NBK - Santosh Srinivas: దర్శకుడు సంతోష్ శ్రీనివాస్.. ప్రస్తుతం బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌తో ‘అల్లుడు అదుర్స్’ సినిమాను తెరకెక్కించాడు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15న విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సంతోష్ శ్రీనివాస్..మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా బాలకృష్ణతో తన నెక్ట్స్ ప్రాజెక్ట్ గురించి మాట్లాడారు. ఇప్పటికే బాలయ్య గురించి ఓ పవర్ ఫుల్ స్టోరీని రెడీ చేసినట్టు చెప్పుకొచ్చాడు. లాక్డౌన్లో ఈ సినిమా స్టోరీని రాసుకున్నట్టు చెప్పాడు. ఇంకా ఈ సినిమా స్టోరీని డెవలప్ చేసాను. త్వరలోనే బాలయ్యను కలిసి స్టోరీ లైన్ వినిపించబోతున్నట్టు చెప్పాడు. బాలయ్య విషయానికొస్తే.. ప్రస్తుతం ఈయన బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.
అయితే ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరనే విషయం పూటకో వార్త హల్చల్ చేసింది. సాయేషా సైగల్ అని కన్ఫామ్ చేసి.. చివరకు ప్రగ్యా జైస్వాల్‌ను హీరోయిన్గా తీసుకున్నారు. ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా షూటింగ్ జరగుతోంది. ఈ సినిమా తర్వాత సంతోష్ శ్రీనివాస్‌తో చేయబోయే సినిమా సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది. ఇక ఈ సినిమాకు ‘బలరామయ్య బరిలో దిగితే’ అనే పవర్ఫుల్ టైటిల్ అనుకుంటున్నారు. ఇప్పటికే నిర్మాత అనిల్ సుంకర ఈ సినిమా స్టోరీతో పాటు టైటిల్‌ను రిజిస్టర్ చేసారు. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది.
Published by:Kiran Kumar Thanjavur
First published:January 06, 2021, 13:51 IST