• HOME
  • »
  • NEWS
  • »
  • MOVIES
  • »
  • NETFLIX STREAMFEST RETURNS TODAY WILL GO ON TILL DEC 11 HERES TO WATCH FREE NETGLIX FOR TWO DAYS BA GH

Netflix StreamFest: నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఫ్రీగా వచ్చేసింది.. ఈ రోజు నుంచే ఆరంభం

Netflix StreamFest: నెట్‌ఫ్లిక్స్ మళ్లీ ఫ్రీగా వచ్చేసింది.. ఈ రోజు నుంచే ఆరంభం

Netflix Streamfest dates: ప్రతీకాత్మక చిత్రం

నెట్ ఫ్లిక్స్ స్ట్రీమ్‌ ఫెస్ట్ విజయవంతం కావడంతో మరోసారి ఈ ఆఫర్‌ను తీసుకురావాలని ఆ సంస్థ నిర్ణయించింది. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 11 వరకు మరోసారి ఉచిత స్ట్రీమింగ్‌ ఆఫర్‌ అందిస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది.

  • Share this:
కరోనా కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ విధించిన తరువాత వీడియో స్ట్రీమింగ్‌ యాప్‌ లకు ఆదరణ పెరిగింది. థియేటర్లు కూడా మూసివేయడంతో చాలామంది ఇలాంటి యాప్స్‌లోనే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు, ఇతర కార్యక్రమాలు చూసేందుకు ప్రజలు ఆసక్తి చూపించారు. దీంతో సబ్‌స్క్రిప్షన్స్ సంఖ్యను పెంచుకునేందుకు ఆయా సంస్థలు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఇందులో భాగంగా నెట్‌ఫ్లిక్స్ StreamFest ఆఫర్‌ను ప్రకటించింది. గత వారాంతంలో తమ ప్లాట్‌ఫాంను రెండు రోజుల పాటు ఉచితంగా యాక్సెస్ చేసుకోవచ్చని ప్రకటించింది. దీంతో Netflix పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ స్ట్రీమ్‌ ఫెస్ట్ విజయవంతం కావడంతో మరోసారి ఈ ఆఫర్‌ను తీసుకురావాలని ఆ సంస్థ నిర్ణయించింది. డిసెంబర్ 9 నుంచి డిసెంబర్ 11 వరకు మరోసారి ఉచిత స్ట్రీమింగ్‌ ఆఫర్‌ అందిస్తున్నట్టు నెట్ ఫ్లిక్స్ తాజాగా ప్రకటించింది. ఈ రోజు (డిసెంబర్ 9) ఉదయం 9 గంటలకే ఆఫర్‌ ప్రారంభమైంది. ఇది డిసెంబర్ 11వతేదీ ఉదయం 8:59గంటల వరకు కొనసాగుతుంది.

నియమాలు వర్తిస్తాయి
ఈ ఆఫర్‌ను సింగిల్ స్టాండర్డ్-డెఫినిషన్ స్ట్రీమ్‌కు మాత్రమే పరిమితం చేసినట్లు నెట్‌ఫ్లిక్స్‌ ప్రకటించింది. దీంతోపాటు ఫ్రీ వ్యూయర్స్ సంఖ్యను కూడా పరిమితం చేసింది. నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్‌ఫెస్ట్ ఆఫర్‌ను వాడుకునే సమయంలో హై డెఫినిషన్ వీడియోకు అప్‌గ్రేడ్ అయ్యే అవకాశం లేదు. అకౌంట్‌ క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండానే వినియోగదారులు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమాలు, టీవీ సిరీస్‌లు చూడవచ్చు. ఆండ్రాయిడ్, ఐఫోన్, స్మార్ట్ టీవీ, గేమింగ్ కన్సోల్, క్రోమ్‌కేస్ లేదా బ్రౌజర్‌.. వంటి ఎలాంటి ప్లాట్‌ఫామ్‌లోనైనా ఉచితంగా నెట్‌ఫ్లిక్స్‌ను యాక్సెస్ చేసుకోవచ్చు. స్ట్రీమ్‌ఫెస్ట్ యూజర్లు ప్రొఫైల్‌లను క్రియేట్ చేసుకొని, చూడాలనుకున్న వీడియోలను "My List"కు యాడ్ చేసుకునే అవకాశం కూడా లభిస్తుంది.

నమోదు చేసుకోవాల్సిందే..
స్ట్రీమ్‌ఫెస్ట్‌ ఆఫర్‌ను పొందడానికి కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ వెబ్‌సైట్‌ లేదా యాప్‌లో పేరు, ఈమెయిల్‌ ఐడీ ఇచ్చి నమోదు చేసుకోవాలి. గతవారం కూడా పరిమిత సంఖ్యలోనే నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమ్ ఫెస్ట్‌ ఆఫర్‌ను వినియోగదారులకు అందించింది. అప్పుడు నమోదు చేసుకొని, ఆఫర్‌ పొందనివారికి ఇప్పుడు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

ప్రస్తుతం నాలుగు ప్లాన్లు
భారతదేశంలో ప్రస్తుతం నాలుగు సబ్‌స్క్రిప్షన్‌ను నెట్‌ఫ్లిక్స్ అందిస్తోంది. రూ.199 ప్లాన్‌తో కస్టమర్లు 480p రిజల్యూషన్‌తో స్ట్రీమింగ్‌ పొందవచ్చు. ఈ ప్లాన్‌ను తీసుకున్న కస్టమర్లు నెట్‌ఫ్లిక్స్ మొబైల్ యాప్‌తో మాత్రమే లాగిన్‌ అవ్వాలి. రూ.499 ప్లాన్‌ తీసుకున్నవారు మొబైల్, టీవీ, పర్సనల్ కంప్యూటర్‌ల్లో... 480p రిజల్యూషన్ స్ట్రీమింగ్‌ను పొందవచ్చు. కానీ ఒక్కసారి ఒక్క డివైజ్‌లో మాత్రమే స్ట్రీమింగ్‌కు అనుమతి లభిస్తుంది. ఒక్కసారి ఒక స్క్రీన్‌కు మాత్రమే స్ట్రీమింగ్‌ను పరిమితం చేశారు. రూ.649 స్టాండర్డ్ ప్లాన్‌తో ఫుల్ HD రిజల్యూషన్ స్ట్రీమింగ్‌ను పొందవచ్చు. దీంతోపాటు కస్టమర్లు ఒకేసారి రెండు స్క్రీన్‌లలో నెట్‌ఫ్లిక్స్‌ ఐడీతో లాగిన్ కావచ్చు. రూ.799 ప్రీమియం ప్లాన్‌తో 4K + HDR స్ట్రీమింగ్ సేవలను పొందవచ్చు. ఒకేసారి నాలుగు స్క్రీన్‌లలో లాగిన్ కావచ్చు.
Published by:Ashok Kumar Bonepalli
First published: