తెలంగాణలో జరిగిన దిశ అత్యాచారం, హత్యపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమయ్యాయి. సామాన్యులు మొదలుకుని బాలీవుడ్ సెలబ్రిటీల వరకు అంతా ఈ ఘటనపై స్పందించారు. అయితే దీనిపై అల్లు అర్జున్ మాత్రం స్పందించలేదు. ఈ అంశంపై స్పందించని బన్నీ... అదే సమయంలో తన నయా మూవీ అలా వైకుంఠపురంలో సినిమా ప్రమోషన్స్ గురించి రియాక్ట్ అయ్యారు. అలా వైకుంఠపురంలోని సామజవరాగమన పాటకు సంబంధించి 100 మిలియన్ వ్యూస్ వచ్చాయని... ఇది అల్ టైం రికార్డు అంటూ సోషల్ మీడియాలో బన్నీ పోస్ట్ చేశారు. అయితే దీనిపై కొందరు నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
దేశమంతటా దిశ హత్యోదంతంపై ఆగ్రహజ్వాలలు కురిపిస్తుంటే... అల్లు అర్జున్ దీనిపై స్పందించకపోవడాన్ని పలువురు తప్పుబట్టారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.