Hero Sumanth: సుమంత్ రెండో పెళ్లి.. ప్రమోషన్స్ కోసం ఇదంతా చేశారంటూ?

Hero Sumanth

Hero Sumanth: టాలీవుడ్ హీరో, అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉంటూ పలు ఆఫర్ లను అందుకుంటున్నాడు.

  • Share this:
    Hero Sumanth: టాలీవుడ్ హీరో, అక్కినేని నాగేశ్వరరావు మనవడు సుమంత్ గురించి తెలుగు ప్రేక్షకులందరికీ పరిచయమే. నటుడిగా, నిర్మాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇప్పటికీ ఇండస్ట్రీలో ఉంటూ పలు ఆఫర్ లను అందుకుంటున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఇతని రెండో పెళ్లి గురించి బాగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. కానీ ఇదంతా కావాలని చేశారని.. పైగా ప్రమోషన్స్ కోసం ఆడిన నాటకమని తెలుస్తుంది.

    1999లో ప్రేమ కథ సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన సుమంత్.. మంచి గుర్తింపు తెచ్చుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకున్నాడు. ఇక తన కెరీర్ లో ఎక్కువగా ఫ్లాప్ లు ఉన్నా కూడా వాటిని పట్టించుకోకుండా ముందుకు సాగుతున్నాడు. ఈ ఏడాది 'కపటధారి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదంతా పక్కన పెడితే ఈయన 2004లో హీరోయిన్ కీర్తి రెడ్డిని పెళ్లి చేసుకొని 2006లో విడిపోయాడు. ఇక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న ఆయన తాజాగా రెండో పెళ్లి చేసుకుంటున్నట్లు బాగా ప్రచారం అయింది.

    తాను పెళ్లి చేసుకునే అమ్మాయి పేరు పవిత్ర అని.. పైగా పెళ్లి కార్డు కూడా బయటకు రాగా ఇదంతా నిజమేనని అనుకున్నారు నెటిజన్లు. అంతేకాకుండా టాలీవుడ్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కూడా సుమంత్ పై ఓ కామెంట్ చేశాడు. ఒకసారి అయ్యాక కూడా నీకు ఇంకా బుద్ధి రాలేదా అంటూ.. ఒక పెళ్లి అంటేనే నూరేళ్ల పెంట.. రెండో పెళ్లి ఏంటయ్యా అంటూ పైగా పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని కూడా జీవితాలు పాడు చేసుకోకండి అంటూ తన స్టైల్లో పంచ్ వేశాడు. ఇక ఈ విషయం టాలీవుడ్ మొత్తం వైరల్ గా మారడంతో.. తాజాగా సుమంత్ తన రెండో పెళ్లి గురించి స్పందించాడు.



    ఇందులో ఎంత మాత్రం నిజం లేదని, ఇదంతా తన కొత్త సినిమా అని.. ఈ సినిమా పెళ్లి, విడాకుల నేపథ్యంలో రానుందని.. దాంతో పెళ్లి కార్డు లీక్ అయిందని అన్నాడు. అలా అందరూ తన పెళ్లి అనుకొని ప్రచారం చేశారంటూ తెలిపాడు. ఇక ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే తెలుపుతామని క్లారిటీ ఇవ్వగా.. పలువురు సినీ క్రిటిక్స్ ఇదంతా కేవలం పబ్లిసిటీ స్టంట్ అని అంటున్నారు. పైగా ఈ సినిమా గురించి క్లారిటీ వెంటనే ఇవ్వకుండా.. అంత ప్రచారమైన తర్వాత నవ్వుతూ స్పందించడం ఏంటి.. ఇదంతా పక్కా ప్లాన్ తో సినిమా ప్రమోషన్స్ కోసం చేసిన నాటకమని నెటిజెన్స్ అంటున్నారు.
    Published by:Navya Reddy
    First published: