NBK BB3: రంగంలోకి దిగిన నట సింహం బాలకృష్ణ.. షూటింగ్ స్టార్ట్ చేసిన బోయపాటి శ్రీను..

NBK BB3: ప్రస్తుతం  టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుదర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. BB3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. తాజాగా ఈ రోజు నుంచి బాలయ్య ఈ సినిమా షూటింగ్ కోసం రంగంలోకి దిగాడు.

news18-telugu
Updated: October 29, 2020, 11:03 AM IST
NBK BB3: రంగంలోకి దిగిన నట సింహం బాలకృష్ణ.. షూటింగ్ స్టార్ట్ చేసిన బోయపాటి శ్రీను..
రంగంలోకి దిగిన బాలకృష్ణ (Twitter/Photo)
  • Share this:
NBK BB3: ప్రస్తుతం  టాలీవుడ్ సీనియర్ టాప్ హీరో బాలకృష్ణ.. బోయపాటి శ్రీనుదర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్నసంగతి తెలిసిందే కదా. BB3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై టాలీవుడ్‌లో భారీ అంచనాలే ఉన్నాయి. సింహా, లెజెండ్ లాంటి విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో అంచనాలు అయితే తారాస్థాయిలో ఉన్నాయి. ఇప్పటికే వారణాసిలో ఓ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత కరోనా కారణంగా అన్ని సినిమాల మాదరిగానే ఈ సినిమా షూటింగ్ ఆగిపోయింది. తాజాగా ప్రభుత్వం కరోనా లాక్‌డౌన్ నిబంధలను సడలించింది. దీంతో ముందుగా చిన్న హీరోల సినిమాలు, టీవీ సీరియల్స్‌ షూటింగ్స్  ప్రారంభమయ్యాయి. కానీ బడా స్టార్ హీరోలు మాత్రం రంగంలోకి దిగలేదు. ఇపుడిపుడే అందరు రంగంలోకి దిగుతున్నారు. ముందుగా అక్కినేని ఫ్యామిలీకి చెందిన నాగార్జున, నాగ చైతన్య,అఖిల్ షూటింగ్‌లో పాల్గొన్నారు. దీంతో మిగతా హీరోలు కూడా మేము సైతం అంటూ రంగంలోకి దిగడానికి రెడీ అయ్యారు. తాజాగా బాలకృష్ణ కూడా ఈ రోజు నుంచి షూటింగ్‌లో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన సమాచారాన్ని బోయపాటి శ్రీను తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.


షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా డిజిటల్, శాటిలైట్ హక్కులు భారీ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడు పోయినట్టు సమాచారం. తాజాగా ఈ సినిమాను శాటిలైట్ హక్కులు దాదాపు రూ. 11. 5 కోట్లకు  అమ్ముడుపోయినట్టు సమాచారం. మరోవైపు డిజిటల్ హక్కులు కూడా రూ. 9 కోట్లకు అమ్ముడు పోయినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. హీరోగా బాలకృష్ణకు ఇది 106వ సినిమా. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

NBK Boyapati Srinu New Plan For Balakrishna BB 3 Film Here are the Details,balakrishna, balakrishna boyapati srinu danger title,balakrishna boyapati srinu,simran,balakrishna simran boyapati srinu,simran,boyapati srinu twitter,balakrishna twitter,balakrishna new movie,boyapati srinu movies,boyapati srinu,balakrishna new movie teaser,balayya boyapati srinu movie,balakrishna and boyapati srinu movies,balakrishna and boyapati srinu new movie launch,boyapati srinu and balakrishna new movie launch,balakrishna boyapati srinu 106 movie monark first look teaser,balakrishna latest movie,balakrishna new movie updates,balakrishna movies,balakrishna boyapati srinu,balakrishna boyapati first look,balakrishna boyapati srinu movie teaser,BB3 teaser,బాలయ్య బోయపాటి శ్రీను,బాలయ్య సినిమా టీజర్ బోయపాటి శ్రీను,bb3 టీజర్,బాలయ్య బోయపాటి డేంజర్,బాలకృష్ణ సిమ్రాన్,సిమ్రాన్,మరోసారి జోడిగా బాలకృష్ణ సిమ్రాన్
బాలకృష్ణ, బోయపాటి శ్రీను (File/Photo)


మరోవైపు ఈ సినిమాకు  ఏ టైటిల్ పెట్టాలనే దానిపై బోయపాటి శ్రీను మల్లగుల్లాలు పడుతున్నాడు. ఇక బాలయ్య సినిమా అంటే టైటిల్ పవర్ఫుల్‌గా ఉండాల్సిందే. ఇక వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వస్తోన్న ఈ సినిమాకు పలు టైటిల్స్ ముందు నుంచి ప్రచారంలో ఉన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రానికి BB3 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో బాలయ్య కవల సోదరులు పాత్రలో నటిస్తున్నారు.  అందులో ఒక క్యారెక్టర్ అఘోరా అయితే.. మరొకటి ఫ్యాక్షనిస్ట్ పాత్ర అని చెబుతున్నారు.

బాలకృష్ణ (File/Photo)


ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ రోర్ అదేనండి టీజర్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన మలయాళ భామ ప్రయాగ మార్టిన్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనుంది.  మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సహాయకుడి పాత్రకు మంచి ఇంపార్టెన్స్ వుందట. ఈ క్యారెక్టర్ కోసం పలువురు హీరోల పేర్లు పరిశీలించిన చిత్ర బృందం తాజాగా అల్లరి నరేష్‌తో ఈ పాత్ర చేయించాలని చూస్తోంది.ఇప్పటికే దర్శకుడు బోయపాటి శ్రీను అల్లరి నరేష్‌కు కలిసి ఈ పాత్ర ఎంత పవర్ఫుల్లో వివరించాడట. దీంతో అల్లరి నరేష్ ఈ  సినిమాలో యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నట్టు సమాచారం.

Balakrishna Boyapati Srinu movie titled as Danger this is allari naresh old movie title,balakrishna boyapati srinu danger title,BB3,Balakrishna boyapati srinu 3,boyapati srinu twitter,balakrishna allari naresh,balakrishna movie title danger allari naresh,allari naresh,balakrishna twitter,balakrishna new movie,boyapati srinu movies,boyapati srinu,balakrishna new movie teaser,balayya boyapati srinu movie,balakrishna and boyapati srinu movies,balakrishna and boyapati srinu new movie launch,boyapati srinu and balakrishna new movie launch,balakrishna boyapati srinu 106 movie monark first look teaser,balakrishna latest movie,balakrishna new movie updates,balakrishna movies,balakrishna boyapati srinu,balakrishna boyapati first look,balakrishna boyapati srinu movie teaser,BB3 teaser,బాలయ్య బోయపాటి శ్రీను,బాలయ్య సినిమా టీజర్ బోయపాటి శ్రీను,bb3 టీజర్,బాలయ్య బోయపాటి డేంజర్,అల్లరి నరేష్ టైటిల్‌తో బాలకృష్ణ బోయపాటి శ్రీను మూవీ,అల్లరి నరేష్ డేంజర్ టైటిల్ పై మనసు పడ్డ బాలయ్య,
అల్లరి నరేష్, బాలకృష్ణ (File/Photo)


గతేడాది మహేష్ బాబు.. ‘మహర్షి’ సినిమాలో అల్లరి నరేష్ స్నేహితుడి పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే కదా. ఇక థమన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలో విలన్‌గా సోనూసూద్ యాక్ట్ చేయనున్నట్టు సమాచారం. ఇక చిత్రానికి ముందుగా ‘మోనార్క్’ అనే టైటిల్ పెడతారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత ‘సూపర్ మేన్’, మొనగాడు, డేంజర్, యమ డేంజర్, ’టార్చ్ బేరర్’  అనే పేర్లు పరిశీలనకు వచ్చాయి. బాలయ్య, బోయపాటి సినిమాకు ఫైనల్‌గా ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. మొత్తంగా బాలయ్య, బోయపాటి శ్రీను సినిమాకు ఏ టైటిల్ పెడతారనేది ఆసక్తికరంగా మారింది.
Published by: Kiran Kumar Thanjavur
First published: October 29, 2020, 11:02 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading