news18-telugu
Updated: November 21, 2020, 6:38 AM IST
బాలకృష్ణ (Twitter/Photo)
BB3 | బాలయ్య ప్రస్తుతం బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. అయితే ఈ చిత్రంలో హీరోయిన్స్ ఎవరనే విషయం పూటకో వార్త హల్చల్ చేసింది. తాజాగా ఈ చిత్రంలో బాలయ్య సరసన అఖిల్ ఫేమ్ సయేషా సైగల్తో జోడీ కట్టబోతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు యూనిట్. వెల్కమ్ టూ బోర్డ్ అంటూ సయేషా పోస్టర్ విడుదల చేసారు. ఈ చిత్రంలో ఇద్దరు హీరోయిన్స్ ఉండబోతున్నారు. ముందుగా ఇందులో మలయాళ హీరోయిన్ ప్రయాగ మార్టిన్ పేరు వినిపించింది. అయితే స్క్రీన్ టెస్ట్ చేసిన తర్వాత ఎందుకో బాలయ్యకు జోడీగా అంతగా సరిపోలేదు. దాంతో బోయపాటి ఈమెను కాదని అమలా పాల్‌ను అనుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ ఫైనల్‌గా సయేషాను ఫైనల్ చేసారు.

బాలయ్య సయేషా సైగల్ (balakrishna sayyesha saigal)
అఖిల్ సినిమా తర్వాత తెలుగులో సయేషా మళ్లీ కనిపించలేదు. తమిళ ఇండస్ట్రీకి వెళ్లి అక్కడ వరస సినిమాలు చేసింది. గజినీకాంత్లో తనతో పాటు నటించిన ఆర్యను పెళ్లి చేసుకుంది సయేషా. పెళ్ళి తర్వాత కూడా వరస సినిమాలు చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. అందులో భాగంగానే తెలుగులో బాలయ్య సినిమాకు కూడా ఓకే చెప్పింది. తాజాగా ఈ సినిమాలో మరో హీరోయిన్గా వరుణ్ తేజ్.. కంచె ఫేమ్ ‘ప్రగ్యా జైస్వాల్ మరో కథానాయికగా బాలయ్య సరసన ఎంపిక చేసారు.కంచె తర్వాత ఈమె నాగార్జున, రాఘవేంద్రరావు కలయికలో వచ్చిన ‘ఓం నమో వేంకటేశాయ’ సినిమాలో నటించింది. ఆ తర్వాత సరైన అవకాశాలు లేక ఫోటో షూట్స్‌లో కాలం గడిపిస్తోంది. ఈ శనివారం నుంచి రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రగ్యా జైస్వాల్ షూటింగ్లో అడుగుపెట్టనుంది. ఈ షెడ్యూల్లో బాలయ్యతో పాటు ప్రగ్యా పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.

బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ (fFile/Photo)
ఇక హాట్ బ్యూటీ నమిత రాజకీయ నాయకురాలి పాత్రలో కనిపించబోతుంది. ప్రతినాయక పాత్రలో ఈమె నటిస్తుందని ప్రచారం జరుగుతుంది. గతంలో సింహా సినిమాలో కలిసి నటించారు బాలయ్య, నమిత. మరోవైపు ఢీ ఛాంపియన్స్ పూర్ణ మరో కథానాయికగా నటించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. వచ్చే ఏడాది సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో మరో ముఖ్య పాత్రలో అల్ల నరేష్ నటించబోతున్నట్టు సమాచారం. ఇంకోవైపు ఈ చిత్రంలో బాలయ్య కవల సోదరులతో పాటు వాళ్ల తండ్రిగా త్రిపాత్రాభినయం చేయబోతున్నట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. మరి చూడాలి ఇందులో రెండు పాత్రలతోనే సరిపెడతారా ? లేకపోతే.. మూడో క్యారెక్టర్ చేస్తాడా అనేది చూడాల్సిందే.
Published by:
Kiran Kumar Thanjavur
First published:
November 21, 2020, 6:38 AM IST