Home /News /movies /

NBK GOPICHAND MALINENI MYTHRI MOVIE MAKERS OFFICIALLY CLARIFIES ABOUT BALAKRISHNA GOPICHAND MALINENI TITLE TA

NBK : బాలకృష్ణ , గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ పై మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ..

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (File/Photo)

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (File/Photo)

NBK - Gopichand Malineni : బాలకృష్ణ , గోపీచంద్ మలినేని సినిమా టైటిల్ పై మైత్రీ మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమా కోసం..

    Balakrishna Nandamuri  : నందమూరి బాలకృష్ణ (Balakrishna), ప్రస్తుతం.. బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో ‘అఖండ’ మూవీ చేస్తున్నారు. ఇప్పటికే టాకీ పార్ట్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని దీపావళి కానుగా విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. హీరోగా బాలకృష్ణకు ‘అఖండ’ 106వ చిత్రం. ఈ  సినిమా తర్వాత బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (Gopichand Malineni) దర్శకత్వంలో 107వ చిత్రం చేయనున్నారు.ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇక నందమూరి అందగాడు నట సింహా బాలకృష్ణ సినిమా అంటేనే పవర్‌ఫుల్ టైటిల్ ఉండాల్సిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు కూడా ఓ పవర్‌ఫుల్ టైటిల్ అనుకుంటున్నారు. ఈ సినిమాకు ‘రౌడీయిజం’ (Rowdyism) అనే టైటిల్‌ను మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers)  రిజిస్టర్ చేయించినట్టు వార్తలు వచ్చాయి.

    తాజాగా ఈ సినిమాకు ‘రౌడీయిజం’ టైటిల్ పెడుతున్నట్టు వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదంటూ సోషల్ మీడియా వేదికగా మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటన విడుదల చేసారు. అంతేకాదు ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్‌డేట్ అయినా మేమే ప్రకటిస్తామంటూ ట్వీట్ చేసారు.



    ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ పలువురు హీరలతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. బాలకృష్ణ పుట్టినరోజు సంద ర్భంగా మైత్రీ మూవీ మేకర్స్  గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను గోపీచంద్ మలినేని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తనదైన శైలిలో యాక్షన్ ఓరియంటెడ్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.

    Tollywood Thatha Manavallu : ఎన్టీఆర్ టూ నాగ చైతన్య వయా అల్లు అర్జున్, రానా వరకు టాలీవుడ్‌లో సత్తా చూపెడుతోన్న మనవళ్లు..

    ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్‌ఫుల్ పోలీస్ పాత్ర  అని చెబుతున్నారు. మరోవైపు బాలకృష్ణ.. సాప్ట్‌వేర్ ఇంజినీర్ పాత్రలో కూడా కనిపించనున్నట్టు వార్తలు వస్తున్నాయి.

    Nagarjuna Akkineni - Amala : నాగార్జున అక్కినేని, అమల టాలీవుడ్ సూపర్ హిట్ రియల్ అండ్ రీల్ లైఫ్ జోడి..

    ఈ సినిమా బాలయ్య సరసన పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలనకు వచ్చినా.. ఇంకా ఎవరు ఫైనలైజ్ కాలేదు. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను తీసుకున్నారు. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమ ా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీటైంది. పాటలు మాత్రమే బ్యాలన్స్ ఉన్నాయి. గోవాలో ఈ  పాటలను పిక్చరైజ్ చేయనున్నారు. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది.

    NBK : బాలకృష్ణ ఇండస్ట్రీ హిట్ మూవీ ‘సమరసింహారెడ్డి’ మూవీలో ముందుగా అనుకున్న హీరో ఎవరంటే..

    మరోవైపు శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అఘోరాగా బాలయ్య గెటప్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Akhanda, Balakrishna, Gopichand malineni, NBK 107, Tollywood

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు