హోమ్ /వార్తలు /సినిమా /

NBK - PSPK : జై బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులు లేసిన పవన్ కళ్యాణ్ భామ.. వీడియో వైరల్..

NBK - PSPK : జై బాలయ్య పాటకు అదిరిపోయే స్టెప్పులు లేసిన పవన్ కళ్యాణ్ భామ.. వీడియో వైరల్..

బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

బాలకృష్ణ,పవన్ కళ్యాణ్ (Twitter/Photo)

NBK - PSPK : నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ’. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. తాజాగా ఈ సినిమాలోని జై బాలయ్య పాటకు పవన్ కళ్యాణ్ భామ వేసిన స్టెప్పలు వైరల్ అవుతున్నాయి.

ఇంకా చదవండి ...

  NBK - PSPK : నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘అఖండ ’. బోయపాటి శ్రీను  (Boyapati Sreenu) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 2న విడుదలై బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఈ సినిమాలో బాలయ్య ‘అఖండ’ (Akhanda)అనే అఘోరా పాత్రలో అదరగొట్టేసారు. మరోవైపు రైతు పాత్రలో కూడా నటించారు. ఈ సినిమా నాలుగు వారాల తర్వాత కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లనే సాధించింది. ఈ మధ్య కాలంలో ఎన్నడూ చూడని ప్రభంజనం ఇది. ముఖ్యంగా బాలయ్య పని అయిపోయింది అనుకున్న వాళ్ళకు దిమ్మ తిరిగిపోయేలా సమాధానం ఇచ్చారు. ఇక ఈ సినిమాకు తమన్  అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు ప్రాణంలా నిలిచింది. అంతేకాదు ఈ సినిమాలో పాటలు కూడా సూపర్ హిట్టైయ్యాయి. టైటిల్ సాంగ్‌ ‘అఖండ’తో పాటు జై బాలయ్య (Jai Balayya) పాట మాస్‌లో దూసుకెళ్లిపోయింది. ముఖ్యంగా 60 యేళ్ల పై బడిన ఏజ్‌లో కూడా బాలయ్య తన డాన్స్ మూమెంట్స్‌తో అదరగొట్టిన విధానం చూసి అందరు ఆశ్యర్యపోతున్నారు.

  ఇప్పటికే ఎంతో మంది సెలబ్రిటీలు జై బాలయ్య సాంగ్‌కు డాన్సులు చేస్తూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా ‘అఖండ’ మూవీలోని జై బాలయ్య పాటకు పవన్  కళ్యాణ్ (Pawan Kalyan)‘వకీల్ సాబ్’ (Vakeel Saab) భామ నివేథా థామస్ (Nivetha Thomas) స్టెప్పులేసి అలరించింది. దానికి సంబంధించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో  షేర్ చేసింది. జై బాలయ్య పాటకు నివేథా థామస్ వేసిన స్టెప్పులు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


  నివేథా థామస్ విషయానికొస్తే..  నాని న‌టించిన ‘జెంటిల్‌మన్’ చిత్రంతో టాలీవుడ్‌కి ప‌రిచ‌యమైంది.  అన‌తి కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. త‌న న‌ట‌న‌తో అంద‌రినీ ఆక‌ట్టుకొని త‌న‌కంటూ ప్ర‌త్యేకంగా అభిమానుల‌ను సంపాదించుకున్నారు. అంతేకాదు స్క్రిప్ట్‌ల విష‌యంలోనూ ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ప్రాధాన్య‌త ఉన్న పాత్ర‌ల‌నే ఆమె ఎంచుకుంటున్నారు.  ఈ యేడాది పవన్ కళ్యాణ్ హీరోగా రీ ఎంట్రీ ఇచ్చిన ‘వకీల్ సాబ్’లో ముఖ్యపాత్రలో నటించి మెప్పించింది.

  Akhanda 4 Weeks collections: ‘అఖండ’ 4 వారాల కలెక్షన్స్.. 28వ రోజు ఎంత రాబట్టిందంటే..


  రీసెంట్‌గా  ఈ భామ ఆఫ్రికా ఖండంలోని టాంజానియా దేశంలోని అదిపెద్ద పర్వతమైన కిలిమంజారో అధిరోహించింది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ సందర్భంగా భారత జాతీయ పతాకాన్ని అక్కడ సగర్వంగా రెప రెప లాడించిన సంగతి తెలిసిందే కదా. పవన్ కళ్యాణ్ నటించిన ‘వకీల్ సాబ్’ ముందు ఈమె ఎన్టీఆర్ సరసన ‘జై లవ కుశ’ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. అలాంటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో ఉన్న ఎప్పుడో కానీ ఫోటోలు పంచుకోదు. రీసెంట్‌గా  కిలిమంజారో పర్వతం అధిరోహించిన ఫోటోలను పంచుకున్నారు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhanda movie, Balakrishna, Jai Balayya, Nivetha Thomas, Pawan kalyan, Vakeel Saab

  ఉత్తమ కథలు