దీపికా చపాక్ సినిమాకు IMDbలో 4.4 స్టార్స్ మాత్రమే.. కారణం ?

దీపికా పదుకొనే.. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘చపాక్’‌లో ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే..

news18-telugu
Updated: January 14, 2020, 4:58 PM IST
దీపికా చపాక్ సినిమాకు IMDbలో 4.4 స్టార్స్ మాత్రమే.. కారణం ?
Twitter
  • Share this:
దీపికా పదుకొనే.. యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘చపాక్’‌లో ప్రధాన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.. మేఘనా గుల్జార్ ఈ సినిమాను దర్శకత్వం వహించారు. చపాక్ ప్రపంచవ్యాప్తంగా జనవరి 10న విడుదలైంది. అయితే, విడుదలకు ముందు దీపికా JNU దాడిలో గాయపడిన విద్యార్ధులకు మద్దతుగా క్యాంపస్ వెళ్లిన సంగతి తెలిసిందే. దీంతో కొన్ని వర్గాలు దీపికా సినిమాను చూడోద్దంటూ ట్విట్టర్‌లో #boycottchhapaak పిలుపివ్వడంతో కొన్ని రోజులు #boycottchhapaak ట్రెండింగ్‌లో నడిచింది. ఆ తర్వాత ఇదే విధంగా ఈ సినిమా IMDb రేటింగ్ విషయంలో కూడా కొంత మంది ఈ సినిమాను టార్గెట్ చేసుకొని తక్కువ రేటింగ్ ఇవ్వడంతో ప్రస్తుతం చపాక్ రేటింగ్ 4.4 స్టార్స్‌కు పడిపోయింది. అయితే ఇక్కడ విషయం ఏమంటే ఈ రేటింగ్‌లో మొత్తం 6900 మంది పాల్గొంటే అందులో 4000 మంది ఈ సినిమాకు అతి తక్కువ రేటింగ్ ఇచ్చారు.

ఇదే సమయంలో అజయ్ దేవగన్ సినిమా తానాజీ సినిమా రేటింగ్‌లో 5800 మంది పాల్గొంటే 4300 మంది 10 స్టార్ రేటింగ్ ఇచ్చారు. దీంతో ఈ సినిమా 9.0 రేటింగ్‌తో దూసుకుపోతోంది. అయితే దీనిపై కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తూ.. కావాలనే కొన్ని వర్గాలకు చెందిన వారు తక్కువ రేటింగ్ ఇచ్చి సినిమాను దెబ్బ తీయాలనీ చూస్తున్నారని ఆరోపిస్తున్నారు.
Published by: Suresh Rachamalla
First published: January 14, 2020, 4:58 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading