Uninstall Hotstar: సడక్ 2ను బహిష్కరించండి.. ఆలియా మహేష్‌ భట్‌లకు షాక్..‌‌

Sadak 2: హీంది హీరోయిన్ ఆలియా భట్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సడక్ 2.

news18-telugu
Updated: August 12, 2020, 3:05 PM IST
Uninstall Hotstar: సడక్ 2ను బహిష్కరించండి.. ఆలియా మహేష్‌ భట్‌లకు షాక్..‌‌
Uninstall Hotstar: ఆలియా మహేష్‌ భట్‌లకు షాక్..‌‌ సడక్ 2ను బహిష్కరించాలని డిమాండ్.... Photo : Twitter
  • Share this:
హీంది హీరోయిన్ ఆలియా భట్, సంజయ్ దత్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం సడక్ 2. ఈ సినిమాను ఆమె తండ్రి మహేష్ భట్‌ రూపొందించాడు. ఈ సినిమాకు సుశాంత్ దెబ్బ తగిలే అవకాశం కనిపిస్తున్నది. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను ఓటీటీ ఫ్లాట్ ఫామ్‌లో రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు దర్శక నిర్మాతలు. అయితే ఈ చిత్రాన్ని ఓటీటీలో చూడొద్దని, అంతేకాదు అసలు ఆ సినిమా ప్రసారం అయ్యే హాట్ స్టార్ యాప్‌ను అన్ ఇన్‌స్టాల్ చేయాలనీ సుశాంత్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్ చేస్తున్నారు. #UninstallHotstar అనే హ్యాష్ ట్యాగ్‌ పేరుతో ట్రెండింగ్ చేస్తున్నారు. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం తర్వాత బాలీవుడ్‌లో నెపోటిజంపై భారీ చర్చ జరుగుతున్నది. అక్కడి దర్శక నిర్మాతలు హీరోల పిల్లలకు లేదా నిర్మాతల పిల్లలకు మాత్రమే ప్రోత్సాహం అందిస్తున్నారని.. బయట నుంచి వచ్చే వాళ్లను ఎదగనివ్వకుండా, ఎలాంటీ అవకాశాలు ఇవ్వకుండా తొక్కేస్తున్నారని ఆరోపిస్తున్నారు ఆయన అభిమానులు. అందులో భాగంగానే.. ఆ ఒత్తిడి భరించలేక సుశాంత్ లాంటి వాళ్లు ఎందరో బలైపోతున్నారని మండిపడుతున్నారు.

Uninstall Hotstar, sadak 2, sushanth death case, Alia Bhatt on prabhas, Alia Bhatt to quit rrr,alia bhatt,rrr movie,rrr,alia bhatt about rrr movie,alia bhatt in rrr movie,alia bhatt in rrr,alia bhatt rrr,alia bhatt movies,rrr movie trailer,rrr movie updates,rrr movie teaser,alia bhatt super comments on rajamouli and rrr movie,rajamouli about rrr movie,rrr teaser,alia bhatt about rajamouli,alia bhatt songs,rrr press meet,rrr movie songs,alia bhatt about rrr,aliaa bhatt about rrr,ఆర్ఆర్ఆర్ ,ఆలియా భట్ ఔట్‌,ఆలియా భట్, రాజమౌళి, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఒలివియా మోరీస్
కూతురు ఆలియాతో మహేష్ భట్ Photo : Twitter


ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహర్, మరో నిర్మాత యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా, దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ లాంటి ప్రముఖులు కూడా ఈ నెపోటిజంను ప్రోత్సహిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆలియా భట్ నటించిన సినిమా సడక్ 2 పై నెటిజన్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సినీ ఇండస్ట్రీ కొందరి ప్రముఖుల చేతిలో ఉందని.. బంధుప్రీతితో..బయటి వారిని వేధిస్తున్నారని.. అందుకే ఈ సినిమాను బహిష్కరించాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. అందులో భాగంగా ఆగస్టు 28వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో నెటిజన్లు Uninstall Disney+ Hotstar app అనే హ్యాష్‌ట్యాగ్‌ ట్రెండింగ్ చేస్తున్నారు.

ఇక మరోవైపు సుశాంత్ మరణానికి ఆయన ప్రియురాలు రియా చక్రవర్తి కారణమనే ఆరోపణలు రావడం.. ఆమెకు మహేష్ భట్‌కు సన్నిహిత సంబంధాలు ఉండటం ప్రస్తుతం వివాదంగా మారాయి. ప్రస్తుతం సుశాంత్ మృతి కేసును సీబీఐ విచారిస్తోంది.
Published by: Suresh Rachamalla
First published: August 12, 2020, 2:51 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading