Balakrishna - Trisha: నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా టైటిల్ టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ టీజర్ 53 మిలియన్ వ్యూస్ రాబట్టింది. ‘అఖండ’ సినిమా తర్వాత క్రాక్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమాను చేయనున్నారు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవలే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చేసింది. గోపిచంద్ గతంలో డాన్ శీను, బలుపు, పండగ చేస్కో లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ బాగా ఆకట్టుకుంది. అంతేకాదు ఈ చిత్రంలో బాలయ్య పోలీస్ ఆఫీసర్, ఫ్యాక్షనిస్టుగా రెండు విభిన్న పాత్రల్లో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా గోపీచంద్ మలినేని బాలయ్య కోసం పల్నాటి ప్రాంతానికి చెందిన ఓ చరిత్రకారుడి కథ ఆధారంగా తెరకెక్కించబోతున్నట్టు సమాచారం.
జూలై నుండి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం. వచ్చే సంక్రాంతికి సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్రబృందం. అందుకే ఇందులో ఇద్దరు హీరోయిన్లు ఉండనున్నారు.ఇక ఒక హీరోయిన్‌గా శ్రుతిహాసన్ అనే టాక్ వినిపిస్తోంది. గోపిచంద్ మలినేనికి శ్రుతిహాసన్ లక్కీ హీరోయిన్‌గా మారింది. ఆమెతో చేసిన ‘బలుపు, క్రాక్’ రెండూ మంచి విజయాలను అందుకున్నాయి. దీంతో గోపీచంద్ మరోసారి శృతి హాసన్‌ను హీరోయిన్‌గా తీసుకోనున్నారట. ప్రస్తుతం శృతి హాసన్ ప్రభాస్‌తో సలార్ అనే సినిమా చేస్తోంది. ఈ సినిమాకు ప్రశాంత్ నీల్ దర్శకుడు. ప్రభాస్ హీరోగా చేస్తున్నారు. ఈ సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా వస్తోంది. మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సరసన త్రిష హీరోయిన్‌గా నటించనున్నట్టు సమాచారం. గతంలో వీళ్లిద్దరు కలిసి ‘లయన్’ సినిమాలో జోడిగా నటించారు. ఇపుడు మరోసారి గోపీచంద్ బాలయ్య, త్రిషల జోడి కనిపించనుంది. ఈ సినిమాను బాలయ్య పుట్టినరోజన అధికారికంగా పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేసిన.. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు.
మరోవైపు ఈ చిత్రంలో బాలయ్య సరసన సీనియర్ హీరోయిన్ మీనా పేరును కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం. ఇక బాలయ్య చేస్తోన్న అఖండ సినిమా విషయానికి వస్తే.. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. అఖండ మే 28న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ డ్యుయల్ రోల్ చేస్తున్నారు. అందులో భాగంగా ఒక పాత్రలో బాలయ్య అఘోరా లుక్ లో కనిపిస్తారని సమాచారం. ఇక ఈ సినిమాకు బిజినెస్ ఓ రేంజ్‌లో జరిగిందని తెలుస్తోంది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని హాట్ స్టార్ సంస్థ దక్కించుకుందని సమాచారం. అందులో భాగంగా స్ట్రీమింగ్ రైట్స్ కోసం ఏకంగా 9 నుంచి 10 కోట్ల రూపాయల వరకు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు థియేట్రికల్ రైట్స్ కూడా భారీ ధరకు అమ్ముడు పోయాయని సమాచారం. అంతేకాదు ఈ అఖండ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ ఫిగర్స్ టచ్ చెయ్యనున్నట్టుగా సమాచారం అందుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Akhanda, Boyapati Srinu, Gopichand malineni, NBK, Shruti haasan, Telugu Cinema, Tollywood, Trisha