NBK - BB3: బాలకృష్ణ బీబీ 3లో విలన్‌గా కోలీవుడ్ స్టార్ హీరో.. అలా ప్లాన్ చేసిన బోయపాటి శ్రీను..

నందమూరి బాలకృష్ణ, (Twitter/Photo)

NBK  _ BB3|  ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో కోలీవుడ్ స్టార్ హీరో విలన్‌గా నటించబోతున్నట్టు సమాచారం.

  • Share this:
    NBK  _ BB3|  ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది.  ఈ  సినిమాను మహానటుడు ఎన్టీఆర్ జయంతి మే 28న  రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు.   సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు ‘గాడ్ ఫాదర్’ అనే టైటిల్ దాదాపు ఖరారైంది. మరోవైపు ఈ సినిమాకు   ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో కవల సోదరులుగా నటిస్తున్నాడు. అంతేకాదు ఒకటి అఘోర పాత్ర అయితే.. మరొకటి కలెక్టర్ పాత్ర అని చెబుతున్నారు. ఈ సినిమాలో బాలయ్యకు ఢీ కొట్టే విలన్ పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నాడు.

    గతంలో ఈయన బాలకృష్ణ, బాపు కలయికలో వచ్చిన ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో లక్ష్మణుడిగా నటించిన సంగతి తెలిసిందే కదా. ఇపుడు మరోసారి వీళ్లిద్దరు కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో మరో విలన్ పాత్ర ఉందట. ఈ క్యారెక్టర్ కోసం శరత్ కుమార్‌ను తీసుకున్నట్టు సమాచారం. త్వరలో రత్ కుమార్ ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కానున్నాడు. అంతేకాదు బాలయ్య, శరత్ కుమార్ మధ్య ఓ ఫైట్ సీన్ కూడా ఉందట. ఈ సినిమాలో ఇదే హైలెట్ కానున్నట్టు సమాచారం.

    బాలయ్యను ఢీ కొట్టే విలన్ పాత్రలో శరత్ కుమార్ (File/Photo)


    ఇక ఈ సినిమా క్లైమాక్స్‌ను కర్ణాటకలోని దండేలి అభయారణ్యంలో పిక్చరైజ్ చేస్తున్నాడు. ఏప్రిల్ ఫస్ట్ వీక్ వరకు ఈ సినిమా క్లైమాక్స్ కంప్లీట్ చేసే దిశగా షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ద్వారక క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

    Pragya Jaiswal Says Balakrishna is a Energy Power House Here Are The Details,Pragya Jaiswal: బాలకృష్ణపై ప్రగ్యా జైస్వాల్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇంతకీ ఏందంటే..,pragya jaiswal,Pragya Jaiswal Balakrishna,Balakrishna Is Power House,Balayya,pragya jaiswal movies,pragya jaiswal interview, pragya jaiswal songs,pragya jaiswal scenes,pragya jaiswal romance,pragya jaiswal video songs,ప్రగ్యా జైస్వాల్,ప్రగ్యా జైస్వాల్ హాట్,ప్రగ్యా జైస్వాల్,బాలకృష్ణను పవర్‌ హౌస్‌తో పోల్చిన ప్రగ్యా జైస్వాల్
    బాలకృష్ణ, ప్రగ్యా జైస్వాల్ (fFile/Photo)


    మరోవైపు బాలయ్య బోయపాటి శ్రీను తర్వాత వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఆ సంగతి పక్కన పెడితే.. బాలకృష్ణ రీసెంట్‌గా రవితేజ‌తో ‘క్రాక్’ వంటి పోలీస్ మాస్ యాక్షన్ మూవీతో మెప్పించిన గోపీచంద్ మలినేనితో నెక్ట్స్ మూవీ చేస్తున్నాడు. మేలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. దాంతో పాటు సంతోష్ శ్రీనివాస్, అనిల్ రావిపూడితో వరుస ప్రాజెక్టులు చేయడానికి బాలయ్య రెడీ అవుతున్నట్టు సమాచారం.
    Published by:Kiran Kumar Thanjavur
    First published: