సంజయ్‌దత్‌కి ఏమైంది... షాకవుతున్న నెటిజన్లు

Bollywood : రుషి కపూర్, ఆయన ఫ్రెండ్స్‌కి సంబంధించి నీతూ కపూర్ పెట్టిన ఫొటోలో... సంజయ్ దత్ ఎందుకు అలా ఉన్నారన్నది కలకలం రేపింది. ఆయన ఆరోగ్యంపై అనుమానాలు కలిగాయి.

news18-telugu
Updated: December 1, 2019, 8:31 AM IST
సంజయ్‌దత్‌కి ఏమైంది... షాకవుతున్న నెటిజన్లు
సంజయ్‌దత్‌కి ఏమైంది (credit - insta - neetu54)
  • Share this:
బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ఇటీవల తన ఫ్రెండ్సైన రుషి కపూర్, నీతూ కపూర్‌ను కలిసేందుకు ముంబైలోని వాళ్లింటికి వెళ్లాడు. సంజయ్‌దత్‌తో తాము ఆనంద క్షణాల్ని గడిపామంటూ... నీతూ దత్... ఓ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ఓ నోట్ కూడా రాసింది. ఫ్రెండ్స్ వచ్చి పలకరిస్తే సంతోషకరమైన ఫీలింగ్... వాళ్లు మనల్ని ఎంతలా అభిమానిస్తున్నారో, ఎంతలా మిస్సవుతున్నారో తెలుస్తుంది అని రాసింది. ఈ ఫొటో చూసి 67 ఏళ్ల రుషి కపూర్, 60 ఏళ్ల సంజయ్ దత్ సంతోషపడ్డారు. ఐతే... ఇందులో సంజయ్ దత్ కళ్లు మూసుకొని, నీరసంగా ఉన్నట్లు కనిపిస్తుండటంతో... ఆయన ఆరోగ్యంపై నెటిజన్లకు అనుమానాలు కలుగుతున్నాయి. సంజయ్ బాబాకి ఎలా ఉంది అని ఒకరు అడగ్గా... సంజు సార్ చాలా వీక్‌గా ఉన్నారు, ఆయన ఆరోగ్యంగానే ఉన్నారా అని మరొకరు అడిగారు. సంజు చాలా ఓల్డ్‌గా కనిపిస్తున్నారని ఇంకొకరి కామెంట్. ఆ పానిపట్ నటుడికి సంబంధించి మంచి ఫొటో పోస్ట్ చెయ్యమని మరో నెటిజన్ కోరారు.
View this post on Instagram

Feels great when friends come over to just say How much they love you How much they missed you 💕🥰


A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

రుషి కపూర్, సంజయ్ దత్... సాహిబాన్, అగ్నిపథ్, హత్యార్ వంటి సినిమాల్లో కలిసి నటించారు. వాళ్లిద్దరికీ సంబంధించి నీతూ కపూర్ నైన్టీస్‌లో ఫొటో ఒకటి ఇదివరకు షేర్ చేసింది. కపూర్, సంజూతో ఓ మధ్యాహ్నం వేళ అని కాప్షన్ పెట్టింది.
View this post on Instagram

A lazy afternoon with Kapoor and Dutt #throwback #memories #friendship 😎


A post shared by neetu Kapoor. Fightingfyt (@neetu54) on

గతేడాది సంజయ్ దత్, రణబీర్ కపూర్‌తో హౌస్ పార్టీకి సంబంధించిన ఫొటో ఒకటి రుషీ కపూర్ ట్వీట్ చేశాడు. సంజయ్ దత్ బయోపిక్‌ రిలీజ్‌కి కొన్ని రోజుల ముందు ఫొటో అది. రాజ్‌కుమార్ హిరానీ దర్శకత్వంలో వచ్చిన ఆ బయోపిక్‌లో సంజయ్ దత్ పాత్రలో... రణబీర్ నటించాడు. విమర్శకుల ప్రశంసలు పొందాడు.


సంజయ్ దత్ నటించిన పానిపట్... డిసెంబర్ 6న రిలీజవుతోంది. న్యూయార్క్‌లో కాన్సర్ ట్రీట్‌మెంట్ పొందిన కొన్ని నెలల తర్వాత రుషీ కపూర్ ఇండియా వచ్చాడు. ది బాడీ అనే ఇన్వెస్టిగేషన్ మూవీలో ఆయన ప్రేక్షకుల్ని అలరించనున్నాడు.


Pics : లవ్లీ బ్యూటీ తరుణీ సింగ్ క్యూట్ ఫొటోస్ఇవి కూడా చదవండి :

Diabetes Diet : బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించే 5 సుగంధ ద్రవ్యాలు...

తెలంగాణ నిర్భయ హత్యపై ప్రియాంక గాంధీ తీవ్ర ఆవేదన

పడిపోతున్న ఫుడ్ డెలివరీ మార్కెట్... ఇవీ కారణాలు

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా... ఒకరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

హైదరాబాద్‌లో మరో దారుణం... సాప్ట్‌వేర్ ఉద్యోగినిపై రేప్?
Published by: Krishna Kumar N
First published: December 1, 2019, 8:31 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading