HOME »NEWS »MOVIE »nbk balakrishna nandamuri vasundhara devi celebrates 38th wedding anniversary ta

NBK: నందమూరి నట సింహం బాలకృష్ణ జీవితంలో ఈ రోజు వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..

NBK: నందమూరి నట సింహం బాలకృష్ణ జీవితంలో ఈ రోజు వెరీ స్పెషల్.. ఎందుకో తెలుసా..
బాలకృష్ణ (File/Photo)

NBK: నందమూరి నట సింహం బాలకృష్ణ జీవితంలో ఈ రోజు వెరీ స్పెషల్.. బాలకృష్ణ విషయానికొస్తే..

  • Share this:
    NBK: నందమూరి నట సింహం బాలకృష్ణ జీవితంలో ఈ రోజు వెరీ స్పెషల్.. బాలకృష్ణ విషయానికొస్తే.. అన్న నందమూరి తారక రామారావు నట వారసుడిగా టాలీవుడ్‌లో అడుగుపెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు. తెలుగులో ఒక నట వారసుడిగా అడుగుపెట్టి 46 ఏళ్లుగా హీరోగా కొనసాగుతున్న హీరో మరెవరు లేరు. అంతేకాదు ఇప్పటికే కుర్ర హీరోలతో పోటీ పడుతూ వరుస సినిమాలు చేస్తున్నారు. 1974లో 14 ఏళ్లకే  ‘తాతమ్మ కల’ సినిమాతో బాల నటుడిగా అడుగుపెట్టాడు. అంతేకాదు తొలి సినిమాలోనే టైటిల్ పాత్ర అయిన తాతమ్మ కలను నెరవేర్చే ముని మనవడి పాత్రను బాలయ్య పోషించారు. ఆ తర్వాత నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. 14 ఏళ్లకే నటుడయిన బాలయ్య.. తన 22వ ఏట వసుంధరా దేవిని 1982 డిసెంబర్ 8న పెళ్లి చేసుకున్నారు. అప్పట్లో ఎన్టీఆర్ ఎన్నికల ప్రచారంలో ఉండటంతో  ఈ వేడుకకు హాజరు కాలేక పోయారు. అదే రోజు బాలకృష్ణ సోదరుడు రామకృష్ణ పెళ్లి వేరే ముహూర్తంలో జరిగింది.

    ఈ రోజు బాలకృష్ణ, వసుంధరా దేవిల వివాహా వార్షికోత్సవం. వారి పెళ్లైన 38 వసంతాలు పూర్తైంది.ఈ సందర్భంగా బాలయ్య అభిమానులతో పాటు ఆయన సన్నిహితులు వారికి వివాహా వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.వీరికి బ్రాహ్మాణి, తేజస్విని, మోక్షజ్ఞ ముగ్గురు పిల్లలు. ఇక బ్రాహ్మాణి భువనేశ్వరి,  ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేష్‌ను వివాహా మాడింది. మరోవైపు తేజస్విని పెళ్లి గీతం యూనివర్సిటీ అధినేత శ్రీ భరత్‌తో పెళ్లైంది. ఇక బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి నందమూరి అభిమానులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు.



    NBK Balakrishna Nandamuri Vasundhara Devi

    ప్రస్తుతం బాలయ్య బోయపాటి శ్రీను దర్శకత్వంలో పవర్ఫుల్ మాస్ ఎంటర్టేనర్ చేస్తున్నాడు.ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇంకోవైపు బాలయ్య పలువురు దర్శకులు చెప్పిన స్టోరీలను ఓకే చేసే పనిలో ఉన్నాడు.
    Published by:Kiran Kumar Thanjavur
    First published:December 08, 2020, 15:26 IST