హోమ్ /వార్తలు /సినిమా /

NBK-Rajinikanth-Mohanlal: రజినీకాంత్, మోహన్ లాల్‌‌లతో.. బాలకృష్ణ విజయశాంతి అపురూపమైన ఫోటో..

NBK-Rajinikanth-Mohanlal: రజినీకాంత్, మోహన్ లాల్‌‌లతో.. బాలకృష్ణ విజయశాంతి అపురూపమైన ఫోటో..

బాలయ్య,రజినీకాంత్,మోహన్‌లాల్,విజయశాంతి (File/Photo)

బాలయ్య,రజినీకాంత్,మోహన్‌లాల్,విజయశాంతి (File/Photo)

NBK-Rajinikanth-Mohanlal: ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. తాజాగా బాలయ్య, రజినీ, మోహన్‌లాల్‌ను విజయశాంతి సత్కరించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

NBK-Rajinikanth-Mohanlal: ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి త్రోబ్యాక్ పిక్ అనే క్యాప్షన్ ఇవ్వాలి. అంతేకాదు పోస్ట్ చేసే ఫోటోలో ఏదైనా స్పెషాలిటీ ఉండాలి. తాజాగా బాలకృష్ణ,రజినీకాంత్, మోహన్‌లాల్‌తో ఉన్న విజయశాంతి పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఏదో సందర్భంగా విజయశాంతి ఈ ముగ్గురు హీరోలను సత్కరించినట్టు ఈ ఫోటో ఉంది. ఈ ముగ్గురు హీరోల మెడల్లో పెద్ద పూల దండలున్నాయి. కానీ విజయశాంతికి మాత్రం లేదు. అంటే విజయశాంతి ఏదో సందర్బంగా బాలయ్య, రజినీ, మోహన్‌లాల్‌ను పిలిచి ఈ ముగ్గురిని సత్కరించినట్టు ఉంది ఈ ఫోటో.  కానీ ఈ ఫోటో బాలయ్య, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన ‘నిప్పురవ్వ’ సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా తీసినది. ఈ సినిమా ఓపెనింగ్‌కు రజినీకాంత్, మోహన్ లాల్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. నిప్పురవ్వ విషయానికొస్తే.. ఈ చిత్రం బాలయ్య, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించి చివరి చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని సాధించలేదు.

మరోవైపు విజయశాంతి తమిళంలో రజినీకాంత్‌తో, మలయాళంలో మోహన్‌లాల్‌తో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగ ఉన్న విజయశాంతి.. ఈ యేడాది మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. రీసెంట్‌గా తనకు రాజకీయ జన్మనిచ్చిన బీజేపీలో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా.

First published:

Tags: Balakrishna, Mohanlal, NBK, Rajinikanth, Tollywood, Vijayashanti

ఉత్తమ కథలు