హోమ్ /వార్తలు /సినిమా /

Neha Shetty: కార్తికేయ 'బెదురులంక 2012'.. నేహా శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్

Neha Shetty: కార్తికేయ 'బెదురులంక 2012'.. నేహా శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్

Bedrulanka 2012 (Photo Twitter)

Bedrulanka 2012 (Photo Twitter)

Beduru Lanka 2012: కార్తికేయ గుమ్మకొండ హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'బెదురులంక 2012'. క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమా నుంచి నేహా శెట్టి ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

కార్తికేయ గుమ్మకొండ (Kartikeya Gummakonda) హీరోగా రాబోతున్న కొత్త సినిమా 'బెదురులంక 2012' (Beduru Lanka 2012). క్లాక్స్ (Clax) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను లౌక్య ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 3గా రవీంద్ర బెనర్జీ (బెన్నీ) ముప్పానేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సి. యువరాజ్ చిత్ర సమర్పకులు. ఈ చిత్రంలో కార్తికేయ సరసన 'డీజే టిల్లు' ఫేమ్ నేహా శెట్టి (Neha shetty) కథానాయికగా నటిస్తున్నారు. ఈ రోజు ఆమె పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి ఆమె ఫస్ట్ లుక్ (Neha Shetty First Look) విడుదల చేశారు మేకర్స్.

'బెదురులంక 2012'లో చిత్ర పాత్రలో నేహా శెట్టి కనిపించనున్నట్లు చిత్ర బృందం పేర్కొంది. పెర్ఫార్మన్స్‌కు స్కోప్ ఉన్న పాత్ర ఆమె చేస్తున్నారని తెలియజేసింది. దర్శకుడు క్లాక్స్ మాట్లాడుతూ "సంప్రదాయబద్ధంగా కనిపించే మోడ్రన్ అమ్మాయి చిత్ర. పైకి బార్బీ బొమ్మలా కనిపిస్తుంది కానీ లోపల ఆర్డీఎక్స్ బాంబ్ లాంటి మనస్తత్వం ఆమెది. అందంగా కనిపిస్తూ.. అభినయంతో నేహా శెట్టి ఆకట్టుకుంటారు. కార్తికేయ, నేహా కాంబినేషన్.. వాళ్ళిద్దరి సీన్స్ అందర్నీ ఆకట్టుకుంటాయి. డ్రామెడీ (డ్రామా ప్లస్ కామెడీ) జానర్ చిత్రమిది. ఒక ఊరు నేపథ్యంలో వినోదం, మానవ భావోద్వేగాలతో కూడిన కథతో సినిమా రూపొందిస్తున్నాం" అని చెప్పారు.

చిత్ర నిర్మాత బెన్నీ ముప్పానేని మాట్లాడుతూ.. "మా హీరోయిన్ నేహా శెట్టి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. సినిమాలో ఆమె రోల్ చాలా బావుంటుంది. కార్తికేయ, నేహా శెట్టి కాంబినేషన్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. వినోదాత్మక చిత్రమిది. చిత్రీకరణ దాదాపు పూర్తి కావొచ్చింది. త్వరలో సినిమా కంప్లీట్ అవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. కొత్త ఏడాదిలో చిత్రాన్ని విడుదల చేస్తాం. థియేటర్లలో ప్రేక్షకులు కొత్త సినిమా చూస్తారు. డ్రామా, కామెడీ, యాక్షన్, ఎమోషన్స్ సినిమాలో మెయిన్ హైలైట్స్ అవుతాయి'' అని చెప్పారు.

కార్తికేయ, నేహా శెట్టి జంటగా నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ ఘోష్, రాజ్ కుమార్ కసిరెడ్డి, శ్రీకాంత్ అయ్యంగార్, 'ఆటో' రామ్ ప్రసాద్, గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్, సత్య, సురభి ప్రభావతి, కిట్టయ్య, అనితానాథ్, దివ్య నార్ని ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం అందించగా.. మణిశర్మ సంగీతం అందించారు. అవనీంద్ర ఉపద్రష్ట, వికాస్ గున్నల సహ నిర్మాతలుగ పని చేశారు.

First published:

Tags: Neha Shetty, Tollywood, Tollywood actress

ఉత్తమ కథలు