హోమ్ /వార్తలు /సినిమా /

NBK: దర్శకుడికి బాలకృష్ణ షరతు... అలా అయితేనే షూటింగ్‌కి వస్తా.. అంటూ అల్టిమేటం..

NBK: దర్శకుడికి బాలకృష్ణ షరతు... అలా అయితేనే షూటింగ్‌కి వస్తా.. అంటూ అల్టిమేటం..

‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ లో బాలకృష్ణ (Twitter/Photo)

‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ లో బాలకృష్ణ (Twitter/Photo)

NBK | నందమూరి బాలకృష్ణ నటించిన 'రౌడీ ఇన్స్పెక్టర్' తెలుగులో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అన్న విషయం తెలిసిందే. ఖాకీ డ్రెస్సులో బాలయ్య పెర్‌ఫార్మెన్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆరోజుల్లో మాస్‌ను ఓ ఊపు ఊపేసింది ఈ సినిమా.

    NBK: నందమూరి బాలకృష్ణ నటించిన 'రౌడీ ఇన్స్పెక్టర్' తెలుగులో ఓ ట్రెండ్‌ సెట్టర్‌ అన్న విషయం తెలిసిందే. ఖాకీ డ్రెస్సులో బాలయ్య పెర్‌ఫార్మెన్స్‌ చూసి ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. ఆ రోజుల్లో  మాస్‌ను ఓ ఊపు ఊపేసింది ఈ సినిమా. బాలకృష్ణ హీరోగా విజయశాంతి హీరోయిన్‌గా బి.గోపాల్ దర్శకత్వంలో విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ పతాకంపై టి.త్రివిక్రమ రావు నిర్మించిన ఈ సినిమా విడుదలై నేటితో  29 యేళ్లు పూర్తి చేసుకుంది.ఈ సినిమా బాలయ్య కెరీర్‌లోనే కాదు.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్‌లో ఒకటిగా నిలిచింది. అంతేకాదు పోలీస్ ఆఫీసర్ సినిమాల్లో ఈ మూవీ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. అంతేకాదు ఆ సినిమా అప్పట్లో బద్దలు కొట్టిన రికార్డులు అన్నీ ఇన్నీ కావు. అయితే ఈ సినిమా కోసం బాలకృష్ణ ప్రాణం పెట్టాడట. నిజ జీవితంలో పోలీసులు ఎలా నడుస్తారు.. ఎలా లాఠీ పట్టుకుంటారు... జీపులో ఎలా కూర్చుంటారు లాంటి విషయాలపై పూర్తి అవగాహన రావాడానికి చాలా హోమ్ వర్కే చేసారట బాలయ్య.

    అంతేకాదు ఈ సినిమా చిత్రీకరణ సమయలో డైరెక్టర్ బి. గోపాల్ ను కూడా ఇబ్బంది పెట్టాడట బాలయ్య. అదేంటి బాలయ్య దర్శకుడిని ఇబ్బంది పెట్టడమా.. అనుకుంటున్నారా ఆ కండిషన్ వింటే మీకు కూడా బాలకృష్ణకు నటన మీద ఉన్న ప్యాషన్‌ ఏంటో అర్ధం అవుతుంది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలో డైరెక్టర్ గోపాల్‌కు ఓ రోజు ఉదయం బాలయ్య ఫోన్‌ చేసి ఈ రోజు నేను చిత్రీకరణకు రావడం లేదన్నారు. ఏమైంది బాబూ అనడిగితే.. సినిమాలో నేను వాడుతున్న జీపును పంపిస్తే అందులోనే షూటింగ్‌కి వస్తా అని.. అప్పుడే ఆ పాత్రలో లీనమవ్వగలను అని దర్శకునితో చెప్పారట బాలయ్య.

    రౌడీ ఇన్‌స్పెక్టర్ పోస్టర్ Photo : Youtube
    రౌడీ ఇన్‌స్పెక్టర్ పోస్టర్ Photo : Youtube

    దీంతో గోపాల్, బాలయ్య అడిగిన విదంగానే జీపు పంపించారట. దీంతో ఎప్పుడూ ఏసీ కారులో వచ్చే బాలయ్య..  ఆ రోజు నుంచి... పోలీసు జీపులో అచ్చం పోలీసులా కాలు బయట పెట్టి.. లాఠీ తిప్పుతూ వచ్చేవారట. బాలయ్యకు సినిమా అంటే అంత ప్యాషన్‌..అంటూ ఓ సందర్బంగా బాలయ్య కు నటనపై గల ప్యాషన్‌ను  పలు ఇంటర్వ్యూల్లో గుర్తుచేసుకుంటూనే ఉన్నారు దర్శకులు బి.గోపాల్.

    ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’గా బాలకృష్ణ (Twitter/Photo)

    అప్పటి వరకు సినిమాల్లో పోలీస్ పాత్రలు నీతి, నిజాయితీలకు మారు పేరుగా ఉండేవి. ఈ సినిమాలో అన్యాయాన్ని అంతమొందించడానికి పోలీస్ రౌడీలాగా ప్రవర్తించక తప్పదు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు.హీరోగా బాలకృష్ణ 57వ మూవీ. అంతేకాదు బాలయ్య, దర్శకుడు బి.గోపాల్ కలయికలో వచ్చిన రెండో చిత్రం. అంతకు ముందు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో ‘లారీ డ్రైవర్’, సినిమా వచ్చింది. ఆ తర్వాత సమర సింహా రెడ్డి, నరసింహనాయుడు, పల్నాటి నరసింహనాయుడు సినిమాలు వచ్చాయి.అందులో ‘లారీ డ్రైవర్’, ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ బ్లాక్ బస్టర్స్‌గా నిలిచాయి. ‘సమరసింహా రెడ్డి’, ‘నరసింహనాయుడు’ సినిమాలు ఇండస్ట్రీ హిట్స్‌గా నిలిచాయి.

    దర్శకుడు బి.గోపాల్‌తో బాలయ్య, విజయశాంతి, హరీష్ (Twitter/Photo)

    చివరగా వచ్చిన ‘పలనాటి బ్రహ్మనాయుడు’ సినిమా మాత్రం డిజాస్టర్‌గా నిలిచింది. బాలకృష్ణ, విజయశాంతి కాంబినేషన్‌లో వచ్చిన 16వ చిత్రం. ఈ సినిమా తర్వాత చివరగా వీళ్లిద్దరు ‘నిప్పురవ్వ’ సినిమాలో జోడిగా నటించారు. దాదాపు వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రాలు 90 శాతం సక్సెస్ సాధించాయి. 1992 మే7న వచ్చిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా రికార్డులు తిరగరాసింది. విజయలక్ష్మీ ఆర్ట్ మూవీస్ బ్యానర్‌పై టి త్రివిక్రమరావు నిర్మించిన ఈ సినిమా సంచలన వసూళ్లు సాధించింది. ఆ రోజుల్లోనే 35 సెంటర్లలో 100 రోజులు ఆడింది. విజయశాంతి ఈ చిత్రంలో ఆటో రాణి పాత్రలో రప్ఫాడించింది. తమిళ్‌లో ఈ సినిమాను అదే పేరుతో అనువదించారు. అక్కడ కూడా ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. అంతేకాదు డబ్బింగ్ సినిమాల్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది.

    NBK Balakrishna Vijayashanti Rowdy Inspector Movie Completed 29 Years Director B Gopal Balayya Creats Wonder At Box office.NBK Rowdy Inspector@29Years: బాలకృష్ణ బ్లాక్ బస్టర్ ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’@29.. సాధించిన రికార్డులు..
    బాలకృష్ణ ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’@29 ఇయర్స్ (Twitter/Photo)

    ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ సినిమాకు బప్పిలహరి సంగీతం అందించారు. బాలయ్య, బప్పిలహరి కాంబినేషన్‌లో వచ్చిన తొలి సినిమా ఇది. ఆ తర్వాత ఈయన ‘నిప్పరవ్వ’ సినిమాకు సంగీతం అందించారు. ఈ సినిమాలో అన్ని పాటలు బాలయ్య, విజయశాంతిలపై డ్యూయట్స్ కావడం విశేషం.  అన్ని పాటలను బాలు, చిత్ర పాడటం విశేషం. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ హిందీలో అదే టైటిల్‌తో డబ్ చేస్తే.. అక్కడ కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసింది. అప్పటి వరకు హిందీ డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా ముంబైలో రికార్డు క్రియేట్ చేసింది.

    ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’లో బాలకృష్ణ,విజయశాంతి (Twitter/Photo)

    ఈ చిత్రంలో బాలకృష్ణ ఇన్‌స్పెక్టర్ రామరాజు పాత్రలో నటిస్తే.. విజయశాంతి ‘ఆటో రాణిగా మెప్పించారు. ఇక బొబ్బర్ లంక రామబ్రహ్మంగా మోహన్ రాజ్ తనదైన విలనిజం పండించారు.  ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ సినిమాకు ఆంజనేయ పుష్పానంద్ కథను అందిస్తే.. పరుచూరి బ్రదర్స్.. కథ సహాకారం, స్క్రీన్ ప్లే, మాటలు అందించారు. కోటగిరి వేంకటేశ్వరరావు ఎడిటర్‌గా పనిచేసారు. వి.యస్.ఆర్.స్వామి కెమెరామెన్‌గా పనిచేసారు. మొత్తంగా అన్న ఎన్టీఆర్ ‘నిప్పులాంటి మనిషి’,  రాజశేఖర్ ‘అంకుశం’ తర్వాత తెలుగులో పోలీస్ బ్యాక్ డ్రాప్ చిత్రాల్లో బాలకృష్ణ. ‘రౌడీ ఇన్‌స్పెక్టర్’ కూడా ఓ కొత్త  ట్రెండ్  క్రియేట్ చేసింది. ఆ రోజుల్లోనే  ఈ చిత్రం  35 సెంటర్లలో 100 రోజులు ఆడింది.

    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: B.Gopal, Balakrishna, Balayya, NBK, Tollywood, Vijayashanti

    ఉత్తమ కథలు