హోమ్ /వార్తలు /సినిమా /

NBK Naratanasala: నర్తనశాల సినిమా గురించి సంచలన నిజాలు బయటపెట్టిన బాలయ్య..

NBK Naratanasala: నర్తనశాల సినిమా గురించి సంచలన నిజాలు బయటపెట్టిన బాలయ్య..

బాలకృష్ణ (File Photo)

బాలకృష్ణ (File Photo)

NBK Naratanasala | నందమూరి నట సింహం బాలకృష్ణ .. తన దర్శకత్వంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ‘నర్తనశాల’ సినిమా గురించి ఓ మీడియాకు ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన నిజాలు బయటపెట్టాడు బాలయ్య.

  NBK Naratanasala | నందమూరి నట సింహం బాలకృష్ణ .. తన దర్శకత్వంలో ఎంతో అట్టహాసంగా ప్రారంభించిన ‘నర్తనశాల’ సినిమా గురించి ABN ఆంధ్రజ్యోతికి ఇచ్చిన ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన నిజాలు బయటపెట్టాడు.ఇక బాలయ్యకు అత్యంత ఇష్టమైన చిత్రాల్లో వాళ్ల నాన్న ఎన్టీఆర్ నటించిన ‘నర్తనశాల’ సినిమా  ఒకటి. ఈ సినిమాను బాలకృష్ణ ఎంతో ఇష్టంగా తన స్వీయ దర్శకత్వంలో 17 యేళ్ల క్రితం దివంగత నటి సౌందర్యమ ద్రౌపదిగా, శ్రీహరి భీముడిగా ‘నర్తనశాల’ సినిమాను ఎంతో అట్టహాసంగా రామోజీ ఫిలిం సిటీలో వేసిన పర్ణశాల సెట్‌లో 2004 మార్చి 1న ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇందులో భారీ క్యాస్టింగ్ కూడా ఉంది. తాజాగా ఈ సినిమాలో బాలయ్య అర్జునుడిగా, శ్రీహరి భీముడిగా..  ద్రౌపదిగా సౌందర్య పాత్రలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను విడుదల చేసారు. దాంతో పాటు ట్రైలర్‌ను కూడా విడుదల చేసారు. ఈ సినిమాను దసరా కానుకగా అక్టోబర్ 24న మధ్యాహ్నం 11.49 నిమిషాలకు విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ABN‌తో బాలయ్య పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

  ఈ సినిమాతో దివికేగిన సౌందర్య, శ్రీహరి వంటి నటులను మళ్లీ భువికి రప్పించడం జరిగిందన్నారు. ఈ సినిమా పూర్తి చేయానుకున్నాను. కానీ తానొకటి తలిస్తే.. దైవం ఇంకొటి తలుస్తుందన్నట్టు ఈ సినిమా విషయంలో జరిగిందన్నారు. మొత్తంగా మనం చేసింది ఏది మరుగున పడకూడదు. అలా నాకు ఆలోచన వచ్చిందే తడువుగా నేను డైరెక్ట్ చేసిన 17 నిమిషాల నిడివి ఉన్న సన్నివేశాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకున్నాను. అలా నర్తనశాలను ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నట్టు తెలిపారు. ఇక ఈ సినిమాను ప్రారంభించిన తర్వాత ఆయా నటీనటులకు సంబంధించిన 10 రోజలు కాల్షీట్స్ తీసుకున్నాను. కానీ 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసినట్టు చెప్పారు. అందులో 17 నిమిషాలకు సంబంధించిన 2 సన్నివేశాలను పూర్తి చేసినట్టు తెలిపారు.

  NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)
  NBK నర్తనశాల పోస్టర్స్ (NBK Nartanasala posters)

  ఇక విరాట పర్వం విషయానికొస్తే.. ఇందులో  అభిమన్యుడు, ఉత్తరల రొమాన్స్,  అర్జునుడి పరాక్రమంతో పాటు నవరసాలున్నాయన్నారు. ఈ  చిత్రంలో బాలయ్య.. అర్జునుడు, శ్రీకృష్ణుడు, కీచకుడు పాత్రల్లో నటించాలకున్నాడు. నాన్న గారి నుంచి నేను నేర్చుకున్నది కళాకారులకు గౌరవం ఇవ్వడం పని చేస్తున్నట్టు అందరూ అందులో ఇన్వాల్వ్ అవ్వడం నాన్నగారి నుంచే నేర్చుకున్నట్టు తెలిపారు. ముందు ముందు నర్తనశాలను సినిమాను పూర్తి చేస్తానేమో అంటూ చెప్పడం కొసమెరుపు.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, NBK Nartanasala, Tollywood

  ఉత్తమ కథలు