హోమ్ /వార్తలు /సినిమా /

NBK Nartanasala Trailer: బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే..

NBK Nartanasala Trailer: బాలకృష్ణ ‘నర్తనశాల’ ట్రైలర్ విడుదల.. ఎలా ఉందంటే..

NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)

NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)

NBK Nartanasala Trailer | నందమూరి నట సింహం బాలకృష్ణ ..అత్యంత ఇష్టమైన చిత్రాల్లో వాళ్ల నాన్న ఎన్టీఆర్ నటించిన ‘నర్తనశాల’ సినిమా  ఒకటి. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన వివిధ పోస్టర్స్ రిలీజ్ చేసిన బాలయ్య.. తాజాగా శ్రేయాస్ ఏటీటీలో ఈ సినిమాను ట్రైలర్‌ను విడుదల చేసారు.

ఇంకా చదవండి ...

  NBK Nartanasala Trailer | నందమూరి నట సింహం బాలకృష్ణ ..అత్యంత ఇష్టమైన చిత్రాల్లో వాళ్ల నాన్న ఎన్టీఆర్ నటించిన ‘నర్తనశాల’ సినిమా  ఒకటి. ఈ సినిమాను ఎంతో ఇష్టంగా తన స్వీయ దర్శకత్వంలో 17 యేళ్ల క్రితం దివంగత నటి సౌందర్యమ ద్రౌపదిగా, శ్రీహరి భీముడిగా ‘నర్తనశాల’ సినిమాను ఎంతో అట్టహాసంగా రామోజీ ఫిలిం సిటీలో వేసిన పర్ణశాల సెట్‌లో 2004 మార్చి 1న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో భారీ క్యాస్టింగ్ కూడా ఉంది. తాజాగా ఈ సినిమాలో బాలయ్య అర్జునుడిగా, శ్రీహరి భీముడిగా..  ద్రౌపదిగా సౌందర్య పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. ఈ లుక్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేసారు. 57 సెకన్ల ఉన్నట్రైలర్‌ ను  పాండవుల అజ్ఞాతవాసం ఎలాంటి ఆటంకం లేకుండా పూర్తి కావాలని మునులు ఆశీర్వచనం ఇస్తారు. ఈ సందర్భంగా అర్జునుడు మాట్లాడుతూ.. తనకు ఊర్వశి ఇచ్చిన శాపం నా పాలిట వరం అయినది. మన దాయాదులు ఎంత మంది వేగులను పంపినను వాళ్ల పాచికలు పారవు. ఎత్తుగడలు సాగవు అంటూ ఈ ట్రైలర్‌లో ఉంది. చివరగా ఋషులను ఉద్దేశిస్తూ.. ద్రౌపది సమేత పాండుకుమారుల తరుపున ఇదే నమస: సుమాంజలిలు అంటూ ముగించారు.

  ఈ ట్రైలర్‌లో ద్రౌపది పాత్రకు డబ్బింగ్ కుదిరినా.. శ్రీహరి పాత్రకు డబ్బింగ్ అంతగా కుదరలేదు. ప్రస్తుతం ఈ సినిమాలో ముఖ్యపాత్రలు పోషించిన సౌందర్య, శ్రీహరి వీళ్లిద్దరు ఇపుడు లేరు. మొత్తంగా విరాటరాజ కొలువులో అజ్ఞాతవాసం చేయబోయే పాండవులు మునుల ఆశీర్వాదం తీసుకోవడం.. ఊర్వశి శాపం ఈ ట్రైలర్‌లో ప్రస్తావించారు. . కేవలం 17 నిమిషాల సన్నివేశాలను శ్రేయాస్ ఈటీలో అక్టోబర్ 24న ఉదయం 11.49 నిమిషాలకు  విడుదల చేయబోతున్నారు బాలయ్య. మొత్తంగా ఎన్నాళ్లో వేచిన ఉదయం అన్నట్టు బాలయ్య దర్శకత్వ ప్రతిభ చూాడాలనుకునే వారు... ఈ సినిమాను ఎంచక్కా NBK థియేటర్, శ్రేయాస్ ఏటీటీ ద్వారా చూడొచ్చన్న మాట.

  NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)
  NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)

  ‘నర్తనశాల’ చిత్రంలో బాలయ్యఅర్జునుడు, కృష్ణుడు బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయాలనుకున్నాడు. ఇక భీముడిగా శ్రీహరి, ధర్మరాజుగా శరత్‌బాబు, దుర్యోధనుడిగా సాయికుమార్, అభిమన్యుడిగా ఉదయ్ కిరణ్‌, నకుల సహదేవులుగా నవీన్‌, వినయ్ నటిస్తున్న ఆ సినిమాకు సంబంధించి కొన్ని సన్నివేశాలు అప్పట్లో పిక్చరైజ్ చేసాడు బాలకృష్ణ. దాని నిడివి దాదాపు 17 నిమిషాలు ఉంటుంది. అయితే ఎప్రిల్ 17, 2004న ఓ రాజకీయ కార్యక్రమంలో పాల్గొనేందుకు బెంగళూరు నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరిన సౌందర్య ప్రమాదానికి గురై చనిపోయింది. అందులో ఆమె సోదరుడు అమర్‌నాథ్‌ కూడా సజీవ దహనమయ్యాడు. దీంతో నర్తనశాలలో ద్రౌపది పాత్రలో సౌందర్యను కాక వేరే నటిని ఊహించుకోవడానికి ఇష్టపడని బాలయ్య.. ఈ సినిమాను ఆపేసారు. మధ్యలో  ద్రౌపది పాత్రలో గ్రేసీ సింగ్‌‌ను అనుకున్నారు. ఆ తర్వాత నయనతారతో  ఈ చిత్రాన్ని  కంప్లీట్ చేయాలనుకున్నారు. కానీ ఎందుకో బాలయ్య మనసు ఒప్పుకోలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్‌కు బాలయ్య ప్యాకప్ చెప్పేసాడు. మొత్తంగా అపుడు ప్యాకప్ చెప్పిన ఈ సినిమాకు సంబంధించిన కొన్ని సన్నివేశాలను దసరా కానుకగా ఏటీటీలో విడుదల కానుంది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Balayya, NBK Nartanasala, Tollywood

  ఉత్తమ కథలు