ఆర్ఎక్స్ 100 దర్శకుడు అజయ్ భూపతి (Ajay bhupathi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘మహా సముద్రం’ (Maha Samudram). లవ్ అండ్ యాక్షన్ జానర్‌లో వస్తున్న ఈ చిత్రంలో శర్వానంద్, సిద్ధార్థ్ హీరోలుగా (Sharwanand) (Siddharth) నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం నుంచి తాజాగా ట్రైలర్ విడుదలై మంచి యూట్యూబ్‌లో మంచి ఆదరణ పొందుతోంది. ఇక అది అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ రూమర్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ఓ ప్రముఖ ఓటీటీ సంస్థ దక్కించుకుందని తెలుస్తోంది. దాదాపు పదకొండు కోట్లకు కొన్నట్లు నెట్ ఫిక్ల్స్ ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుందని సమాచారం. అయితే థియేటర్ రన్ పూర్తైన 50 రోజులకు ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయంలో అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తైన ఈ మూవీ అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ వేగవంతం చేశారు మేకర్స్. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ సాంగ్స్, ట్రైలర్ సినిమా పై మరింత హైప్ క్రియేట్ చేశారు దర్శక నిర్మాతలు.
మహా సముద్రంలో హీరో శర్వానంద్.. సిద్ధార్థ్ కలిసి నటిస్తున్నారు. లవ్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీని ఆర్ ఎక్స్ 100 ఫేమ్ అజయ్ భూపతి తెరకెక్కిస్తున్నారు. ఇందులో అదితి రావు హైదరి, అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
ఈ సినిమా ట్రైలర్‌లో యూట్యూబ్‌లో అదరగొడుతోంది. ఐదు మిలియన్ వ్యూస్‌తో కేకపెట్టిస్తోంది. ఇక ఈ ట్రైలర్‌ను చూసిన ప్రభాస్ తాజాగా మహా సముద్రం టీమ్‌ను మెచ్చుకున్నారు. చిత్ర ట్రైలర్ బాగుందని... చాలా ఇంటెన్స్‌గా ఉందని.. తన సోషల్ మీడియాలో పేర్కోన్నారు.
Love Story : లవ్ స్టోరి ఐదు రోజుల కలెక్షన్స్.. గులాబ్ దెబ్బ గట్టిగానే తాకింది..
ట్రైలర్‌లో ముఖ్యంగా కొన్ని డైలాగ్స్ తెగ ఆకట్టుకుంటున్నాయి. సముద్రం చాలా గొప్పది మామ. తనలో చాలా రహస్యలు దాచుకుంటుంది. నవ్వుతూ కనిపించనంత మాత్రానా బాగున్నట్టు కాదు అర్జున్ అంటూ హీరోయిన్ చెప్పే డైలాగులు, మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా అంటూ సిద్ధార్థ్ చెప్పే మాటలు ఆకట్టుకునేలా ఉన్నాయి.
ఇక ఈ సినిమాతో తమిళ నటుడు సిద్ధార్థ్ టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఒకప్పుడు తెలుగులో మంచి పాపులారిటీ దక్కించుకున్న సిద్ధార్థ్ ప్రస్తుతం తెలుగులో సినిమాలు ఏవీ చేయడం లేదు. దాదాపు ఏడేళ్ళ గ్యాప్ తరువాత మళ్లీ ‘మహా సముద్రం’ అంటూ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన తెలుగులో నటించిన బొమ్మరిల్లు, ఆట, నువ్వొస్తానంటే నేనొద్దంటానా మొదలగు చిత్రాలతో సూపర్ క్రేజీ తెచ్చుకున్న సంగతి తెలిసిందే.
Samantha comments on Divorce: నాగ చైతన్యతో విడాకులపై కుండ బద్ధలు కొట్టిన సమంత..
ఈ చిత్రం ముందుగా అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఆగష్టు 19న విడుదల కావాల్సి ఉంది. కరోనా పరిస్థితుల్లో విడుదల వాయిదా పడింది. కాగా ఈ మధ్య కరోనా కేసులు తగ్గడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సినిమాల విడుదలకు అనుమతి ఇవ్వడంతో ఇప్పటికే పలు సినిమాలు విడుదలైయ్యాయి. ఈ నేపథ్యంలో మహా సముద్రం దసరా కానుకగా అక్టోబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. అయితే ఇప్పటికే దసరా బరిలో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్, నాగ శౌర్య వరుడు కావలెను, వైష్ణవ్ తేజ్ కొండపొలం సినిమాలు కూడా ఉన్నాయి.
ఈ సినిమాకు చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చగా.. జగపతిబాబు, రావు రమేష్, గరుడ రామ్ కీలకమైన పాత్రల్లో కనిపించనున్నారు. శర్వానంద్, సిద్ధార్థ్‌ల సరసన అదితీ రావు హైదరీ, అనూ ఇమ్మాన్యుయేల్ (Aditi Rao Hydari), (Anu Emmanuel)నటిస్తున్నారు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Maha Samudram, Tollywood news