NETIZEN FUNNY COMMENTS ON UPPENA TEASER VANTALAKKA STAR MAA LIKES COMMENT MNJ
Uppena Teaser- Vantalakka: వంటలక్క మీద ఒట్టు.. 'ఉప్పెన' సినిమా సూపర్ హిట్టు
ఉప్పెన టీజర్, వంటలక్క
మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్(Sai Dharam Tej) సోదరుడు వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన(Uppena). ఇవాళ భోగి పండుగ కావడం, వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు కూడా కావడంతో ఈ మూవీ నుంచి టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఫీల్ గుడ్‌గా వచ్చిన ఈ టీజర్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది
Uppena Teaser- Vantalakka: మెగాస్టార్ చిరంజీవి మరో మేనల్లుడు, సాయి ధరమ్ తేజ్ సోదరుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన. ఇవాళ భోగి పండుగ కావడం, వైష్ణవ్ తేజ్ పుట్టినరోజు కూడా కావడంతో ఈ మూవీ నుంచి టీజర్‌ని రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఫీల్ గుడ్‌గా వచ్చిన ఈ టీజర్ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. మొదటి సినిమానే అయినప్పటికీ.. వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటన టీజర్లోనే అర్థమవుతోంది. ఇక టీజర్‌కి దేవీ శ్రీ ప్రసాద్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ అదిరిపోగా.. చివర్లో వైష్ణవ్‌ని చంపేసినట్లుగా చూపించారు. దీంతో ఇదో ట్రాజెడీ లవ్‌స్టోరీగా తెలుస్తోంది. ఏదేమైనా ఈ మూవీతో వైష్ణవ్ ఎంట్రీ గ్రాండ్‌గా ఉండబోతుందని మెగాభిమానులు భావిస్తున్నారు.
కాగా ఉప్పెన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వస్తోంది. సాధారణ అభిమానులే కాదు ప్రముఖులు కూడా టీజర్‌పై కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే యాకుబ్ పాషా అనే ఓ నెటిజన్ ఈ మూవీ టీజర్ కింద వినూత్న కామెంట్ పెట్టారు. వంటలక్క మీద ఒట్లు ఈ సినిమా సూపర్ హిట్టు అని అతడు కామెంట్ పెట్టాడు. ఇక ఆ కామెంట్‌ని స్టార్ మా లైక్ చేయడం మరో విశేషం. దాన్ని మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించింది. మన స్టార్ మా ఈ కామెంట్‌ని లైక్ చేసిందని కామెంట్ పెట్టింది.
ఇక ఆ పోస్ట్‌కు స్టార్ మా కూడా స్పందించింది. అతడి కాన్ఫిడెన్స్, వంటలక్కపై అతడికి ఉన్న ప్రేమ మాకు బాగా నచ్చింది. ఉప్పెనకు బెస్ట్ విషెస్ అని కామెంట్ పెట్టింది. కాగా ఇప్పుడు ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. వంటలక్క ఫ్యాన్స్ కూడా ఈ కామెంట్‌ని సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. అయితే స్టార్ మాలో ప్రసారం అయ్యే కార్తీక దీపంలో ప్రేమి విశ్వనాథ్ వంటలక్కగా అందరికీ సుపరిచితమే. మొదట్లో దీపగా ఉన్న ప్రేమి.. ఆ తరువాత వంటలక్కగా మారింది. ఈ క్రమంలో ఆమెకు ఇక్కడ ఎంతోమంది అభిమానులు కూడా ఉన్నారు.
ఇదిలా ఉంటే రొమాంటిక్ లవ్ ఎంటర్టైన్గా తెరకెక్కిన ఈ చిత్రంలో వైష్ణవ్ తేజ్ సరసన కృతిశెట్టి నటించగా.. విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించారు. సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ మూవీకి సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు సన దర్శకత్వం చేయగా.. దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. గతేడాదే ఉప్పెన షూటింగ్‌ని పూర్తి చేసుకుంది. కరోనా రాకపోయి ఉంటే గతేడాది ఏప్రిల్‌లోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేది. అయితే ఆ తరువాత లాక్డౌన్ రావడం, థియేటర్లకు బ్రేక్ పడటంతో ఆగిపోయింది. ఆ మధ్యలో చాలా చిత్రాలు ఓటీటీలో విడుదల కాగా.. ఉప్పెన కూడా అలానే వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ కంటెంట్‌పై ఉన్న నమ్మకంతో థియేటర్లు తెరిచే వరకు ఎదురుచూసింది చిత్ర యూనిట్. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదిని కూడా ప్రకటించనున్నారు.
Published by:Manjula S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.