NEHA SHETTY REPLACED BY ANOTHER HEROINE IN DJ TILLU 2 SLB
Dj Tillu 2: డీజే టిల్లు సీక్వల్.. హీరోయిన్ విషయంలో కీలక నిర్ణయం! ఈ మార్పును జనం మెచ్చేనా..?
DJ Tillu Photo : Twitter
Dj Tillu sequel: సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు కూడా సీక్వల్ రెడీ చేస్తున్నారు. నూతన దర్శకుడు విమల్ కృష్ణ (Vimal Krishna) తెరకెక్కించిన ఈ సినిమా రెండో భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్స్ చేస్తున్నారు. అయితే ఈ సీక్వల్ లో ఓ కీలక మార్పు చేయబోతున్నారని తెలుస్తోంది.
ప్రస్తుతం పలు సినిమాలు సీక్వల్ దిశగా అడుగులేస్తున్నాయి. ఓ సినిమా హిట్ అయితే చాలు అదే పేరుతో ఆ సినిమా సీక్వల్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ క్రమంలోనే సిద్ధూ జొన్నలగడ్డ (Siddhu Jonnalagadda), నేహా శెట్టి (Neha Shetty) జంటగా నటించిన కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ ‘డీజే టిల్లు’ (DJ Tillu)కు కూడా సీక్వల్ రెడీ చేస్తున్నారు. నూతన దర్శకుడు విమల్ కృష్ణ (Vimal Krishna) తెరకెక్కించిన ఈ సినిమా రెండో భాగాన్ని కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే ప్లాన్స్ చేస్తున్నారు. అయితే ఈ సీక్వల్ లో ఓ కీలక మార్పు చేయబోతున్నారని తెలుస్తుండటం ఆసక్తికరంగా మారింది.
డీజే టిల్లు సినిమాలో టైటిల్ రోల్ పోషించిన సిద్ధూ జొన్నలగడ్డ తన డైలాగ్స్, మేనరిజంతో తెగ ఆకట్టుకున్నాడు. ఆయన సరసన నటించిన నేహా శెట్టి చిత్ర విజయంలో కీలక భూమిక పోషించింది. రాధిక అనే అమ్మాయిగా అదరగొట్టేసింది. ఈ సినిమా ఘన విజయానికి సాంగ్స్ కూడా ఎంతో దోహదం చేశాయి. అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దుమ్ముదులుపుతూ భారీ రేంజ్ కలెక్షన్స్ రాబట్టింది. దీంతో మరోసారి చిన్న సినిమా సత్తా బయటపడటమే గాక నిర్మాతలకు లాభాల పంట పండింది.
అట్లుంటది మనతోటి అంటూ లోకల్ స్లాంగ్‌తో రెచ్చిపోయిన సిద్ధూ జొన్నలగడ్డ.. అదే ఉత్సాహంతో ఈ సినిమా సీక్వెల్ చేయనున్నారట. దీనికి కూడా అతడే కథ, డైలాగ్స్ అందిస్తున్నాడు. ఇక్కడ మరో విశేషమేంటంటే ఈ సీక్వెల్ కోసం సిద్ధూ జొన్నలగడ్డ తొలిసారిగా మెగా ఫోన్ పట్టుకోబోతున్నాడు. అదేవిధంగా ఈ సినిమాలో ఓ ముఖ్యమైన మార్పు తీసుకొస్తున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
సితారా ఎంటర్టైన్మెంట్స్ (Sithara Entertainments) నిర్మించనున్న డీజే టిల్లు రెండో భాగంలో హీరోయిన్ మారబోతోందని తెలుస్తోంది. మొదటి భాగంలో అద్భుతంగా నటించిన నేహా శెట్టిని ఈ సినిమాలో అతిథి పాత్రలో చూపించనున్నారట. మొదటి భాగంలో నటించిన కొన్ని పాత్రలు రెండో భాగంలోనూ కొనసాగుతాయి. ఇంకొన్ని అడిషనల్ రోల్స్ కూడా యాడ్ చేయబోతున్నారట. అయితే మెయిన్ హీరోయిన్ కోసం ఇప్పటికే వేట షురూ అయిందని టాక్. మరో గ్లామర్ బ్యూటీని ఈ డీజే టిల్లుతో రొమాన్స్ చేయించాలని సన్నాహాలు చేస్తున్నారట. సో.. చూడాలి మరి ఆ అదృష్టం ఏ హీరోయిన్ని వరిస్తుందనేది!.
Published by:Sunil Boddula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.