హోమ్ /వార్తలు /సినిమా /

Mohanlal - Rajinikanth -NBK: మోహన్ లాల్‌‌, రజినీకాంత్‌లతో .. బాలకృష్ణ విజయశాంతి అపురూప చిత్రం..

Mohanlal - Rajinikanth -NBK: మోహన్ లాల్‌‌, రజినీకాంత్‌లతో .. బాలకృష్ణ విజయశాంతి అపురూప చిత్రం..

Mohanlal - Rajinikanth -NBK | ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. తాజాగా బాలయ్య, రజినీ, మోహన్‌లాల్‌ను విజయశాంతి సత్కరించిన ఓ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

    NBK-Rajinikanth-Mohanlal: ప్రస్తుతం సోషల్ మీడియాలో త్రో బ్యాక్ పిక్ ట్రెండ్ నడుస్తోంది. ఎవరైన తమకు సంబంధించిన స్పెషల్ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి. దానికి త్రోబ్యాక్ పిక్ అనే క్యాప్షన్ ఇవ్వాలి. అంతేకాదు పోస్ట్ చేసే ఫోటోలో ఏదైనా స్పెషాలిటీ ఉండాలి. ఈ రోజు మోహన్‌లాల్ పుట్టినరోజు సందర్భంగా బాలయ్య ఫ్యాన్స్.. మోహన్‌లాల్, రజినీకాంత్‌లతో కలసి ఉన్న బాలకృష్ణ త్రో బ్యాక్ పిక్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.  ఏదో సందర్భంగా విజయశాంతి ఈ ముగ్గురు హీరోలను సత్కరించినట్టు ఈ ఫోటో ఉంది. ఈ ముగ్గురు హీరోల మెడల్లో పెద్ద పూల దండలున్నాయి. కానీ విజయశాంతికి మాత్రం లేదు. అంటే విజయశాంతి ఏదో సందర్బంగా బాలయ్య, రజినీ, మోహన్‌లాల్‌ను పిలిచి ఈ ముగ్గురిని సత్కరించినట్టు ఉంది ఈ ఫోటో.  కానీ ఈ అపురూపమైన ఈ ఫోటో బాలయ్య, విజయశాంతి హీరో హీరోయిన్లుగా నటించిన ‘నిప్పురవ్వ’ సినిమా ప్రారంభోత్సవం సందర్బంగా తీసినది. ఈ సినిమా ఓపెనింగ్‌కు రజినీకాంత్, మోహన్ లాల్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. నిప్పురవ్వ విషయానికొస్తే.. ఈ చిత్రం బాలయ్య, విజయశాంతి హీరో, హీరోయిన్లుగా నటించి చివరి చిత్రం. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన విజయాన్ని సాధించలేదు.

    మరోవైపు విజయశాంతి తమిళంలో రజినీకాంత్‌తో, మలయాళంలో మోహన్‌లాల్‌తో పలు సూపర్ హిట్ చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రాజకీయాల్లో బిజీగ ఉన్న విజయశాంతి.. గతేడాది మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటిగా రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. ఈ మధ్యనే తనకు రాజకీయ జన్మనిచ్చిన బీజేపీలో రీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే కదా. మరోవైపు బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇక రజినీకాంత్.. శివ దర్శకత్వంలో ‘అన్నాత్తే’ మూవీలో తన పార్ట్‌కు సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసారు. ఇంకోవైపు మోహన్‌లాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.

    First published:

    Tags: Balakrishna, Kollywood, Malluwood, Mohanlal, NBK, Rajinikanth, Tollywood, Vijayashanthi

    ఉత్తమ కథలు