NBK - PSPK Unstoppable 2 Latest Promo: బాలయ్య, పవన్ కలిస్తే అంతే మరి...అవును నందమూరి, మెగా ఫ్యామిలీ లెగసీని కంటిన్యూ చేస్తూ.. గత 4 దశాబ్దాలుగా ఈ ఫ్యామిలీ హీరోలు ప్రత్యర్ధులుగా టాలీవుడ్ తెరను ఏలుతున్నారు. అలాంటి సినీ కుటుంబానికి చెందిన బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ ఒక టాక్ షో కోసం కలిసారు. వీళ్లిద్దరు కలవడం సినీ, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్ ఎపిసోడ్‌లో పవన్ కళ్యాన్ మూడు మ్యారేజ్‌లపై క్వశ్చన్స్ అడిగి బాలయ్య ఆసక్తిరేసారు. అంతేకాదు ఇకపై పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లపై మాట్లాడేవారు ఊర కుక్కలు అంటూ ఒక తీర్మానం చేశారు. ఇక బాలయ్య, పవన్ ఎపిసోడ్‌లో చిన్నపుడు తాను బాలయ్య నటించిన ‘సీతారామకళ్యాణం’, ఆదిత్య 369 సినిమాలు చూసినట్టు చెప్పారు. తొలిసారి తాము పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సుస్వాగతం’ సినిమా ఓపెనింగ్‌లో కలిసినట్టు చెప్పుకొచ్చారు.
అంతేకాదు తాము ఎన్నోసార్లు పర్సనల్‌గా కలుసుకున్నట్టు ఈ షో వేదికగా అభిమానులకు క్లారిటీ ఇచ్చారు. ఈ షోలో సాయి ధరమ్ తేజ్ పంచకట్టులో సందడి చేసారు. ఈ సందర్భంగా బాలయ్య.. సాయి ధరమ్ తేజ్ పెళ్లి ఎపుడు అడగడం.. దానికి పెళ్లి కాకపోవడంతో తాను చాలా హ్యాపీగా ఉన్నట్టు చెప్పుకొచ్చారు. చివరగా సాయి ధరమ్ తేజ్‌ను శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అంటూ బాలయ్య.. సాయి ధరమ్ తేజ్‌ను దీవించడం. అటు మావయ్య పవన్ కళ్యాణ్‌తో సాయి ధరమ్ తేజ్ అనుబంధం ఈ ఎపిసోడ్‌లహైలెట్‌గా నిలిచింది. మరోవైపు బాలయ్య రామ్ చరణ్‌కు ఫోన్ చేయడం .. చిన్నపుడు బాబాయిను ఎలా ఆటపట్టించిన విషయాన్నిఈ షోలో ప్రస్తావనకు రావడం మరో హైలెట్‌గా నిలిచింది.
The show is not yet over guys! Sooti Prashnalu, thootallanti answers tho, Part 2 is going to create sensation on Feb 10th. The Baap of all Episodes Part 2 promo is here ????#PawanKalyanOnAHA #UnstoppableWithNBKS2 @PawanKalyan #PawanKalyanOnUnstoppable ▶️ https://t.co/qvNdeKR1nA pic.twitter.com/0aEaNzb4Ps
— ahavideoin (@ahavideoIN) February 5, 2023
తాజాగా ఈ ఎపిసోడ్‌కు కొనసాగింపుగా రెండో ఎపిసోడ్ 9వ తేది రాత్రి ప్రసారం కానుంది. దానికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసారు. ఈ ప్రోమోలో ఆ జేబులో ఏమి పెట్టుకున్నావు. ఎవరిని కొట్టకుండా ఆపుకోవడానికి పెట్టుకున్నావా అంటూ బాలయ్య.. పవన్ కళ్యాణ్‌ను అడగటం. మరోవైపు కార్లో బయటకు రాకూడదు. బయటకు రాకూడదు. నన్ను ఏపీ ప్రభుత్వం ఇబ్బందులు పెట్టిన విషయాన్ని ప్రస్తావించారు. మనం ప్రాథమిక హక్కుల గురించి మాట్లాడుతాం కానీ.. ప్రాథమిక బాధ్యతల గురించి మాట్లాడం. రాజకీయాల్లో ఆధిపత్య ధోరణితో ఇదంత జరగుతోందనే విషయాన్ని పవన్ కళ్యాణ్.. బాలయ్యతో ప్రస్తావించారు. ఇంకోవైపు బాలయ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో నీ ఫ్యాన్ కానీవాడు లేడు. మీ మ్యానిఫెస్టోను పూర్తిగా ప్రజల్లోకి బలంగా వెళ్లకపోవడం వల్ల అవి ఓట్లుగా కన్వర్ట్‌గా కాలేదని బాలయ్య అడిగారు. ఈ సందర్భంగా ఓ పెద్దావిడ వచ్చి ఎమోషనల్‌గా మాట్లాడుతూ.. కరోనాతో తన ఇద్దరు కుమారులు చనిపోయారు. ఇక పవన్ కళ్యాణ్ సీఎం అయితే చనిపోతాననడం గుండెలను పిండేసింది. ఇక ఈ షోలో దర్శకుడు క్రిష్.. రావడం.. మా ఇద్దరితో పనిచేసావు కదమ్మ. ఒక సింహం, పులి మధ్య నా తల ఉంది. భయ్యా నువ్వు సినిమాలు మానేసి ప్రజాసేవకు ఇంపార్టెన్స్ ఇవ్వాలి. దీనికి పవన్ కళ్యాణ్ ఏం సమాధానమిచ్చేడనేది సెకండ్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.
ఇన్ని విమర్శలు, వాడీ వేడీ డబుల్ ఇంపాక్ట్ అయ్యాయని బాలయ్య అడిగితే.. పవన్ కళ్యాణ్.. నేను చాలా పద్ధతిగా మాట్లాడుతానే అంటూ పవన్ కళ్యాణ్ సమాధానం ఇవ్వడం. కట్ చేస్తే బాలయ్య మాట్లాడుతూ.. అణువణున ఇరుకున పెడితే అణు బాంబు అవుతావు అని పవన్ కళ్యాణ్‌ను చప్పట్టు కొట్టడం హైలెట్. మొత్తంగా ప్రోమోతోనే ఈ సెకండ్ ఎపిసోడ్ వాడీవేడిగా పవన్ కళ్యాణ్ రాజకీయాలతో పాటు ఏపీలోని సమకాలీన పరిస్థితులు చర్చకు రాబోతున్నాయి. ఈ ఎపిసోడ్ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Aha OTT, Balakrishna, Balayya, NBK, Pawan kalyan, PSPK, Tollywood, Unstoppable With NBK S2