Shyam Singha Roy : నెట్‌ఫ్లిక్స్‌లో నాని శ్యామ్ సింగ రాయ్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Shyam Singha Roy on Netflix Photo : Twitter

Shyam Singha Roy : నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది.

 • Share this:
  నాచురల్ స్టార్ నాని హీరోగా టాక్సీవాలా ఫేమ్ డైరక్టర్ రాహుల్ దర్శకత్వంలో (Shyam Singha Roy)  ‘శ్యామ్ సింగ రాయ్’ పేరుతో ఓ పీరియాడిక్ డ్రామా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని సరసన సాయిప‌ల్ల‌వి, కృతి శెట్టి, మ‌డోన్నా సెబాస్టియ‌న్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన శ్యామ్ సింగరాయ్ ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. కలకత్తా నగరం నేపథ్యంలో బ్రిటీష్ కాలంలో ఈ సినిమా సాగనుందని తెలుస్తోంది. ఒక వింటేజ్ డ్రామాలా అనిపిస్తుంది శ్యామ్ సింగరాయ్. సాయి పల్లవి,(Sai Pallavi ) కృతి శెట్టి (Krithi Shetty) లతో పాటు మరో టాలెంటెడ్ నటుడు నటిస్తున్నారు. బెంగాళీ నటుడు జిష్షు సేన్ గుప్తా ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. తెలుగులో ఆయన ఇప్పటికే రెండు సినిమాలు చేశాడు. జిష్షు సేన్ గుప్తా నితిన్ భీష్మా, నాగ శౌర్య అశ్వాద్థామ, మాస్ట్రో సినిమాల్లో కనిపించిన సంగతి తెలిసిందే.

  అది అలా ఉంటే ఈ సినిమా డిజిటల్ రైట్స్‌ను నెట్ ఫ్లిక్స్ (Netflix) భారీ ధర చెల్లించి దక్కించుకుందని తెలుస్తోంది. అయితే థియేటర్లలో సినిమా విడుదల అయిన అనంతరం నెట్ ఫ్లిక్స్ లో శ్యామ్ సింగ రాయ్  స్ట్రీమ్ కానుంది. దాదాపు 8 కోట్లు పెట్టి నెట్ ఫ్లిక్స్ ఈ సినిమా హక్కులను పొందిందని అంటున్నారు. ఈ విషయంలో అధికారిక సమాచారం తెలియాల్సి ఉంది.

  ఈ చిత్రాన్ని నీహారిక ఎంటర్ టైన్మెంట్ పతాకం పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా నాని కెరీర్ లోనే అత్యధికంగా 50 కోట్లతో నిర్మిస్తున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఇప్పటికే నాన్ థియేట్రికల్ రైట్స్ కోసం 30 కోట్లకు భారీ డీల్ జరిగిందని టాక్. దీంతో సినిమాకి పెట్టిన బడ్జెట్ లో 60 % రికవర్ అయిందని సమాచారం. మరోపక్క థియేట్రికల్ రైట్స్ కోసం కూడా భారీగానే ఆఫర్స్ వస్తున్నట్లు టాక్.

  Vikramarkudu : రాజమౌళి, రవితేజల విక్రమార్కుడు సీక్వెల్‌కు రంగం సిద్ధం.. ఈ సారి మాత్రం..

  ఇక నాని తాజా సినిమా టక్ జగదీష్ విషయానికి వస్తే.. ఈ సినిమాలో (Nani) నాని సరసన రీతూ వర్మ (Ritu Varma), నటించగా.. ఐశ్వర్య రాజేష్‌ మరో కీలకపాత్రలో కనిపించింది. శివ నిర్వాణ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మొదట థియేటర్ రిలీజ్ కోసం ప్రయత్నించిన పలు కారణాల వలన డైరెక్ట్ ఓటీటీ రిలీజ్ ఎంచుకుంది. అందులో భాగంగా టక్ జగదీష్ (Amazon prime) ప్రైమ్ వీడియోలో సెప్టెంబర్ 10న రిలీజ్ అయ్యింది.

  మొదట్లో ఈ సినిమా గురించి కాస్తా నెగిటివ్ టాక్ వచ్చిన ఆ తర్వాత ఫ్యామిలీ ఆడియెన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. అందులో భాగంగా “టక్ జగదీష్” (Tuck Jagadish) సాలిడ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. టక్ జగదీష్ చిత్రం ప్రైమ్ వీడియోలో తెలుగు భాషకు సంబంధించిన వరకు అత్యధికంగా చూసిన సినిమాగా సరికొత్త రికార్డు సెట్ చేసిందని అంటున్నారు.

  Love Story : లవ్‌స్టోరికి భారీ బుకింగ్స్.. అమెరికాలో అప్పుడే రెండు లక్షల మార్క్..

  భారీ వ్యూవర్ షిప్స్ తో టక్ జగదీష్ ప్రైమ్ వీడియోలో టాప్ ప్లేస్‌లో చేరుకుందట. దీంతో చిత్రబృందం సంతోషంగా ఉందని తెలుస్తోంది. ఓటీటీ విడదల కోసం ఏకంగా రూ. 45 కోట్లను అమెజాన్ ప్రైమ్ చెల్లించినట్లు సమాచారం. ఇక్కడ విశేషం ఏమంటే.. నాని గత సినిమా వి కూడా అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను అలరించలేక పోయింది.

  ఇక ఈ సినిమాలతో పాటు నాని 'బ్రోచే వారెవరురా' ఫేమ్‌ వివేక్‌ ఆత్రేయతో 'అంటే.. సుందరానికి..' అనే సినిమా చేస్తున్నారు. ఈ సినిమా అడల్ట్‌ కామెడీ జానర్‌లో వస్తోందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది.  అంటే.. సుందరానికి..లో నానికి జంటగా మలయాళీ నటి నజ్రియా నజీమ్‌ నటిస్తున్నారు.  సంగీతం వివేక్ సాగర్ అందిస్తున్నారు.
  Published by:Suresh Rachamalla
  First published: