హోమ్ /వార్తలు /సినిమా /

Hanu Raghavapudi: హను రాఘవపూడి చేతుల మీదుగా నీతో ట్రైలర్ లాంచ్..

Hanu Raghavapudi: హను రాఘవపూడి చేతుల మీదుగా నీతో ట్రైలర్ లాంచ్..

Neetho Trailer (Photo Twitter)

Neetho Trailer (Photo Twitter)

neetho Movie Trailer: యూత్ ఆడియన్స్ మెచ్చే డిఫరెంట్ కంటెంట్ తో 'నీతో' సినిమాను తెరకెక్కిస్తున్నారు. చిత్ర షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ నిర్వహించిన చిత్రయూనిట్.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ రిలీజ్ చేసింది.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

అభిరామ్ వర్మ (Abhiram Varma), సాత్వికా రాజ్ (Swathika Raj) హీరో హీరోయిన్లుగా డైరెక్టర్ బాలు శర్మ (Balu Sharma) దర్శకత్వం వహించిన మూవీ "నీతో" (Neetho). పృధ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. యూత్ ఆడియన్స్ మెచ్చే డిఫరెంట్ కంటెంట్ తో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. చిత్ర షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ నిర్వహించిన చిత్రయూనిట్.. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ (Neetho Trailer) రిలీజ్ చేసింది. డైరెక్టర్ హను రాఘవపూడి చేతుల మీదుగా ఈ ట్రైలర్ రిలీజ్ చేశారు.

ఈ ట్రైలర్ ని యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సన్నివేశాలతో కట్ చేశారు. "మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ, ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తురాదు" లాంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అవుతాయి. ట్రైలర్ మొదటి నుండి చివరి వరకు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఆసక్తికరంగా మలిచారు చిత్ర యూనిట్.

వివేక్ సాగర్ ఈ సినిమాకు స్వరాలు సమకూర్చగా, సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె. వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. ఉన్నత నిర్మాణ విలువలతో తెరకెక్కిన 'నీతో' ఈ నెల 30వ తారీఖున థియేటర్లలో విడుదలవ్వబోతోంది.

ఈ సినిమాలో అభిరామ్ వర్మ, సాత్విక రాజ్, రవి వర్మ, నేహా కృష్ణ, కావ్య రామన్, అపూర్వ శ్రీనివాసన్, మోహిత్ బైద్, పవిత్రా లోకేష్, పద్మజా ఎల్, గురురాజ్ మానేపల్లి, సంజయ్ రాయచూర, లేట్. Tnr (తుమ్మల నరసింహా రెడ్డి), స్నేహల్ జంగాల, AV R స్వామి, CS ప్రకాష్, సందీప్ విజయవర్ధన్, కృష్ణ మోహన్, రాజీవ్ కనకాల తదితరులు నటించారు. ఈ సినిమాకు వివేక్ సాగర్ సంగీతం అందించారు. స్మరన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించారు. మార్తాండ్ కె వెంకటేష్ ఎడిటింగ్ వర్క్స్ చేపట్టారు.

Published by:Sunil Boddula
First published:

Tags: Tollywood, Tollywood actor