NBK BB3: టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుదర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. BB3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కరోనా కారణంగా అన్ని సినిమాల మాదరిగానే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. రీసెంట్‌గా ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. బాలయ్య ఈ నెల 15 నుంచి షూటింగ్‌లో పాల్గొననున్నారు. అప్పటి వరకు మిగతా ఆర్టిస్టులపై సన్నివేశాలను తెరకెక్కిస్తున్నాడు బోయపాటి శ్రీను. ఈ చిత్రంలో బాలయ్య సరసన మలయాళ భామ ప్రయాగ మార్టిన్ హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఈ భామకు ఇదే ఫస్ట్ మూవీ.
ఈ సినిమాలో ఈమెనే కాకుండా మరో హీరోయిన్‌కు ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇపుడా క్యారెక్టర్ కోసం హీరోయిన్ పూర్ణను సెలెక్ట్ చేసినట్టు సమాచారం.పూర్ణ ఇప్పటి వరకు తెలుగులో అల్లరి నరేష్ సహా పెద్ద హీరోల సరసన నటించలేదు. ఒక రకంగా స్టార్ హీరోతో ఆమె నటించడం ఇదే ఫస్ట్ టైమ్ అనే చెప్పాలి. ఈ సినిమాలో హీరో సహాయకుడి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ ఉంది. ఈ పాత్ర కోసం అల్లరి నరేష్ సహా పలువురు పేర్లను పరిశీలిస్తున్నారు. ఫైనల్‌గా ఎవరిని సెలెక్ట్ చేస్తారో చూడాలి.
షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాను శాటిలైట్ హక్కులు దాదాపు రూ. 11. 5 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. మరోవైపు డిజిటల్ హక్కులు కూడా రూ. 9 కోట్లకు అమ్ముడు పోయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. హీరోగా బాలకృష్ణకు ఇది 106వ సినిమా. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.
మరోవైపు ఈ సినిమాకు ఏ టైటిల్ పెట్టాలనే దానిపై బోయపాటి శ్రీను మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇక బాలయ్య సినిమా అంటే టైటిల్ పవర్ఫుల్‌గా ఉండాల్సిందే. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాకు పలు టైటిల్స్ ముందు నుంచి ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి BB3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కవల సోదరులు పాత్రలో నటిస్తున్నారు. అందులో ఒక క్యారెక్టర్ అఘోరా అయితే.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని చెబుతున్నారు.
ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది .ఇక చిత్రానికి ముందుగా ‘మోనార్క్’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘సూపర్ మేన్’, మొనగాడు, డేంజర్, యమ డేంజర్, ’టార్చ్ బేరర్’ అనే పేర్లు పరిశీలనకు వచ్చాయి. బాలయ్య, బోయపాటి సినిమాకు ఫైనల్‌గా ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాకు ఏ టైటిల్ పెడతారనేది చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Balakrishna, Balayya, BB3, Boyapati Srinu, Poorna (Shamna Kasim), Tollywood