హోమ్ /వార్తలు /సినిమా /

NBK-Boyapati: బాలకృష్ణ సినిమాకు మరో పవర్‌ఫుల్ టైటిల్..మరోసారి బోయపాటి మార్క్.

NBK-Boyapati: బాలకృష్ణ సినిమాకు మరో పవర్‌ఫుల్ టైటిల్..మరోసారి బోయపాటి మార్క్.

బాలకృష్ణ (Twitter/Photo)

బాలకృష్ణ (Twitter/Photo)

NBK-Boyapati | ప్రస్తుతం  టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుదర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కోసం మరో పవర్‌ఫుల్ టైటిల్‌ను అనుకుంటున్నారు.

ఇంకా చదవండి ...

  NBK-Boyapati | ప్రస్తుతం  టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుదర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమా కోసం ఇప్పటికే పలు టైటిల్స్ పరీశీలించారు. తాజాగా ఈ సినిమాకు మరో పవర్‌ఫుల్ టైటిల్‌ను పరిశీలిస్తున్నారు. ఇక బాలయ్య.. బోయపాటి సినిమా విషయానికొస్తే..  ఇప్పటికే వారణాసిలో ఈ మూవీ  ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కరోనా కారణంగా అన్ని సినిమాల మాదరిగానే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్ నిబంధలను సడలించింది. దీంతో ముందుగా చిన్న హీరోల సినిమాలు, టీవీ సీరియల్స్‌ షూటింగ్స్  ప్రారంభమయ్యాయి. కానీ బడా స్టార్ హీరోలు మాత్రం రంగంలోకి దిగలేదు. ఇపుడిపుడే అందరు రంగంలోకి దిగుతున్నారు. ముందుగా అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగార్జున, నాగ చైతన్య షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో మిగతా హీరోలు కూడా మేము సైతం అంటూ రంగంలోకి దిగడానికి రెడీ అయ్యారు. తాజాగా బాలకృష్ణ కూడా దసరా తర్వాత నవంబర్ ఫస్ట్ వీక్‌లో ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ కావడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

  బాలయ్యకు సలహాలు సూచనలు ఇస్తున్న బోయపాటి శ్రీను

  ఇప్పటికే బోయపాటి శ్రీను రంగంలోకి దిగి లోకేషన్ వేటలో పడిపోయాడట. బాలయ్య వచ్చే లోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి రెడీగా పెట్టే ఆలోచనలో ఉన్నాడట. ఇక ఈ సినిమాకు  ఏ టైటిల్ పెట్టాలనే దానిపై బోయపాటి శ్రీను మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇక బాలయ్య సినిమా అంటే టైటిల్ పవర్ఫుల్‌గా ఉండాల్సిందే. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాకు పలు టైటిల్స్ ముందు నుంచి ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి BB3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కవల సోదరులు పాత్రలో నటిస్తున్నారు.  అందులో ఒక క్యారెక్టర్ అఘోరా అయితే.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని చెబుతున్నారు.

  బాలకృష్ణ (File/Photo)

  ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోర్ అదేనండి టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన ప్రగ్యా మార్టిన్ అనే మలయాళీ భామను తెలుగులో పరిచయం చేయబోతున్నారు.  మరోవైపు సిమ్రాన్ మరో కథానాయికగా నటించబోతున్నట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాలో మరో లేడీ ఓరియంటెడ్ పాత్ర ఉందని చెబుతున్నారు. ఆ క్యారెక్టర్ కోసం సీనియర్ హీరోయిన్ జయప్రదను సంప్రదించి సినిమాలో ఆమె పాత్ర గురించి చెప్పారట. వెంటనే జయప్రద ఈ సినిమాలో ఆ పాత్ర చేయడానికి ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలో జయప్రద క్యారెక్టర్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. గతంలో జయప్రద బాలకృష్ణ హీరోగా నటించిన ‘మహారథి’లో హీరో అత్త పాత్రలో నటించిన సంగతి తెలిసిందే కదా.

  బాలకృష్ణ,జయప్రద (Twitter/Photo)

  మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సహాయకుడి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ వుందట. ఈ క్యారెక్టర్ కోసం పలువురు హీరోల పేర్లు పరిశీలించిన చిత్ర బృందం తాజాగా అల్లరి నరేష్‌తో ఈ పాత్ర చేయించాలని చూస్తోంది.ఇప్పటికే దర్శకుడు బోయపాటి శ్రీను అల్లరి నరేష్‌కు కలిసి ఈ పాత్ర ఎంత పవర్ఫుల్లో వివరించాడట. దీంతో అల్లరి నరేష్ ఈ  సినిమాలో యాక్ట్ చేయడాకి ఒప్పుకున్నట్టు సమాచారం.

  Balakrishna Boyapati Srinu movie titled as Danger this is allari naresh old movie title,balakrishna boyapati srinu danger title,BB3,Balakrishna boyapati srinu 3,boyapati srinu twitter,balakrishna allari naresh,balakrishna movie title danger allari naresh,allari naresh,balakrishna twitter,balakrishna new movie,boyapati srinu movies,boyapati srinu,balakrishna new movie teaser,balayya boyapati srinu movie,balakrishna and boyapati srinu movies,balakrishna and boyapati srinu new movie launch,boyapati srinu and balakrishna new movie launch,balakrishna boyapati srinu 106 movie monark first look teaser,balakrishna latest movie,balakrishna new movie updates,balakrishna movies,balakrishna boyapati srinu,balakrishna boyapati first look,balakrishna boyapati srinu movie teaser,BB3 teaser,బాలయ్య బోయపాటి శ్రీను,బాలయ్య సినిమా టీజర్ బోయపాటి శ్రీను,bb3 టీజర్,బాలయ్య బోయపాటి డేంజర్,అల్లరి నరేష్ టైటిల్‌తో బాలకృష్ణ బోయపాటి శ్రీను మూవీ,అల్లరి నరేష్ డేంజర్ టైటిల్ పై మనసు పడ్డ బాలయ్య,
  అల్లరి నరేష్, బాలకృష్ణ (File/Photo)

  గతేడాది మహేష్ బాబు.. ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్ స్నేహితుడి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక థమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో విలన్‌గా సోనూసూద్ యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇక చిత్రానికి ముందుగా ‘మోనార్క్’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘సూపర్ మేన్’, మొనగాడు, డేంజర్, యమ డేంజర్ అనే పేర్లు పరిశీలనకు వచ్చాయి. తాజాగా ‘టార్చ్ బెరర్’ అనే టైటిల్ పరిశీలనకు వచ్చింది. చివరగా బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాకు ఎలాంటి టైటిల్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది.

  Published by:Kiran Kumar Thanjavur
  First published:

  Tags: Balakrishna, Balayya, Boyapati Srinu, NBK 106, Tollywood

  ఉత్తమ కథలు