• Home
  • »
  • News
  • »
  • movies
  • »
  • NETIZENS APPRECIATED ANASUYA BHARADWAJ TO HELP PUBLIC IN HEAVY RAINS HERE ARE THE DETAILS TA

Anasuya Bharadwaj : అనసూయ చేసిన పనికి మెచ్చుకుంటున్న నెటిజన్లు.. శభాష్ అంటున్న ఫ్యాన్స్..

అనసూయ భరద్వాజ్ (Instagram/Photo)

Anasuya Bharadwaj : అనసూయ చేసిన పనికి మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. అనసూయ ఓ వైపు టెలివిజన్ మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. తాజాగా భారీ వర్షాల నేపథ్యంలో అనసూయ చేసిన పనిని అందరూ మెచ్చుకుంటున్నారు.

  • Share this:
    Anasuya Bharadwaj : అనసూయ చేసిన పనికి మెచ్చుకుంటున్నారు నెటిజన్లు. అనసూయ ఓ వైపు టెలివిజన్ మరోవైపు సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. అందులో భాగంగా క్షణం, ఆ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన 'రంగస్థలం' ద్వారా మంచి గుర్తింపు దక్కిచుకుంది అనసూయ. రంగస్థలంలో రంగమ్మత్తగా.. అదరగొట్టి ప్రేక్షకుల్నీ కట్టిపడేసింది. రంగస్థలంలో ఈ భామ చేసిన నటనకు ఫిదా అయిన కృష్ణ వంశీ.. తన ‘రంగ మార్తండ’లో ముఖ్యపాత్ర ఇచ్చాడు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్య క్రిష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా నటసామ్రాట్ అనే మారాఠి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కింది. ఒరిజినల్ చిత్రంలో నానా పాటేకర్ పోషించిన పాత్రని ప్రకాష్ రాజ్ చేస్తున్నాడు. అయితే ఈ సినిమాలోని ఒక ప్రత్యేక పాత్రకి అనసూయని తీసుకున్నారు. ఎపుడు సినిమాలు, టీవీ షోలే కాదు.. అపుడపుడు సమాజానికి పనికి వచ్చే పనులు కూడా చేస్తూ ఉంటుంది.

    తాజాగా హైదరాబాద్‌లో ఈ మంగళవారం భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే కదా. కేవలం హైదరాబాద్ మాత్రమే కాదు.. తెలంగాణ అంతటా కనీవినీ ఎరగనీ రీతిలో భారీ వర్షం ఎందరికో నష్టాన్ని మిగిలిచ్చింది. ఈ సందర్భంగా వర్షాల వల్ల ఏర్పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎవరికీ చెప్పుకోవాలో  చాలా మందికి తెలియదు. అలాంటి వారి కోసం అనసూయ తన ట్విట్టర్ అకౌంట్‌లో జీహెచ్‌ఎంసీ, ఎలక్ట్రిసిటీతో పాటు డిజాస్టర్ మేనేజమెంట్‌కు సంబంధించిన ఫోన్ నెంబర్స్‌‌ను అందుబాటులో ఉంచింది.


    ఇది చూసి చాలా మంది సరైన సమయంలో సరైన విధంగా పబ్లిక్‌కు సరైన గైడెన్స్ ఇచ్చారని అనసూయను అందరు మెచ్చుకుంటున్నారు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: