హోమ్ /వార్తలు /సినిమా /

Balakrishna - Nagarjuna: బాలకృష్ణ, నాగార్జున మల్టీస్టారర్ అందుకే పట్టాలెక్కలేదు..

Balakrishna - Nagarjuna: బాలకృష్ణ, నాగార్జున మల్టీస్టారర్ అందుకే పట్టాలెక్కలేదు..

బాలకృష్ణ,నాగార్జున (Twitter/Photo)

బాలకృష్ణ,నాగార్జున (Twitter/Photo)

Balakrishna - Nagarjuna | బాలకృష్ణ, నాగార్జున మల్టీస్టారర్  అందుకే వర్కౌట్ కాలేదు. దీంతో ఒకే స్క్రీన్ పై వీళ్లిద్దరిని చూడాలకున్న అభిమానుల ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు. వివరాల్లోకి వెళితే..

  Balakrishna - Nagarjuna | బాలకృష్ణ, నాగార్జున మల్టీస్టారర్  అందుకే వర్కౌట్ కాలేదు. ముందుగా వీళ్లిద్దరు అలనాటి ఎవర్ గ్రీన్ ఎన్టీఆర్, ఏఎన్నార్, సూర్యకాంతం, సావిత్రి, ఎస్వీఆర్, జమున ముఖ్యపాత్రల్లో నటించిన గుండమ్మ కథను ఇప్పటి ట్రెండ్‌కు తగ్గట్టు రీమేక్ చేయాలనకున్నారు. సూర్యకాంతం లాంటి బలమైన పాత్ర పోషించే నటి లేక ఆ ప్రాజెక్ట్ వర్కౌట్ కాలేదు. దీంతో ఒకే స్క్రీన్ పై వీళ్లిద్దరిని చూడాలకున్న అభిమానుల ఆశలు ఇప్పటికీ నెరవేరలేదు. ఇక తెలుగు తెర మొదటి తరం స్టార్ హీరోలైన నందమూరి తారక రామారావు, అక్కినేని నాగేశ్వరరావు వాళ్ల సినీ  కెరీర్‌లో 14 సినిమాల్లో కలిసి నటించారు. తొలిసారి వీళ్లిద్దరు ‘పల్లెటూరు పిల్ల’ సినిమాలో కలిసి నటించారు. చివరగా ‘సత్యం శివం’ సినిమాలో నటించారు. ప్రపంచ సినీ చరిత్రలో ఇద్దరు అగ్ర హీరోలు ఇన్ని సినిమాల్లో కలిసి నటించలేదు.

  ఆ తర్వాత ఎన్టీఆర్ నట వారసుడిగా బాలకృష్ణ, అక్కినేని నటవారసుడిగా నాగార్జున సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి తండ్రి తగ్గ తనయులుగా తమ కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక వీళ్లిద్దరు కలిసి ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కలిసి నటించలేదు. కానీ వీళ్లిద్దరు కలిసి ఎన్టీఆర్, ఏఎన్నార్‌ కలిసి నటించిన ‘గుండమ్మ కథ’ను రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ ఆ తర్వాత అది వర్కౌట్ కాలేదు. ఆ తర్వాత అక్కినేని, నందమూరి మూడో తరం వారసులు ఎన్టీఆర్, నాగ చైతన్య గుండమ్మ కథ సినిమాను భవిష్యత్తులో చేస్తారమే చూడాలి.

  Nagarjuna Afraid Of ANR Biopic Due to Disaster Of Balakrishna's NTR Kathanayakudu, నాగార్జునకు బాలకృష్ణ భయం పట్టుకుందా..Nagarjuna, Balakrishna, Nagarjuna Balakrishna, Nagarjuna Balakrishna NTR Kathanyakudu, Nagarjuna ANR Bipic balakrishna NTR Biopic,Nagarjuna Afraid Of ANR Biopic Due to Disaster Of Balakrishna NTR Kathanayakudu, బాలకృష్ణ, నాగార్జున, నాగార్జున బాలకృష్ణ, బాలకృష్ణ నాగార్జున, నాగ్ బాలయ్య, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు నాగార్జున అక్కినేని బయోపిక్, నాగార్జున ఏఎన్నాఆర్ బయోపిక్ బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్
  ఎన్టీఆర్, ఏఎన్నాఆర్

  ఒక బాలయ్య, నాగ్‌లు గతంలో ఓ సినిమాలో కలిసి యాక్ట్ చేయాలనకున్నారు. అది కూడా హిందీలో హిట్టైయిన ‘చుప్కే చుప్కే’ సినిమా చేయాలనకున్నారు. అంతేకాదు అందకు సంబంధించిన సీడీని అప్పట్లో బాలయ్య నాగార్జునకు కూడా ఇచ్చాడు. ఈ విషయాన్ని నాగార్జున ఓ ఇంటర్వ్యూలో కూడా ప్రస్తావించారు. ఆ సినిమా చూసిన నాగార్జున ఎంతో ఇంప్రెస్ అయ్యారు కూడా. అంతేకాదు ఆ సినిమాకు సంబంధించిన వర్క్ కూడా బాలయ్య చేయించాడట.  కానీ ఆ తర్వాత ఏమైందో ఏమో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఇక ‘చుప్కే చుప్కే’ సినిమా విషయానికొస్తే.. ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర హీరోలుగా నటించారు. హృషికేష్ ముఖర్జీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ సాధించింది. ఈ రకంగా వెండితెరపై బాలకృష్ణ, నాగార్జున కాంబినేషన్ రాలేకపోయింది.

  nagarjuna afraid of balakrishna movie here are the details,Nagarjuna,Balakrishna nandamuri,anr,ntr,balayya,nbk,Nagarjuna Balakrishna,Nagarjuna Balakrishna NTR Kathanyakudu,Nagarjuna ANR Bipic balakrishna NTR Biopic,Nagarjuna Afraid Of ANR Biopic Due to Disaster Of Balakrishna NTR Kathanayakudu,బాలకృష్ణ,నాగార్జున,నాగార్జున బాలకృష్ణ,బాలకృష్ణ నాగార్జున, నాగ్ బాలయ్య, బాలకృష్ణ ఎన్టీఆర్ కథానాయకుడు నాగార్జున అక్కినేని బయోపిక్, నాగార్జున ఏఎన్నాఆర్ బయోపిక్ బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్
  బాలకృష్ణ,నాగార్జున (Facebook/Photo)

  ఇక నాగార్జునతో సినిమా చేయలేకపోయిన బాలయ్య.. ఆయన తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ‘భార్య భర్తల బంధం, గాండీవం, శ్రీరామరాజ్యం’ వంటి మూడు సినిమాల్లో కలిసి నటించారు. అటు సుమంత్‌తో ‘ఎన్టీఆర్’ బయోపిక్‌లో నటించారు. అటు నాగార్జున కూడా నందమూరి హరికృష్ణతో ‘సీతారామరాజు’ సినిమా చేసారు. ఈ రకంగా వీళ్లిద్దరు కలిసి నటించకపోయినా.. ఆయా ఫ్యామిలీ హీరోలతో వీళ్లు నటించడం విశేషం.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Nagarjuna Akkineni, Telugu Cinema, Tollywood

  ఉత్తమ కథలు