HOME »NEWS »MOVIE »nbk balakrishna nandamuri will work with krack movie director gopichand malineni here are the details ta

NBK: బోయపాటి శ్రీను సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడితో బాలయ్య నెక్ట్స్ మూవీ.. ?

NBK: బోయపాటి శ్రీను సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడితో బాలయ్య నెక్ట్స్ మూవీ.. ?
బాలకృష్ణ Photo : Twitter

BB3 |  ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తర్వాత బాలయ్య.. బ్లాక్ బస్టర్ దర్శకుడితో నెక్ట్స్ మూవీ చేయనున్నట్టు సమాచారం.

  • Share this:
    BB3 |  ప్రస్తుతం నందమూరి నట సింహం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ చిత్ర షూటింగ్ కూడా వేగంగానే జరుగుతుంది. సింహా, లెజెండ్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి. ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన టైటిల్‌ను జనవరి 26న గణతంత్య్ర దినోత్సవం సందర్భంగా రివీల్ చేసే అవకాశం ఉంది. ఈ సినిమాకు ‘టార్చ్ బేరర్’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో బాలకృష్ణ మరోసారి డ్యూయల్ రోల్లో కవల సోదరులుగా నటిస్తున్నాడు. అంతేకాదు ఒకటి అఘోర పాత్ర అయితే.. మరొకటి కలెక్టర్ పాత్ర అని చెబుతున్నారు.

    మరోవైపు బాలయ్య బోయపాటి శ్రీను తర్వాత వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే బాలకృష్ణ.. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాకు ‘బలరామయ్య బరిలోదిగితే’ అనే టైటిల్ అనుకుంటున్నారు.ఆ సంగతి పక్కన పెడితే.. బాలకృష్ణ రీసెంట్‌గా రవితేజ‌తో ‘క్రాక్’ వంటి పోలీస్ మాస్ యాక్షన్ మూవీతో మెప్పించి సంక్రాంతి విజేతగా నిలిచింది. అంతేకాదు కరోనా తర్వాత రిలీజై.. బ్లాక్ బస్టర్ టాక్‌ సొంతం చేసుకున్న తొలి మూవీగా రికార్డులకు ఎక్కింది. అంతేకాదు ఈ సినిమా సక్సెస్‌తో నిర్మాతలకు హీరోలకు ఓ భరోసా వచ్చింది.



    NBK Balakrishna Nandamuri Will Work With Krack Movie Director Gopichand Malineni Here Are The Details, NBK: బోయపాటి శ్రీను సినిమా తర్వాత బ్లాక్ బస్టర్ దర్శకుడితో బాలయ్య నెక్ట్స్ మూవీ.. ?,balakrishna,Gopichand Malineni,Gopichand Malineni,balakrishna boyapati movie,Balakrishna Sanathosh Srinivas,Santhosh Srinivas,Pragya Jaiswal,Balakrishna Pragya Jaiswal,NBK Pragya Jaiswal,sayyeshaa saigal twitter,namitha hot photos,sayyeshaa saigal in balakrishna movie,namitha MLA balakrishna movie,balakrishna sayyesha saigal movie,telugu cinema,బాలయ్య సయేషా సైగల్,నమిత బాలయ్య,బోయపాటి బాలయ్య సినిమాలో విలన్‌గా నమిత,బాలకృష్ణ సరసన ప్రగ్యా జైస్వాల్,బాలయ్య సరసన ప్రగ్యా,సంతోష్ శ్రీనివాస్,సంతోష్ శ్రీనివాస్ నందమూరి బాలకృష్ణ,గోపీచంద్ మలినేని,బాలకృష్ణ గోపీచంద్ మలినేని కాంబినేషన్,గోపీచంద్ మలినేనితో బాలయ్య సినిమా
    బాలకృష్ణ, గోపీచంద్ మలినేని (File/Photo)


    తాజాగా ఈయన బాలకృష్ణతో ఓ సినిమా చేయనున్నట్టు టాలీవుడ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇప్పటికే గోపిచంద్ మలినేని .. బాలయ్య ఇమేజ్‌కు తగ్గ ఓ కథను వినిపించి ఓకే చేయించుకున్నట్టు సమాచారం.. త్వరలో ఈ కాంబినేషన్‌కు సంబంధించిన అఫీషియల్ ప్రకటన వెలుబడే అవకాశం ఉంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్త మైత్రీ మూవీ మేకర్స్ న నిర్మించే అవకాశం ఉంది. మరోవైపు బాలయ్య.. పూరీ జగన్నాథ్, అనిల్ రావిపూడితో పాటు శ్రీవాస్, బి.గోపాల్‌లతో నెక్ట్స్ ప్రాజెక్టులు ఓకే చేసినట్టు సమాచారం. మొత్తంగా బాలయ్య తన తదుపరి చిత్రాన్ని ఏ దర్శకుడితో చేస్తాడనేని ఆసక్తికరంగా మారింది.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:January 21, 2021, 21:01 IST

    टॉप स्टोरीज