హోమ్ /వార్తలు /సినిమా /

NBK - NTR : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో తొలిసారి బాబాయి బాలయ్య క్వశ్వన్ అడిగిన ఎన్టీఆర్..

NBK - NTR : ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షోలో తొలిసారి బాబాయి బాలయ్య క్వశ్వన్ అడిగిన ఎన్టీఆర్..

బాలకృష్ణ,ఎన్టీఆర్ (Twitter/Photo)

బాలకృష్ణ,ఎన్టీఆర్ (Twitter/Photo)

NBK - NTR : NTR - Evaru Meelo Koteeswaralu : ప్రస్తుతం  ఎన్టీఆర్ (Jr NTR)సినిమాలతో పాటు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా. తాజాగా ఈ షోలో ఎన్టీఆర్ బాబాయి బాలయ్యకు సంబంధించిన ఓ క్వశ్చన్ వేసారు.

ఇంకా చదవండి ...

  NBK - NTR : NTR - Evaru Meelo Koteeswaralu : ప్రస్తుతం  ఎన్టీఆర్ (Jr NTR)సినిమాలతో పాటు ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే రియాలిటీ షో కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే కదా.  తాజాగా ఈ షోతో ఎంతో మంది సామాన్యుల కలను ఎన్టీఆర్ నెరవేర్చే పనిలో ఉన్నారు.  అంతేకాదు తనదైన అద్భుతమైన మాటతీరుతో కంటెస్టెంట్స్‌తో పాటు సామాన్య ప్రేక్షకుల మనసులను చూరగొంటున్నారు. ఐతే.. తెలుగులో నాగార్జున(Nagarjuna), చిరంజీవి (Chiranjeevi) వంటి సీనియర్ హీరోలు హోస్ట్ చేసిన సక్సెస్ కానీ  ఈ ప్రోగ్రామ్‌ను ఎన్టీఆర్ ఇపుడు సూపర్ హిట్ చేసి చూపించారు. ఈ షో ప్రీమియర్ ఎపిసోడ్‌లో రామ్ చరణ్ (Ram Charan) గెస్ట్‌గా వచ్చారు. ఈ షోలో దాదాపు రూ. 25 లక్షల వరకు గెలుచుకున్నారు. దీన్ని చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు విరాళంగా అందజేసారు.

  ఆ తర్వాత ఎన్టీఆర్ షోకు రాజమౌళి, కొరటాల శివ ఇద్దరు కలిసి వచ్చి సందడి చేశారు. వీరు కూడా రూ. 25 లక్షల వరకు అమౌంట్ గెలుచుకున్నారు. ఇక దసరా స్పెషల్ ఎపిసోడ్‌లో సమంత సందడి చేసారు. ఈ ఛారిటబుల్ కోసం ఈమె కూడా ఈ షోలో రూ. 25 లక్షల  ప్రైజ్ మనీ గెలుచుకున్నారు. ఈ షోలో ఎన్టీఆర్ కంటెస్టెంట్స్‌కు అడిగే ప్రశ్నలు ఎంతో ఆసక్తి రేపుతున్నాయి. ముఖ్యంగా సినిమాకు సంబంధించిన క్వశ్చన్స్ విషయంలో వీడియో కానీ, ఆడియో కానీ చూపించి ఆయా సినిమాలకు సంబంధించి ప్రశ్నలు వేస్తున్నారు ఎన్టీఆర్.

  ‘ఆహా’ ఓటీటీ కోసం బాలకృష్ణ వర్కింగ్ స్టిల్స్.. సోషల్ మీడియాలో వైరల్..

  ఇప్పటి వరకు ఎక్కువగా ఎన్టీఆర్ ఈ షోలో వేరే హీరోలకు సంబంధించిన క్వశ్చన్స్ మాత్రమే అడుగుతూ వచ్చారు. ఇక తని సినిమాలతో పాటు తన ఫ్యామిలీ హీరోలకు సంబంధించిన ప్రశ్నలు అడగటం చాలా తక్కువ ఉంది. బహుశా ఈ నెల 19 ప్రసారమైన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ఎపిసోడ్‌లో ఓ కంటెస్టెంట్‌కు బాబాయి బాలకృష్ణకు సంబంధించి ప్రశ్న వేశారు ఎన్టీఆర్.

  NTR-NBK: తండ్రి ఎన్టీఆర్ ఓల్డ్ క్లాసిక్ టైటిల్స్‌తో బాలకృష్ణ చేసిన సినిమాలు ఏమిటో తెలుసా..

  ‘లక్స్ పాప లక్స్  పాప’ అంటూ ఓ ఆడియో వినిపించి ఈ సినిమా ఏ చిత్రంలోని అని 10 రూపాలయ ప్రశ్న అడిగారు. దీనికి నాలుగు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. A) పైసా వసూల్, B) నరసింహనాయుడు C) లెజెండ్ D) సింహా అంటూ ఆప్షన్స్ ఇచ్చారు. దీనికి హాట్ సీట్‌లో కూర్చోన్న కంటెస్టెంట్ B నరసింహనాయుడు అంటూ కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు. దీనికి ఎన్టీఆర్ మాట్లాడుతూ.. ఈ సినిమాను చూసారా అడగుతారు. దీనికి చూసానని కంటెస్టెంట్ సమాధానం చెబుతారు. మరోవైపు ఎన్టీఆర్ ఈ మూవీని థియేటర్‌లో చూసారా లేదా టీవీలో అన్న ప్రశ్నకు రెండింటిలో చూశానంటూ సమాధానం ఇస్తారు. ఇక ఎన్టీఆర్ మాట్లాడుతూ.. బి.గోపాల్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి మణిశర్మ సంగీతంతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన విషయాన్ని చెప్పడం గమనార్హం.

  Balakrishna Industry Hits: మంగమ్మ గారి మనవడు టూ నరసింహనాయుడు వరకు ఇండస్ట్రీ హిట్ సాధించిన బాలకృష్ణ సినిమాలు ఇవే..


  ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. నేను చిన్నపుడు ఎన్నో సినిమాలు చూసాను. కానీ కాస్తా పెద్దయ్యాకా బాబాయి బాలయ్య నటించిన ‘నరసింహనాయుడు’ సినిమాను ఊర్వశి థియేటర్‌లో చూసినట్టు పాత జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. ఇక ఈ సినిమాలో సీన్స్, పాటలకు నేను ముందరున్న సీటును తంతే అది విరిగి పడిన విషయాన్నిఎన్టీఆర్ ప్రస్తావించారు.

  NBK - NTR : ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్‌ను వెంటాడుతున్న బాబాయి బాలయ్య బ్యాడ్ సెంటిమెంట్..


  ఇక ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో పలకరించనున్నారు. వచ్చే యేడాది జనవరి 7న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల కానుంది. మరోవైపు బాలకృష్ణ నటించిన ‘అఖండ’ మూవీ విడుదల తేది ఎపుడనేది త్వరలో ప్రకటించనున్నారు. ఈ రెండు సినిమాలపై ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhanda movie, Balakrishna, Jr ntr, NBK, NTR Evaru Meelo Koteeswarulu, Tollywood, Unstoppable NBK

  ఉత్తమ కథలు