కాజోల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు తన ఇంటికి కొందరు అభిమానులు వచ్చారు. అయితే కాజోల్ వారితో ప్రవర్తించిన తీరుపై ఆన్లైన్లో నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. ఆమె వారికి ఏదో సాయం చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు.
సెలబ్రిటీలపై కామెంట్ చేసేందుకు సోషల్‌మీడియాలో రెడీగా ఉంటారు కొందరు నెటిజన్లు. సెలబ్రిటీలు మంచి చేసినా.. చెడు చేసినా.. అందులో ఏదో ఒక తప్పు వెతికి కావాలని సెటైర్లు వేస్తుంటారు వాళ్లు. అలా నెటిజన్ల నుంచి తరచూ ఏదో విధంగా విమర్శలు ఎదురుకొనే సెలబ్రిటీలలో బాలీవుడ్ హీరోయిన్ కాజోల్ కూడా చేరింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్గా అడుగుపెట్టిన కాజోల్ తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. కుచ్కుచ్ హోతా హై, దిల్వాలే దుల్హానియా లే జాయేంగి, కభీ కుషీ కభీ ఘమ్ తదితర సినిమాలతో సినీ లోకాన్ని మైమరిపింపిజేసింది. ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది. అత్యధికంగా ఉత్తమ నటి అవార్డులు అందుకున్న నటీమణుల్లో ఆమె ఒకరు. ఆ తర్వాత అజయ్ దేవ్‌గణ్‌ను పెళ్లి చేసుకుని కుటుంబ బాధ్యతలు తీసుకుంది. ఆమె సినీ రంగానికి చేసిన సేవలకు గానూ కేంద్రం నుంచి పద్మశ్రీ పురస్కారం కూడా అందుకుంది. మళ్లీ ఫనాతో రీ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈనెల 5న కాజోల్ పుట్టినరోజు కావడం విశేషం. కానీ, అదే రోజు ఆమె తన అభిమానులను పలకరించిన తీరుపై నెటిజన్ల నుంచి విమర్శలు మొదలయ్యాయి. అభిమానుల వల్లే ఎదిగిన కాజోల్ ఇపుడు వారినే మరిచిపోతోందని మండిపడ్డారు. అసలు ఏం జరిగిందంటే..
ముంబైలోని జూహూలో ఉంటున్న కాజోల్కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి ముగ్గురు పిల్లలు, ఓ యువకుడు కేక్‌తో పాటు ఆమె ఇంటికి వచ్చారు. కాజోల్ డోరు దగ్గరే వారిని నిలబెట్టి వారు ఇచ్చిన కేక్ కట్ చేసింది. అయితే కాజోల్ ఆ కేక్‌ను తినలేదు. కనీసం ఆ పిల్లలకు కూడా తినిపించకుండా, వారికి దూరంగానే నిల్చొని ఒక ఫొటో దిగింది. వెంటనే లోపలికి వెళ్లిపోయింది. ఆ పరిణామంతో పిల్లలు కొంచెం షాక్ గురయ్యారు. అయితే ఈ వీడియోను బాలీవుడ్ ప్రముఖుడు వైరల్ భయానీ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. అదికాస్తా.. నెటిజన్ల కంట పడింది. కాజోల్ తీరుపై ఆగ్రహం వ్యక్తంచేసిన నెటిజన్లు ఆమెపై విమర్శలు చేయడం ప్రారంభించారు. "ఈ నటుల కోసం ప్రజలు తమ సమయాన్ని ఎందుకు వృథా చేస్తారు? ఆమె కేక్‌ను కూడా గౌరవించలేదు, "అని ఒక నెటిజన్ ధ్వజమెత్తాడు. మరొకరు.." ఆమె తనను ఈ స్థాయిలో నిలబెట్టిన వ్యక్తులను మర్చిపోతోంది. ఆమె వారికి ఏదో సాయం చేస్తున్నట్లుగా ప్రవర్తిస్తుంది.’’ అని మండిపడ్డారు.
Published by:Prabhakar Vaddi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.