హోమ్ /వార్తలు /సినిమా /

NBK - NTR : ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్‌ను వెంటాడుతున్న బాబాయి బాలయ్య బ్యాడ్ సెంటిమెంట్..

NBK - NTR : ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్‌ను వెంటాడుతున్న బాబాయి బాలయ్య బ్యాడ్ సెంటిమెంట్..

బాలకృష్ణ,ఎన్టీఆర్ (File/Photos)

బాలకృష్ణ,ఎన్టీఆర్ (File/Photos)

NBK - NTR : ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్‌ను వెంటాడుతున్న బాబాయి బాలయ్య బ్యాడ్ సెంటిమెంట్.. ఇంతకీ తారక్‌ను వెంటాడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఏమిటంటే..

  NB K-NTR :  అబ్బాయి ఎన్టీఆర్‌ ఆర్ఆర్ఆర్‌ను వెంటాడుతున్న బాబాయి బాలయ్య బ్యాడ్ సెంటిమెంట్.. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ’అఖండ’  సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఉగాది సందర్భంగా విడుదల చేసిన టైటిల్‌తో పాటు టీజర్‌కు ఓ రేంజ్‌లో రెస్పాన్స్ దక్కించుకుంది. తెలుగులో సీనియర్ టాప్ హీరోలు నటించిన ఏ సినిమాకు ఈ స్ఠాయి రెస్పాన్స్ దక్కలేదు. దీంతో బాలయ్య అభిమానులు పండగ చేసుకుంటున్నారు. ఈ సినిమాను దీపావళి కానుకగా విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ కథానాయికగా నటిస్తోంది. శ్రీకాంత్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. ఈ చిత్రంలో బాలయ్య  అఘోరగా, కలెక్టర్‌గా,ఫ్యాక్షనిస్ట్‌గా మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్నాడు.

  మరో ముఖ్యపాత్రలో పూర్ణ యాక్ట్ చేస్తోంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్.. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’  సినిమా కంప్లీట్ చేసారు.  వచ్చే యేడాది జనవరి 7వ తేదిన ఈ సినిమాను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాకు సంబంధించిన ఎన్టీఆర్ డబ్బింగ్ పనులు కూడా పూర్తి చేసారు. ఈ చిత్రంలో తారక్.. స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్ పాత్రలో నటించారు.

  అఖండగా బాలకృష్ణ (Twitter/Photo)

  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. మరోవైపు కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ నెత్తిన రూమీ టోపి పెట్టుకోవడంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే కదా. ఆదివాసీల ఆరాధ్యదైవమైన కొమరం భీమ్‌ను ఇలా చూపించడాన్ని వాళ్లు తప్పుపడుతున్నారు. రాజమౌళి తప్పు సరిదిద్దుకొని అలాంటి సీన్స్ లేకుండా చిత్రీకరణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.ఒకవేళ ఇలాగే సినిమా రిలీజ్ చేస్తే.. థియేటర్స్‌లో తెరలు చినిగిపోవడం ఖాయం అంటున్నారు. 

  rajamouli, chiranjeevi voice over, chiranjeevi in rrr, rrr, tarak, ram charan, rrr teaser, pan india movie rrr, rrr latest news, rrr latest update, rrr release date, ntr motor cycle, komoram bheem vehicle details in rrr, ఆర్‌ఆర్‌ఆర్‌, రాజమౌళి, ఎన్టీఆర్
  RRR లో జూనియర్ ఎన్టీఆర్ (Twitter/Photo)

  ఆ సంగతి పక్కన పెడితే.. స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్ పై అప్పట్లో అల్లాణి శ్రీధర్ అనే దర్శకుడు ‘కొమరం భీమ్ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాకు జాతీయ స్థాయిలో అవార్డులు కూడా దక్కాయి. ఆ తర్వాత ఇదే కొమరం భీమ్ క్యారెక్టర్‌ను బాలకృష్ణ.. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కించిన ‘పరమవీరచక్ర’ సినిమాలో కాసేపు కొమరం భీమ్‌గా కనిపించడం విశేషం

  NBK NTR Balakrishna as Komaram Bhim before NTR in RRR Movie Here are the details,NBK,NTR,NBK NTR Komaram Bheem,RRR Jr NTR,Balakrishna Paramaveerachakra,balakrishna as komaram bheem in paramaveerachakra,jr ntr as komaram bheem in rrr movie,rrr rajamouli rodram ranam rudhiram jr ntr,jr ntr twitter,balakrishna movies,tollywood,telugu cinema,ఎన్టీఆర్,బాలకృష్ణ,ఎన్బీకే,ఎన్‌బీకే,బాలకృష్ణ కొమరం భీమ్,ఎన్టీఆర్ కొమరం భీమ్,ఆర్ఆర్ఆర్‌లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్,పరమవీరచక్రలో కొమరం భీమ్‌గా బాలకృష్ణ,బాలయ్య కొమరం భీమ్‌గా పరమవీరచక్ర
  ఆర్ఆర్ఆర్‌లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్, పరమవీరచక్రలో కొమరం భీమ్‌గా కాసేపు కనిపించిన బాలకృష్ణ (File/Photos)

  *పరమవీరచక్ర’ సినిమా విషయానికొస్తే.. దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాలయ్య రెండు విభిన్న పాత్రలను చేసాడు. ఒకటి మేజర్ జయ సింహా పాత్ర అయితే.. మరొకటి.. హీరో చక్రధర్ క్యారెక్టర్. కథానాయకుడు పాత్ర కాబట్టి.. ఇందులో వివిధ పాత్రల్లో బాలయ్య నటించారు.

  Bollywood 2022 Release Movies : ఆర్ఆర్ఆర్, రాధే శ్యామ్ సహా బాలీవుడ్‌లో విడుదల కాబోతున్న టాలీవుడ్ హీరోల ప్యాన్ ఇండియా మూవీస్ ఇవే..

  అందులో కొమరం భీమ్ పాత్ర ఒకటి. ఈ పాత్రలో బాలయ్య ఇరగదీసారు. ఇందులో నిజాంగా చలపతిరావు నటించాడు.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచిపోయింది. ఈ రకంగా కొమరం భీమ పాత్ర చేసిన ఈ సినిమా బాలయ్యకు కలిసిరాలేదు.

  NBK NTR Balakrishna as Komaram Bhim before NTR in RRR Movie Here are the details,NBK,NTR,NBK NTR Komaram Bheem,RRR Jr NTR,Balakrishna Paramaveerachakra,balakrishna as komaram bheem in paramaveerachakra,jr ntr as komaram bheem in rrr movie,rrr rajamouli rodram ranam rudhiram jr ntr,jr ntr twitter,balakrishna movies,tollywood,telugu cinema,ఎన్టీఆర్,బాలకృష్ణ,ఎన్బీకే,ఎన్‌బీకే,బాలకృష్ణ కొమరం భీమ్,ఎన్టీఆర్ కొమరం భీమ్,ఆర్ఆర్ఆర్‌లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్,పరమవీరచక్రలో కొమరం భీమ్‌గా బాలకృష్ణ,బాలయ్య కొమరం భీమ్‌గా పరమవీరచక్ర
  కొమరం భీమ్‌గా బాలకృష్ణ,ఎన్టీఆర్ (File/Photos)

  అందుకే ఈ సినిమాలో బాలయ్య కొమరం భీమ్ వేషం వేసాడనే విషయం చాలా మందికి అంతగా తెలియదు.  మొత్తంగా అప్పట్లో కొమరం భీమ్‌గా బాబాయి బాలయ్య అలరిస్తే.. ఇపుడు అబ్బాయి ఎన్టీఆర్ పూర్తిస్థాయిలో ఫిక్షనల్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ‘ఆర్ఆర్ఆర్’లో గొండు వీరుడు కొమరం భీమ్‌గా త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాడు.

  NBK NTR Balakrishna as Komaram Bhim before NTR in RRR Movie Here are the details,NBK,NTR,NBK NTR Komaram Bheem,RRR Jr NTR,Balakrishna Paramaveerachakra,balakrishna as komaram bheem in paramaveerachakra,jr ntr as komaram bheem in rrr movie,rrr rajamouli rodram ranam rudhiram jr ntr,jr ntr twitter,balakrishna movies,tollywood,telugu cinema,ఎన్టీఆర్,బాలకృష్ణ,ఎన్బీకే,ఎన్‌బీకే,బాలకృష్ణ కొమరం భీమ్,ఎన్టీఆర్ కొమరం భీమ్,ఆర్ఆర్ఆర్‌లో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్,పరమవీరచక్రలో కొమరం భీమ్‌గా బాలకృష్ణ,బాలయ్య కొమరం భీమ్‌గా పరమవీరచక్ర
  స్వాతంత్య్ర సమరయోధుడు కొమరం భీమ్‌గా బాబాయి, అబ్బాయి (File/Photo)

  వివాదాలను పక్కన పెడితే.. ‘రౌద్రం రణం రుధిరం’ సినిమాలో కొమరం భీమ్‌గా ఎన్టీఆర్ ఆహార్యం సరిగ్గా సరిపోయింది. ఈ చిత్రంలోని ట్రైలర్‌లో కొమరం భీమ్‌ను చూపించిన సన్నివేశాలపై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే.. బాబాయికి కలిసిరాని కొమరం భీమ్ పాత్ర అబ్బాయి ఎన్టీఆర్‌కు కలిసి వచ్చేలా ఉన్నాయి.

  Nayanthara - Anushka: అనుష్క టూ నయనతార.. ఆ తరహా పాత్రలో ఇరగదీసిన భామలు..

  మొత్తంగా సినిమా విడుదల వరకు రాజమౌళి ఆర్ఆర్ఆర్‌లో కొమరం భీమ్ పాత్రపై వస్తోన్న ఈ వివాదాలను ఇలాగే కొనసాగిస్తారా లేదా మధ్యలో దీనికి ముగింపు పలకుతాడా  అనేది తెలియాలంటే ఈ సినిమా విడుదల వరకు వెయిట్ చేయాల్సిందే.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Akhanda, Balakrishna, Jr ntr, NBK, Roudram Ranam Rudhiram, RRR, Tollywood

  ఉత్తమ కథలు