NBK GOPICHAND MALINENI BALAKRISHNAMOVIE TITLE MAY CONSIDER AS JAI BALAYYAHERE ARE THE DETAILS TA
NBK - Gopichand Malineni: బాలయ్య సినిమాకు గోపీచంద్ మలినేని అలాంటి టైటిల్ పెడతాడా.. ఫ్యాన్స్ రియాక్షన్ ఎలా ఉంటుందో..
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (File/Photo)
NBK - Gopichand Malineni: నందమూరి బాలకృష్ణ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా ఈ సినిమా కోసం మరో పేరు చక్కర్లు కొడుతోంది.
NBK - Gopichand Malineni: నందమూరి బాలకృష్ణ త్వరలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నెక్ట్స్ మూవీ చేయనున్నారు. ఈ సినిమా కోసం ఇప్పటికే పలు టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ టైటిల్ ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. రీసెంట్గా బాలకృష్ణ (Balakrishna), గోపీచంద్ మలినేని (Gopichand Malineni) సినిమాకు పవర్ఫుల్ టైటిల్‌ను ఫిల్మ్ ఛాంబర్లో రిజిస్టర్ చేయించారట. ఏ సినిమాకైనా టైటిల్ ఇంపార్టెంట్. పేరును బట్టి అది ఎలాంటి సినిమానో ప్రేక్షకులు కూడా ఒక అంచనాకు వస్తారు. ఇక నందమూరి అందగాడు నట సింహా బాలకృష్ణ సినిమా అంటేనే పవర్ఫుల్ టైటిల్ ఉండాల్సిందే. త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న బాలయ్య, గోపీచంద్ మలినేని సినిమాకు కూడా ఓ పవర్ఫుల్ టైటిల్ అనుకుంటున్నారు. ముందుగా ఈ సినిమాకు ‘రౌడీయిజం’ (Rowdyism) అనే టైటిల్‌ను పెడుతున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ టైటిల్ పై జరుగుతున్న ప్రచారాన్ని మైత్రీ మూవీ మేకర్స్ వాళ్లు ఖండించిన సంగతి తెలిసిందే కదా.
మేమె సరైన సమయంలో టైటిల్ ఏంటో ప్రకటిస్తామని చెప్పారు. ప్రస్తుతం మైత్రీ మూవీ మేకర్స్ పలువురు హీరోలతో వరుసగా సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ కోవలో బాలకృష్ణ సినిమా కోసం ‘జై బాలయ్య’ (Jai Balayya) అనే టైటిల్ రిజిస్టర్ చేయించినట్టు సమాచారం. ఇక అభిమానులు కూడా జై బాలయ్య అంటూ తమ అభిమాన హీరోను ముద్దుగా పిలుస్తుంటారు. ఇపుడు అదే టైటిల్‌ను ఈ సినిమాకు ఫిక్స్ చేస్తే.. ఈ సినిమాకు మరింత హైప్ క్రియేట్ కావడం పక్కా అని చెప్పొచ్చు. అంతేకాదు త్వరలో ఈ టైటిల్‌ను కూడా అఫీషియల్‌గా ప్రకటించనున్నట్టు సమాచారం.
బాలకృష్ణ పుట్టినరోజు సంరద్భంగా మైత్రీ మూవీ మేకర్స్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను గోపీచంద్ మలినేని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తనదైన శైలిలో యాక్షన్ ఓరియంటెడ్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు.
ఈ సినిమాలో బాలయ్య మరోసారి డ్యూయల్ రోల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఒక పాత్ర ఫ్యాక్షనిస్ట్ పాత్ర అయితే.. మరోకటి పవర్ఫుల్ పోలీస్ పాత్ర అని చెబుతున్నారు. ‘చెన్నకేశవరెడ్డి’ తరహాలో తండ్రి కొడుకులు నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్టు సమాచారం.
ఈ సినిమా బాలయ్య సరసన పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలనకు వచ్చినా.. ఇంకా ఎవరు ఫైనలైజ్ కాలేదు. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్ఫుల్ లేడీ క్యారెక్టర్ కోసం వరలక్ష్మి శరత్ కుమార్‌ను తీసుకున్నారు.
ఇక బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమ ా షూటింగ్‌కు రీసెంట్గా గుమ్మడికాయ కొట్టేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మరోవైపు శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అఘోరాగా బాలయ్య గెటప్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Published by:Kiran Kumar Thanjavur
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.