డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన షారుక్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ (Shah Rukh Khan son Aryan Khan)కు ఎన్సీబీ అధికారులు షాకిచ్చారు. ఈ కేసు మరింత పెద్దదిగా అనిపిస్తుండటంతో అక్టోబర్ 11 వరకు ఆర్యన్‌ను కస్టడీలోనే ఉంచాల్సిందిగా నార్కోటిక్స్ కంట్రోల్ (NCB) బ్యూరో కోర్టును కోరింది. అయితే అక్టోబర్ 7వ వరకు ఈ గడువు పొడిగించింది కోర్టు. తాజాగా బెయిల్ కూడా నిరాకరించింది కోర్టు. మరోవైపు ఈయన రెండు రోజుల కింద ముంబై తీరంలో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ తీసుకున్నాడని ఎన్‌సీబీ అరెస్టు చేసారు. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయిపోయింది. అందులో ఆర్యన్‌తో పాటు మరో ఏడుగురిని కూడా ఈ టీమ్ అదుపులోకి తీసుకుంది. ఎన్‌సీబీ ఆఫీస్‌లో విచారణ కొనసాగుతున్న సమయంలో ఓ వ్యక్తి ఆర్యన్ ఖాన్‌తో సెల్ఫీ దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇందులో ఉన్నది ఎన్‌సీబీ అధికారి కాదని తేల్చేసింది డిపార్ట్‌మెంట్. ఈ డ్రగ్స్ కేసు విషయంలో ఆర్యన్‌తో పాటు పలువురు ప్రముఖుల పిల్లలు అర్బాజ్ మర్చంట్, మున్మున్ ధమేచా, నూపుర్ సారిక, ఇస్మీత్ సింగ్, మోహక్ జస్వాల్, విక్రాంత్ చోకర్, గోమిత్ చోప్రాను ఎన్‌సీబీ అరెస్టు చేసింది. కాగా వారిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసారు. తాజాగా ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ రాకపోవడంతో కేసు మరింత భారీగా మారేలా కనిపిస్తుంది. ముఖ్యంగా వీళ్లకు డ్రగ్స్ ఎక్కడ్నుంచి వస్తుంది.. ఎవరు సరఫరా చేస్తున్నారు.. ఎలా వస్తుంది అనే విషయాలపై ఎన్సీబీ అధికారులు దృష్టి పెట్టారు. దీనికోసం మరింత సమయం కావాలని కోరారు వాళ్ళు. మరోవైపు అరెస్ట్ చేసిన సమయం నుంచి ఆర్యన్ ఖాన్ ఒకటే ఏడుస్తున్నాడని తెలుస్తుంది. కొడుకు ఆర్యన్‌తో షారుక్ ఖాన్ మాట్లాడాడని.. ధైర్యం చెప్పాడని వార్తలు వస్తున్నాయి. మరి ఈ కేసు ఇంకా ఎంత దూరం వెళ్తుందో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bollywood, Drugs case, Shah Rukh Khan, Telugu Cinema