Home /News /movies /

NBK GOPICHAND MALINENI BALAKRISHNA MOVIE VARALAXMI SARATHKUMAR PLAY CRUCIAL ROLE HERE ARE THE DETAILS TA

NBK - Gopichand Malineni: బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో జయమ్మ కీలక పాత్ర..

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ (Twitter/Photo)

బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ (Twitter/Photo)

NBK - Gopichand Malineni: బాలకృష్ణ పుట్టినరోజు సంరద్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ కీ రోల్ పోషించనుంది.

ఇంకా చదవండి ...
    NBK - Gopichand Malineni: బాలకృష్ణ పుట్టినరోజు సంరద్భంగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య 107 సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన చేసిన సంగతి తెలిసిందే కదా. ఈ సినిమాను గోపీచంద్ మలినేని నిజ జీవిత సంఘటనల ఆధారంగా తనదైన శైలిలో యాక్షన్ ఓరియంటెడ్‌గా ఈ సినిమాను తెరకెక్కించనున్నారు. ఈ సినిమా బాలయ్య సరసన పలువురు హీరోయిన్స్ పేర్లు పరిశీలనకు వచ్చినా.. ఇంకా ఎవరు ఫైనలైజ్ కాలేదు. మరోవైపు ఈ సినిమాలో మరో పవర్‌ఫుల్ లేడీ క్యారెక్టర్ ఉందట. ఈ పాత్రను వరలక్ష్మి శరత్ కుమార్‌తో చేయనున్నట్టు ఆమె రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

    నాకు ఇష్టమైన దర్శకుడు గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య హీరోగా నటిస్తోన్న సినిమా కోసం పని చేయడం ఆనందంగా ఉందన్నారు. సెట్‌లో ఎపుడు అడుగుపెట్టేందకు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్టు తెలిపారు.

    ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ‘అఖండ’ సినిమ ా చేస్తోన్న సంగతి తెలిసిందే కదా. ఇప్పటికే కొంత భాగం షూటింగ్ మినహా ఈ సినిమా షూటింగ్ పూర్తైయింది. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ నటిస్తోంది. మరోవైపు శ్రీకాంత్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. జగపతి బాబు మరో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అఘోరాగా బాలయ్య గెటప్‌‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:

    Tags: Balakrishna, Gopichand malineni, Tollywood, Varalaxmi Sarathkumar

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు