోజు రెప్పపాటు సమయాన్ని కూడా వదలకుండా చూడగా ఇటీవలే కార్తీక్ దీప అమ్మ తనం గురించి నిజం తెలుసుకున్నాడు. దీంతో కథ మొత్తం మరింత ఆసక్తిగా మారింది. ఇప్పటివరకు ఈ సీరియల్ కథలో ఎన్నో ట్విస్టులు మార్చిన దర్శకుడు.. మొత్తానికి కథను శుభం కార్డు అందిస్తాడెమో అనుకోగా మళ్లీ మరో ట్విస్ట్ తో ఎంట్రీ ఇప్పించాడు.
మొత్తానికి దీప అనారోగ్యం నుంచి కోలుకొని సంతోషంగా కార్తీక్ కు భార్య గా అత్తారింట్లో అడుగు పెట్టింది. ఇక ఈ నేపథ్యంలో కార్తీక్ దీప క్షమాపణ చెప్పడానికి సరైన సమయం కోసం ఎదురు చూడగా మొత్తానికి ఈరోజు ఎపిసోడ్ లో దీప కు క్షమాపణలు చెబుతాడు. ఇక అంతలోనే మోనిత ఎంట్రీ ఇవ్వగా సౌందర్య తో మీ కొడుకు వల్లే నెల తప్పాను అంటూ షాక్ ఇస్తుంది. ఇక దీంతో సౌందర్య కుటుంబమే కాకుండా ప్రేక్షకులు కూడా షాక్ తిన్నారు.
ఇప్పటికే వంటలక్క ను సీరియల్ స్టార్ట్ అయినప్పటి నుండి ఏడిపిస్తున్న డైరెక్టర్ ఇప్పుడిప్పుడే నవ్వు ముఖం పడుతున్న సమయంలో మళ్లీ మన వంటలక్క ను ఈ ట్విస్టుతో ఏడుపిస్తున్నాడని ప్రేక్షకులు, నెటి జనులు మండిపడుతున్నారు. కథ మొత్తం శుభం కార్డు పలుకుతుందనే సమయంలో కథనే అడ్డం తిప్పావ్ కదయ్యా అంటూ ప్రేక్షకులు.. దర్శకుడిపై ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. ఇలాంటి ట్విస్టులు ఉంటే ఇకపై ఈ సీరియల్ చూడమంటూ తెగ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలో కార్తీకదీపం దర్శకుడు అభిమానుల కోసం కథను శుభం కార్డు పలికిస్తాడో లేదా మళ్లీ ట్విస్టులతో వంటలక్కని ఏడిపిస్తాడో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Doctor babu, Karthika deepam, Monitha, Premi vishwanth, Vantalakka