హోమ్ /వార్తలు /సినిమా /

NBK: బాలయ్య పెద్ద మనసు.. చితికిపోయిన నిర్మాతను ఆ విధంగా ఆదుకుంటున్న బాలకృష్ణ..

NBK: బాలయ్య పెద్ద మనసు.. చితికిపోయిన నిర్మాతను ఆ విధంగా ఆదుకుంటున్న బాలకృష్ణ..

Balakrishna Nandamuri: నందమూరి నట సింహా బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తనతో గతంలో ‘మహారథి’ సినిమా తీసి అప్పుల పాలైన నిర్మాత వాకాడా అప్పారావుకు నిర్మాత మరో ఛాన్స్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Balakrishna Nandamuri: నందమూరి నట సింహా బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తనతో గతంలో ‘మహారథి’ సినిమా తీసి అప్పుల పాలైన నిర్మాత వాకాడా అప్పారావుకు నిర్మాత మరో ఛాన్స్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

Balakrishna Nandamuri: నందమూరి నట సింహా బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తనతో గతంలో ‘మహారథి’ సినిమా తీసి అప్పుల పాలైన నిర్మాత వాకాడా అప్పారావుకు నిర్మాత మరో ఛాన్స్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి.

  Balakrishna Nandamuri: నందమూరి నట సింహా బాలకృష్ణ మరోసారి తన పెద్ద మనసు చాటుకున్నారు. తనతో గతంలో ‘మహారథి’ సినిమా తీసి అప్పుల పాలైన నిర్మాత వాకాడా అప్పారావుకు నిర్మాత మరో ఛాన్స్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. అంతేకాదు బాలయ్యతో తీసిన ‘మహారథి’ సినిమా డిజాస్టర్‌తో ఇప్పటికే అప్పులకు  ఇప్పటికీ వడ్డీలు కడుతున్నట్టు ఓ ఇంటర్వ్యూలో వాకాడా అప్పారావు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. బాలకృష్ణ కెరీర్‌లోనే ఎన్నో బ్లాక్ బస్టర్ మూవీలున్నాయి. అలానే ఎన్నో అంచనాలతో విడుదలై డిజాస్టర్స్ అయిన సినిమాలు కూడా ఉన్నాయి. ఒక్క బాలయ్య కెరీర్‌లోనే కాదు ప్రతి హీరో కెరీర్‌లో హిట్స్, ఫ్లాప్స్ అనేవి వెరీ కామన్. హీరోలకు వరుసగా రెండు మూడు ఫ్లాప్స్ వచ్చినా.. పెద్దగా ఇబ్బంది ఉండదు. ఒక్క హిట్‌తో అంతా కవర్ అయిపోతుంది. కానీ నిర్మాతల పరిస్థితి అలా ఉండదు. అప్పటి వరకు వరసగా బ్లాక్ బస్టర్స్ తీసిన నిర్మాతలు ఒక్క ఫ్లాప్‌తో జాతకం తలకిందులై రోడ్డు మీదికి వచ్చిన వాళ్లు ఇండస్ట్రీలో ఎంతో మంది ఉన్నారు.

  బాలయ్యతో ’మహరథి’ సినిమాను నిర్మించిన వాకాడా అప్పారావు (File/Photos)

  బాలకృష్ణతో అపుడెపుడో 13 ఏళ్ల క్రితం తెరకెక్కించిన మహారథి సినిమా దెబ్బతో వాకాడా అప్పారావు అనే నిర్మాత కూడా ఇప్పటికీ కోలుకోలేక పోయినట్టు రీసెంట్‌గా ఓ యూట్యూబ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. అప్పట్లో వాకాడా అప్పారావు చంద్రముఖి ఫేమ్ పి.వాసు దర్శకత్వంలో బాలకృష్ణతో భారీ సినిమాను అనౌన్స్ చేసాడు. అప్పట్లో  ‘చంద్రముఖి’ సినిమా  సౌత్ ఇండస్ట్రీలో అతి పెద్ద హిట్.  ఆయన దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా పి.వాసు డైరెక్షన్‌లో ‘మహారథి’ సినిమా అనగానే ఆటోమేటిగ్‌గా అంచనాలు పెరిగాయి. పి.వాసు.. బాలకృష్ణ సోలో హీరోగా నటించిన ‘సాహసమే జీవితం’ సినిమాను వేరే  దర్శకుడుతో భారతీతో కలిసి వాసు డైరెక్ట్ చేసారు.

  బాలయ్యతో ’మహరథి’ సినిమాను నిర్మించిన వాకాడా అప్పారావు (File/Photos)

  అప్పట్లో వీళ్లు భారతీ వాసు పేరుతో  సినిమాలను తెరకెక్కించే వారు. ఇక వాకాడా అప్పారావు విషయానికొస్తే.. అప్పటి వరకు ఈయన సూపర్ గుడ్ ఫిల్మ్స్ తెలుగు సినిమాలకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించేవారు. అంతకు ముందు కొన్ని సినిమాలను తీసిన అనుభవం కూడా ఉంది. సూపర్ గుడ్ ఫిల్మ్స్‌ తెలుగులో నిర్మించే సినిమాలకు అన్నీ తానై వ్యవరించేవారు వాకాడా అప్పారావు.

  బాలయ్యతో ’మహరథి’ సినిమాను నిర్మించిన వాకాడా అప్పారావు (File/Photos)

  ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా ఎంతో అనుభవం ఉన్న వాకాడా.. నిర్మాత తోటపల్లి మధు, దర్శకుడు పి.వాసుతో కలిసి ‘మహారథి’ సినిమాను తెరకెక్కించాడు. మధ్యలో పైనాన్షియర్స్ చేతులు ఎత్తేయడంతో వేరే వాళ్ల దగ్గర రూ. 10 లక్షల అప్పు తెచ్చి మరి ఈ సినిమాను పూర్తి చేసాడట. ఈ సినిమాలో బాలకృష్ణ సరసన స్నేహ, మీరా జాస్మిన్, నవనీత్ కౌర్ హీరోయిన్స్‌గా నటించారు. సీనియర్ హీరోయిన్ జయప్రద హీరో అత్త పాత్రలో నటించింది.

  మహారథి మూవీ (File/Photo)

  ఆ తర్వాత ఓ మధ్యవర్తి ద్వారా బ్యాంక్‌లో రూ. 4 కోట్లు లోన్ తీసుకొని ఈ  సినిమాను రిలీజ్ చేసాడు. అప్పట్లో ఈ సినిమాను 2007 సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయానుకున్నారు. అప్పటికే సంక్రాంతి బరిలో ప్రభాస్ యోగి, అల్లు అర్జున్ దేశ ముదురు’ సినిమాలు రిలీజైయ్యాయి.   ఫైనాన్స్ ప్రాబ్లెమ్స్‌తో పొంగల్‌కు కాకుండా 2007 ఫిబ్రవరి 1న విడుదల చేయాల్సి వచ్చింది. ‘మహారథి’ సినిమా రిలీజైన తర్వాత  డిజాస్టర్‌గా టాక్ తెచ్చుకుంది.

  ‘మహారథి’ మూవీ (File/Photo)

  ఈ సినిమా ఫ్లాప్ కావడానికి కారణం.. సకాలంలో రిలీజ్ కాకపోవడం ఒకటైతే.. ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను పట్టించుకోకుండా ఫైనాన్సర్స్ చుట్టు తిరగడం వల్ల నిర్మాతగా కోలుకోలేని దెబ్బ తగిలిందన్నారు వాకాడా అప్పారావు. మొత్తానికి 13 ఏళ్ల క్రితం ‘మహారథి’ సినిమా కోసం చేసిన అప్పును ఇప్పటికీ కడుతూనే ఉన్నానంటూ తన బాధను వెల్లగక్కాడు. ఏమైనా  ఒక్క దెబ్బతో ఈయన జీవితం తలకిందులైంది. ఐతే.. నిర్మాత వాకాడా అప్పారావు విషయం తెలుసుకున్న బాలయ్య.. వెంటనే వాకాడా అప్పారావుతో మాట్లాడట. ఏదైనా మంచి దర్శకుడు, స్టోరీ రెడీ చేసుకుంటే.. సినిమా చేయడానికి రెడీ బాలయ్య ఆ నిర్మాతకు కబురు పంపాడట.

  బాలయ్యతో ’మహరథి’ సినిమాను నిర్మించిన వాకాడా అప్పారావు (File/Photos)

  దీంతో వాకాడా అప్పారావు మంచి స్టోరీ, దర్శకుడు వేటలో పడ్డాడు. గతంలో బాలయ్య కూడా తనతో ‘పరమవీరచక్ర’ సినిమా తీసి లాసైన కళ్యాణ్‌కు ‘జై సింహా’ ‘రూలర్’ సినిమాలు చేసిన సంగతి తెలిసిందే కదా. అంతకు ముందు తనతో చిత్రాలు తీసి లాసైన నిర్మాలతో బాలయ్య సినిమాల చేసిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు మరోసారి తనతో సినిమా తీసి లాసైన నిర్మాతకు ఆదుకోవడానికి బాలయ్య ముందుకు రావడంతో ఈ విషయాన్ని బాలయ్య అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

  First published:

  Tags: Balakrishna, Balayya, NBK, Tollywood

  ఉత్తమ కథలు