డ్వేన్ జాన్సన్, ర్యాన్ రేనాల్డ్స్ (Dwayne Johnson), గాల్ గాడోట్ నటించిన రెడ్ నోటీసు (Red Notice), నెట్‌ఫ్లిక్స్ యొక్క అత్యధికంగా వీక్షించబడిన చలనచిత్రంగా నిలిచింది. ఇది మునుపటి రికార్డ్ హోల్డర్, బర్డ్ బాక్స్‌ను అధిగమించింది. తన ఉత్సాహాన్ని వ్యక్తం చేస్తూ, జాన్సన్ ఇన్‌స్టాగ్రామ్ (Instagram)లో ఈ విషయం వెల్లడించారు. రాసన్ మార్షల్ థర్బర్ దర్శకత్వం వహించిన యాక్షన్-కామెడీ కోసం వీక్షకుల డేటాను పంచుకున్నాడు. నవంబర్ 5, 2021న నెట్‌ఫ్లిక్స్ (Netflix)లో విడుదలైన ఈ సినిమా ఇన్ని రోజులైనా నెట్‌ఫ్లిక్స్ వీక్షణలో టాప్ 10 ప్లేస్‌లో ఉంది. ఏముంది ఈ మూవీలో కామెడీ ప్రధానంగా సాగే ఈ యాక్షన్ సినిమా.. ట్రెజర్ హంటింగ్ సన్నివేశాలను ఇంట్రెస్టింగ్ చిత్రికరించడంలో విజయవంతం అయ్యారు.
కథ ఏమిటీ..
క్లియోపాత్రా బంగారపు కానుకల చుట్టూ తిరిగే ఈ కథ.. కామెడీ ప్రధానంగా సాగుతోంది. కథను హస్యంగా నడపడంతో పాటు.. కథను చిన్న చిన్న ట్విస్ట్‌లతో ఎంతో ఆసక్తిగా సాగేలా తీశారు. క్లియోపాత్రా (Cleopatra)కు చెందిని మూడు కానుకలను దొంగిలించడం ఈ సినిమా కథ. వీటి కోసం ప్రయత్నించేవారు..
Sirivennela Seetharama Sastry: ప్రతీ పాటలో ఓ చెమక్కు.. "సిరివెన్నెల" ఆణిముత్యాలు ఎన్నో
View this post on Instagram
అడ్డుకొనే పోలీసులతో చిన్న ట్విస్ట్‌లను కామెడీతో నింపి బోర్ కొట్టకుండా తీశారు. రోమ్, రష్యా (Russia), ఈజిప్ట్, బాలి మరియు అర్జెంటీనా వంటి దేశాల్లో చిత్రీకరణ..
Female education: బడిబాట పడుతున్న బాలికలు.. పాఠశాలల్లో పెరిగిన విద్యార్థినుల సంఖ్య!
కథలో హిట్లర్ (Hitler) పతనం తర్వాత తప్పిపోయిన ప్రఖ్యాత నాజీ దోపిడీకి ఆమోదం తెలిపే కుట్ర సిద్ధాంతం వంటి అంశాలు ఎన్నో ఆసక్తికర అంశాలను కథలో జోడించగలిగారు. అందమైన లోకేషన్‌లు సినిమా మీద మరింత ఆసక్తి కలిగించేలా చేస్తాయి. హిస్టారికల్ టైట్-బిట్‌లు, రన్నింగ్ గ్యాగ్ ఆఫ్ కాన్‌స్పిరసీ థియరీ మరియు స్టెల్లార్ ఎ-లిస్టర్ స్టార్ కాస్ట్, వీటన్నిటితో సినిమాను ఇంట్రస్టింగా చేశారు.
ఇప్పటి వరకు రెడ్ నోటీసు మొత్తం వీక్షకుల సంఖ్య 328 మిలియన్ గంటలుగా వెల్లడైంది. గతంలో బర్డ్ బాక్స్ చిత్రం 282 మిలియన్ గంటలను ఈ సినిమా అధిగమించింది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ చిత్రం ఎన్నో వీక్షణలను నమోదు చేసింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Netflix, Telugu Movie