సమంత (Samantha) బాటలో నిహారిక (Niharika) ఏంటి? కొంపదీసి విడాకుల వ్యవహారమా అనే సందేహం కలుగుతోంది కదూ!. అలా అని చెప్పడంలేదు కానీ పరోక్షంగా అదే ప్రస్ఫుటించేలా కామెంట్లు వదులుతున్నారు నెటిజన్లు. పెళ్లి తర్వాత సమంత ఎలా అయితే నిత్యం వార్తల్లో నిలుస్తూ వచ్చిందో అచ్చం అలాగే మెగా డాటర్ నిహారిక కూడా పెళ్లి తర్వాత నిత్యం ఏదో ఒక రకంగా వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతోంది. చైతన్య జొన్నలగడ్డ (Chaitanya Jonnalagadda)ను పెళ్లి చేసుకున్నాక సోషల్ మీడియాలో నిహారికను ఫాలో అయ్యేవారు అమాంతం పెరిగిపోయారు. అంతేకాదు అనునిత్యం ఆమె కదలికలను పసిగడుతూ కామెంట్లు కూడా చేస్తున్నారు. అయితే కొన్నిసార్లు సదరు నెటిజన్స్ చేసే కామెంట్స్ కాస్త ఇబ్బందికరంగా ఉంటున్నాయి. తాజాగా నిహారిక ఓ వీడియో పోస్ట్ చేయగా అదే సీన్ కనిపించింది.
నిజానికి పెద్ద హీరోయిన్ కాకపోయినా నిహారికకు మంచి ఫాలోయింగ్ ఉంది. యాక్టింగ్ టాలెంట్ సంగతేమో గానీ మెగా ఇంటి అమ్మాయి కావడంతో ఆమె పాపులారిటీ ఎల్లలు దాటింది. మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్ రోల్ పోషిస్తూ ఎప్పటికప్పుడు తన రెగ్యులర్ అప్‌డేట్స్ పోస్ట్ చేస్తుండటం ఆమె ఫాలోయింగ్‌ని రెట్టింపు చేస్తోంది. ఈ క్రమంలోనే తన ఇన్స్‌స్టాగ్రామ్ వేదికగా తాజాగా ఆమె వదిలిన ఓ వీడియో నెట్టింట రచ్చ చేస్తోంది. ఇందుకు ప్రధాన కారణం ఆ వీడియో చూసి నెటిజన్స్ వదులుతున్న కామెంట్స్.
సెలబ్రిటీ అన్నాక ఏదోఒక కారణంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ బారిన పడటం కామనే అయినా నిహారిక విషయంలో నెటిజన్స్ చేస్తున్న కామెంట్స్ ఆమెకు కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయనే చెప్పుకోవాలి. ఇటీవల హైదరాబాద్ పబ్ ఇష్యూతో వార్తల్లో నిలిచిన నిహారిక ప్రస్తుతం విదేశాల్లో విహరిస్తోంది. జోర్డాన్ అనే కంట్రీకి వెళ్లి అక్కడి అందమైన కొండకోనల్లో ఎంజాయ్ చేస్తోంది. అయితే అందుకు సంబందించిన ఓ వీడియోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేసి బుక్కయింది.
View this post on Instagram
రీసెంట్‌గా బంజారా హిల్స్ పబ్ ఇష్యూతో డ్రగ్స్ అంశం మరోసారి తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి దాటాక పోలీసులు చేసిన ఆకస్మిక తనికీలో డ్రగ్స్ బయటపడ్డాయి. ఈ పబ్ లోనే నిహారిక సైతం ఉండటం, విచారణ కోసం పోలీస్ స్టేషన్ కూడా వెళ్లిరావడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. దీన్నే నిహారిక తాజాగా షేర్ చేసిన వీడియోకు లింక్ చేస్తూ ఆమెపై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు కొందరు నెటిజన్లు.
డ్రగ్స్ అక్కడకూడా దొరుకుతాయా?, ఓహ్ ఇండియాలో ఐతే దొరికిపోతావ్ అని.. అక్కడ పెట్టావా దుకాణం అంటూ కామెంట్ల రూపంలో నిహారికపై పర్సనల్ అటాక్ చేస్తున్నారు. అంతేకాదు సమంతను ఫాలో అవుతున్నావ్, సమంత దారిలో నిహారిక అంటూ వదులుతున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఏదేమైనా ఇలాంటి పరిణామాలు చూస్తుంటే సోషల్ మీడియా పుంజుకోవడం, సామజిక మాధ్యమాలు అందరికీ అందుబాటులోకి రావడం సెలబ్రిటీలకు కొరకరాని కొయ్యలా తరమయ్యిందని అనిపిస్తోంది కదూ!.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.