‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై నెటిజన్స్ ఫైర్..

అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై నెటిజన్స్ ఫైర్ అయ్యారు.

news18-telugu
Updated: December 4, 2019, 7:38 AM IST
‘అర్జున్ రెడ్డి’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాపై నెటిజన్స్ ఫైర్..
సందీప్ రెడ్డి వంగా ఫైల్ ఫోటో
  • Share this:
'అర్జున్ రెడ్డి',‘కబీర్ సింగ్’ సినిమాల పై ఇప్పటికీ ఎన్నో విమర్శలు తలెత్తాయి. తెలుగు సినిమా ‘అర్జున్ రెడ్డి’కి రీమేక్‌గా వచ్చిన ‘కబీర్ సింగ్’ సినిమాలో లో మహిళలను తక్కువ చేసి చూపించారని, హీరో పాత్రను ఎలాంటి గమ్యం లేకుండా కేవలం ఓ తాగుబోతుగా, తన మీద కంట్రోల్‌ లేని వ్యక్తిగా చూపించారని చాలా మంది విమర్శించారు. అయితే సందీప్ వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటు టాలీవుడ్ లో , ఇటు బాలీవుడ్ లో కలెక్షన్స్ కురిపించింది. ఇదిలావుంటే .. ఇటీవల హైదరాబాద్‌లో ఓ యువ వైద్యురాలిపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, అనంతరం ఆమెను హత్య చేసిన విషయం తెలిసిందే. ఈ దారుణానికి ఒడిగట్టిన వారిని కఠినంగా శిక్షించాలంటూ సోషల్‌మీడియా వేదికగా సెలబ్రిటీలు పోస్ట్‌లు పెడుతున్నారు. ఈ క్రమంలో సందీప్‌రెడ్డి వంగా ట్విటర్‌ వేదికగా ఓ ట్వీట్‌ పెట్టారు.‘సమాజంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండటానికి భయం ఒక్కటే మార్గం. దోషులను కఠినంగా శిక్షించి ఇలాంటి పని చేసేవారిలో వణుకు పుట్టించాలన్నారు. ప్రస్తుతం దేశంలోని ప్రతి అమ్మాయికి భరోసా అవసరం’ అని సందీప్‌ ట్వీట్‌ చేశారు.

I don't watch Shahid Kapoor's Kabir Singh.. Vijay Devarakonda Interesting comments on Arjun Reddy remake pk.. క‌బీర్ సింగ్.. ఇప్పుడు బాలీవుడ్ ఇండ‌స్ట్రీని ఊపేస్తున్న సినిమా ఇది. రివ్యూ రైట‌ర్స్ అంతా క‌లిసిక‌ట్టుగా సినిమాను ప్లాప్ అని డిసైడ్ చేసినా కూడా ప్రేక్ష‌కులు మాత్రం నెత్తిన పెట్టుకున్నారు. vijay devarakonda,vijay devarakonda twitter,vijay devarakonda dear comrade,vijay devarakonda movies,vijay devarakonda kabir singh movie,vijay devarakonda dear comrade release date,kabir singh,vijay devarakonda,kabir singh trailer,kabir singh movie,kabir singh song,vijay deverakonda,kabir singh shahid kapoor,kabir singh trailer launch,shahid kapoor kabir singh,kabir singh vs arjun reddy,shahid kapoor about vijay devarakonda,kabir singh review,kabir singh teaser,arjun reddy vs kabir singh,kabir singh full movie,vijay devarakonda sensational comments on kabir singh,telugu cinema,డియర్ కామ్రేడ్,విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్,విజయ్ దేవరకొండ కబీర్ సింగ్,షాహిద్ కపూర్ విజయ్ దేవరకొండ,తెలుగు సినిమా
విజయ్ దేవరకొండ,షాహిద్ కపూర్


ప్రస్తుతం ఈ ట్వీట్ పై అటు సీలెబ్రిటీలు ఇటు సామాన్యులు విమర్శలు కురిపిస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' , కబీర్ సింగ్' లాంటి సినిమాలు నిర్మించిన మీరు భయం గురించి మాట్లాడడం హాస్యాస్పదం అంటూ ఒక నెటిజెన్ విమర్శిస్తే, ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య కబీర్‌సింగ్‌లోని ఓ సన్నివేశాన్ని ఉద్దేశిస్తూ సందీప్‌కు చురకలంటించే ప్రయత్నం చేశారు. ‘మీరు చెబుతున్న ఆ భయం.. మీ సినిమాలో ఆమె (హీరోయిన్‌)ను కొట్టకుండా ఆపగలిగిందా’ అని పేర్కొన్నారు. కాగా ఈ హత్య ఘటనపై ‘కబీర్ సింగ్’ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ఈ ఘటన దురదృష్టకరమని.. ఆ యువతి కుటుంబానికి క్షమాపణలు చెప్పాడు. ఎవరినీ చంపమని తన సినిమా చెప్పలేదని, ‘కబీర్ సింగ్’ గానీ, ‘అర్జున్ రెడ్డి’ గానీ హత్యలను ప్రోత్సహించేలా తెరకెక్కించలేదని సందీప్ రెడ్డి వివరణ ఇచ్చుకున్నాడు.

First published: December 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...