హోమ్ /వార్తలు /సినిమా /

Netflix Streamfest నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్, రేపు, ఎల్లుండి ఫ్రీగా చూడొచ్చు

Netflix Streamfest నెట్ ఫ్లిక్స్ బంపర్ ఆఫర్, రేపు, ఎల్లుండి ఫ్రీగా చూడొచ్చు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

NetFlix Plans: డిసెంబర్ 5, 6 తేదీల్లో నెట్ ఫ్లిక్స్‌ను ఉచితంగా చూడవచ్చు. యూజర్లు తమ పేరు, ఈ మెయిల్ ఐడీ ఇచ్చి ఓ పాస్ వర్డ్ పొందాలి. ఆ తర్వాత ఇక 48 గంటల పాటు మీ ఇష్టం వచ్చిన వీడియోలను చూసుకోవచ్చు. ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పనిలేదు.

ఇంకా చదవండి ...

ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం Netflix అభిమానుల కోసం బంపర్ ఆఫర్ ప్రకటించింది. భారత్‌లో రెండు రోజుల పాటు ఫ్రీ యాక్సెస్ కల్పిస్తోంది. సాధారణంగా యాప్‌లో సబ్‌స్క్రిప్షన్ ఉన్న వారు మాత్రమే వీడియోలను చూసేందుకు యాక్సెస్ ఉంటుంది. కార్డు డిటెయిల్స్ అందించిన వారికి మాత్రమే అనుమతి ఉంటుంది. అయితే, రెండు రోజులు మాత్రం ఎలాంటి కార్డు నెంబర్ ఎంటర్ చేయకపోయినా ఉచితంగా యాక్సెస్ కల్పిస్తుంది. ఆ 48 గంటల పాటు వినియోగదారులు తమ ఇష్టం వచ్చిన వీడియో, వెబ్ సిరీస్, సినిమా, లైవ్ షో ఏదైనా చూడొచ్చు. దీనికి Netflix Streamfest అని పేరు పెట్టింది. డిసెంబర్ 5, 6 తేదీల్లో ఈ ఆఫర్ ఉంటుందన్నమాట. యూజర్లు తమ పేరు, ఈ మెయిల్ ఐడీ ఇచ్చి ఓ పాస్ వర్డ్ పొందాలి. ఆ తర్వాత ఇక 48 గంటల పాటు మీ ఇష్టం వచ్చిన వీడియోలను చూసుకోవచ్చు. ప్రమోషన్‌లో భాగంగా ఉచితంగా ఇస్తున్నాం కాబట్టి, ఏవో కొన్ని నియమిత వెబ్ సిరీస్‌లు, సినిమాలు, షోలకు మాత్రమే పరిమితం కాదు. NetFlixలో ఉన్న మొత్తం వీడియోలకు వీక్షించేందుకు అనుమతి ఉంటుంది.

ఇండియాలో Streamfest గురించి Netflix సీఓఓ గ్రెగ్ పీటర్స్ మాట్లాడుతూ ‘ఈ ఐడియా గురించి మేం ఎంతో ఉత్సుకతతో ఉన్నాం. అది ఎలా నడుస్తుందో చూడాలి. ఒక దేశ ప్రజలు మొత్తానికి నెట్ ఫ్లిక్స్ మొత్తం యాక్సెస్ అందించడం అనేది ఓ గ్రేట్ ఐడియా. దీని వల్ల చాలా మంది కొత్త వారి వద్దకు నెట్ ఫ్లిక్స్‌ను తీసుకెళ్లడానికి ఆస్కారం లభిస్తుంది. దీనిపై చాలా ఆత్రుతగా ఉన్నాం. చాలా మంది సైన్ అప్ చేస్తారని ఆశిస్తున్నాం.’ అని అన్నారు. యూజర్స్ ఈ కంటెంట్‌ను యాప్ ద్వారా స్మార్ట్ టీవీ, గేమింగ్ కన్సోల్, ఐఓఎస్, ఆండ్రాయిడ్ యాప్స్‌తోపాటు పర్సనల్ కంప్యూటర్‌లో కూడా వీక్షించవచ్చు. అయితే, స్ట్రీమింగ్ క్వాలిటీ SDలో ఉంటుంది.

30 రోజుల పాటు ఫ్రీ ట్రయల్ సబ్ స్క్రిప్షన్ అందించే ఆఫర్‌ను నెట్ ఫ్లిక్స్ గత ఏడాది నిలిపివేసింది. ఒక్క భారత్‌లోనే కాదు. అన్ని మార్కెట్లలోనూ ఈ రకమైన ఫ్రీ ట్రయల్ ఆఫర్లను నిలిపివేసింది. యూజర్లను ఆకట్టుకునే క్రమంలో ఆ సంస్థ కొత్తగా రూ.199 ప్లాన్ కూడా తీసుకొచ్చింది. నెలకు రూ.199 చెల్లించడం ద్వారా నెట్ ఫ్లిక్స్ యాప్‌లో వారు షోస్ చూడొచ్చు. దీంతో పాటు భారతీయ యూజర్లకు అనువుగా, తక్కువ ఖర్చులో తక్కువ కాలపరిమితి గల ప్యాక్‌లను కూడా తీసుకొచ్చింది.

‘భారత్‌లో మెంబర్స్అయిన వారు, మెంబర్స్ కావాలనుకుంటున్న వారి కోసం మేం చాలా అద్భుతమైన, ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటిస్తున్నాం.’ అని నెట్ ఫ్లిక్స్ సీఓఓ పీటర్స్ తెలిపారు. నెట్ ఫ్లిక్స్ అనేది ప్రస్తుతం భారత్‌లో మోస్ట్ పాపులర్ స్ట్రీమింగ్ యాప్స్‌లో ఒకటి. దానికి అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, జీ5, ఆల్ట్ బాలాజీ, వూట్ యాప్స్ భారత్‌లో గట్టి పోటీ ఇస్తున్నాయి.

First published:

Tags: Netflix, Ott

ఉత్తమ కథలు