హోమ్ /వార్తలు /సినిమా /

NBK - NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్..

NBK - NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్..

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ స్పెషల్ అనౌన్స్‌మెంట్ (Twitter/Photo)

ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ స్పెషల్ అనౌన్స్‌మెంట్ (Twitter/Photo)

NBK - NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నట్టు బాలకృష్ణకు చెందిన ఎన్బీకే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది.

  NBK - NTR: ఎన్టీఆర్ జయంతి సందర్భంగా బాలకృష్ణ నుంచి స్పెషల్ అనౌన్స్‌మెంట్ చేయనున్నట్టు బాలకృష్ణకు చెందిన ఎన్బీకే ఫిల్మ్స్ ట్వీట్ చేసింది. వివరాల్లోకి వెళితే.. ఎన్టీఆర్ జయంతి అంటే ఎన్టీఆర్ నందమూరి అభిమానులకు పండగ లాంటిది. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జయంతికి ఒక రోజు ముందు బాలకృష్ణ ఫ్యాన్స్ ఓ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు ప్రకటించారు. ఈ గురువారం ఉదయం 8.45 నిమిషాలకు ప్రకటించనున్నారు. ఐతే.. బాలయ్య ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎలాంటి ప్రకటన చేయనున్నారా అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఒకవేళ కరోనా లేకపోయి ఉంటే.. ఎన్టీఆర్ జయంతి రోజున ‘అఖండ’ సినిమా విడుదలై ఉండేది.

  అది కాకుండా గత కొన్ని రోజులుగా బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎన్నో వార్తలు వస్తున్నాయి. 2017లో ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ సినిమా నుంచి బాలయ్య తనయుడి ఎంట్రీ పై వార్తలు వినిపిస్తున్నాయి. బాలకృష్ణ కూడా తన తనయుడి ఎంట్రీ ఉంటుందని ఎన్నో సార్లు చెప్పారు. దాదాపు నాలుగేళ్లు గడుస్తోన్న మోక్షజ్ఞ ఎంట్రీ పై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది.

  మరి తనయుడి సినిమా పై బాలయ్య ప్రకటన ఉండబోతుందా లేకపోతే.. మరేదైనా ప్రకటన చేస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం బాలకృష్ణ .. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తర్వాత సినిమా ఉండనుంది. ఆపై అనిల్ రావిపూడితో సినిమా కూడా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఏమైనా.. ఈ గురువారం బాలయ్య తన తండ్రి ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఎలాంటి ప్రకటన చేస్తారనేది నందమూరి ఫ్యాన్స్‌లో ఉత్కంఠ నెలకొంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, NBK, NTR, Tollywood

  ఉత్తమ కథలు