Anchor Shyamala: యాంకర్ శ్యామల హోమ్ టూర్.. మీ అయన కొట్టేసిన కోటితో కొన్నారా..?

Anchor Shyamala

Anchor Shyamala: బుల్లితెర యాంకర్ శ్యామల పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన యాంకరింగ్ విధానంతో మంచి గుర్తింపు అందుకుంది.

  • Share this:
    Anchor Shyamala: బుల్లితెర యాంకర్ శ్యామల పరిచయం గురించి అందరికీ తెలిసిందే. తన యాంకరింగ్ విధానంతో మంచి గుర్తింపు అందుకుంది. ఇక వెండితెరపై కూడా కొన్ని పాత్రలో మెప్పించింది శ్యామల. మరో బుల్లితెర నటుడు నరసింహారెడ్డిని ప్రేమ పెళ్లి చేసుకుంది. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది శ్యామల. తనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా బాగా పంచుకుంటుంది.

    చిన్న వయసులోనే బుల్లితెరలో అడుగు పెట్టి పలు సీరియల్ లో నటించగా.. ఆ తర్వాత వెండితెరపై అవకాశాలు అందుకుంది. మొత్తానికి ఓ సెలబ్రిటీగా మారిన శ్యామల.. ఈమధ్య సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా మారింది. ఇక యూట్యూబ్ లో 'ఏం చెప్పారు శ్యామల గారు' అనే పేరుతో ఛానల్ ప్రారంభించింది. ఇక అందులో ఎన్నో విషయాలు పంచుకునే శ్యామల తాజాగా తన హోమ్ టూర్ ద్వారా తన కొత్త ఇల్లు పరిచయం చేసింది.

    ఇంకా నిర్మాణంలో ఉన్న తన ఇంటిని వీడియో తీసి అభిమానులకు పంచుకోగా.. అందులో తాము తమ ఇంటికి నిర్మించిన నిర్మాణాల గురించి, వాటికి అవసరమైన ఇంటీరియల్ గురించి చెప్పుకొచ్చింది. ఇదిలా ఉంటే ఈ వీడియో షేర్ చేసిన కొద్దిసేపట్లోనే ఎన్నో వ్యూస్ వచ్చాయి. అంతేకాకుండా పలు రకాల కామెంట్స్ కూడా వచ్చాయి. ఇక చాలా వరకు మీ ఆయన కొట్టేసిన కోటి రూపాయలతో కట్టారా అంటూ ప్రశ్నలు ఎదురయ్యాయి.



    గతంలో శ్యామల భర్త, నటుడు నరసింహారెడ్డి చీటింగ్ కేసు పై అరెస్టయిన సంగతి తెలిసిందే. తన వద్ద కోటి రూపాయలు అప్పుగా తీసుకొని ఇవ్వడం లేదని అతనిపై ఖాజాగూడ కు చెందిన సింధూర రెడ్డి అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయగా వెంటనే అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ వార్త బాగా వైరల్ అవ్వగా.. త్వరలోనే అన్ని ఆధారాలతో ముందుకు వస్తానంటూ నరసింహారెడ్డి తెలిపాడు. ఇక అప్పటి నుంచి మళ్లీ ఈ విషయం గురించి స్పందించకపోగా.. ఈ నేపథ్యంలో నెటి జనులు మీ ఆయన కొట్టేసిన కోటి రూపాయలతో ఇంటిని కడుతున్నారా అంటూ తెగ ట్రోల్స్ చేస్తున్నారు.
    Published by:Navya Reddy
    First published: