NBK-NTR: ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘BB3’ వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రంలో బాలయ్య కవల సోదరులుగా డ్యూయల్ రోల్లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఈయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటిస్తోంది. మరో ముఖ్యపాత్రలో పూర్ణ యాక్ట్ చేస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్రంలో తారక్.. స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నెత్తిన రూమీ టోపి పెట్టుకోవడంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఆదివాసీల ఆరాధ్యదైవమైన కొమరం భీమ్‌ను ఇలా చూపించడాన్ని వాళ్లు తప్పుపడుతున్నారు. రాజమౌళి తప్పు సరిదిద్దుకొని అలాంటి సీన్స్ లేకుండా చిత్రీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ ఇలాగే సినిమా రిలీజ్ చేస్తే.. థియేటర్స్‌లో తెరలు చినిగిపోవడం ఖాయం అంటున్నారు.
ఆ సంగతి పక్కన పెడితే.. స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్ పై అప్పట్లో అల్లాణి శ్రీధర్ అనే దర్శకుడు ‘కొమరం భీమ్ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా దక్కాయి. ఆ తర్వాత ఇదే కొమరం భీమ్ క్యారెక్టర్‌ను బాలకృష్ణ.. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కించిన ‘పరమవీరచక్ర’ సినిమాలో కాసేపు కొమరం భీమ్‌గా కనిపించడం విశేషం.

ఆర్ఆర్ఆర్లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, పరమవీరచక్రలో కొమరం భీమ్‌గా కాసేపు కనిపించిన బాలకృష్ణ (File/Photos)
*పరమవీరచక్ర’ సినిమా విషయానికొస్తే.. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రలను చేసాడు. ఒకటి మేజర్ జయ సింహా పాత్ర అయితే.. మరొకటి.. హీరో చక్రధర్ క్యారెక్టర్. కథానాయకుడు పాత్ర కాబట్టి.. ఇందులో వివిధ పాత్రల్లో బాలయ్య నటించారు. అందులో కొమరం భీమ్ పాత్ర ఒకటి. ఈ పాత్రలో బాలయ్య ఇరగదీసాడు. ఇందులో నిజాంగా చలపతిరావు నటించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం రాబట్టలేకపోయింది.

కొమరం భీమ్‌గా బాలకృష్ణ,ఎన్టీఆర్ (File/Photos)
అందుకే ఈ సినిమాలో బాలయ్య కొమరం భీమ్ వేషం వేసాడనే విషయం.. బాలయ్య అభిమానులకు సినీ జర్నలిస్టులకు కొంత మంది కామన్ ఆడియన్స్‌కు మాత్రమే తెలుసు. మొత్తంగా అప్పట్లో కొమరం భీమ్‌గా బాబాయి బాలయ్య అలరిస్తే.. ఇపుడు అబ్బాయి ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో ఫిక్షనల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’లో గొండు వీరుడు కొమరం భీమ్‌గా త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్‌గా బాబాయి, అబ్బాయి (File/Photo)
వివాదాలను పక్కన పెడితే.. ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఆహార్యం సరిగ్గా సరిపోయింది. ఈ చిత్రంలోని ట్రైలర్లో కొమరం భీమ్‌ను చూపించిన సన్నివేశాలపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంగతి పక్కన పెడితే.. మొత్తంగా సినిమా విడుదల వరకు రాజమౌళి ఆర్ఆర్ఆర్లో కొమరం భీమ్ పాత్రపై వస్తోన్న ఈ వివాదాలను ఇలాగే కొనసాగిస్తారా లేదా మధ్యలో దీనికి ముగింపు పలకుతాడా అనేది చూడాలి.
Published by:Kiran Kumar Thanjavur
First published:December 13, 2020, 08:20 IST